Home /News /life-style /

DOES THE SKIN GLOW BEAUTIFULLY THEN USE THESE TIPS FOR A FEW DAYS THOUGH AND THE BEAUTY IS YOURS PRV

Skin care: చర్మం అందంగా ప్రకాశిస్తుండాలా? అయితే ఈ చిట్కాలు కొన్ని రోజలు వాడండి.. అందం మీ సొంతం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అందం (beauty) ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఈ వాతావరణంలో తేడాలు, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతిని ముఖంలో నలుపురంగు వస్తుంది. అయితే షాపుల్లో దొరికే క్రీములు, మాయిశ్చరైజర్లు వాడి చాలామంది తమ ముఖాన్ని పాడుచేసుకుంటారు.

అందం (beauty) ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఈ వాతావరణంలో తేడాలు, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతిని ముఖంలో నలుపురంగు వస్తుంది. అయితే షాపుల్లో దొరికే క్రీములు, మాయిశ్చరైజర్లు వాడి చాలామంది తమ ముఖాన్ని పాడుచేసుకుంటారు. ఆ తర్వాత మొటిమలు రావడం, ముఖం (face)లో నిగారింపు తగ్గడమూ జరుగుతాయి. అందుకే ఇంటి చిట్కాలు ముఖం మెరవడానికి బెటర్​ అని ఆయుర్వేద నిపుణులు (experts) చెబుతున్నారు. ఇటీవల కాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఇంటి చిట్కాలకే (tips) పరిమితం అవుతున్నారు. మొదట్లో అయితే చాలా మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ, సౌందర్య నిపుణుల చుట్టూ తిరుగుతూ, వేలకు వేలు ఖర్చు పెట్టుకునేవారు. ఎన్నో సైడ్ ఎఫెక్ట్ (side affects) లను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ పద్దతులు పాటించి (beauty tips) మీ చర్మాన్ని కాంతివంతంగా (bright) చేసుకోండి.

ఓట్ మీల్​తో..

స్నానం చేసేటప్పుడు చర్మానికి ఓట్‌మీల్‌ని పాల (milk)తో కలిపి స్క్రబ్‌లా రాయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు మీ స్కిన్ (skin) మెరిసిపోవడం ఖాయం. స్నానం తర్వాత.. మీ శరీరాన్ని టవల్స్‌తో తుడవడం కంటే సహజంగానే ఆరిపోయేలా చూసుకోండి. ఇలా చేస్తే చాలు.. అందమైన చర్మం (skin) మీ సొంతం. స్నానం చేసే నీటిలో ఓ టీ స్పూన్ బేకింగ్ సోడా (baking soda) వేయండి. ఆ తర్వాత 15, 20 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం (bath) చేయండి. ఇలా చేయడం వల్ల మీ చర్మానికి వడదెబ్బ ప్రభావం దూరం అవుతుంది.

చర్మానికి ఎలాంటి హాని (harm) జరగకుండా పువ్వులా వికసించాలంటే హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. మన చర్మం ఎప్పుడూ కూడా పొడిబారి పోకుండా ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పువ్వులా వికసిస్తుంది...ఇక చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌ని రెగ్యులర్ గా వాడడం వల్ల స్కిన్ కి నేచురల్ గ్లో అనేది చాలా ఈజీగా పెరుగుతుంది.ఇక డ్రై స్కిన్ తో బాధ పడేవాళ్లకి  క్రీం బేస్డ్ మాయిశ్చరైజర్ ఇంకా ఆయిల్ ఉండే వాటిని వాడడం మంచిది. ఆయిల్ ఇంకా కాంబినేషన్ స్కిన్ (skin) అయితే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడడం ఎంతో మంచిది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మంచి సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా వాడాలి. అలా సన్ స్క్రీన్ లోషన్ వాడుకోవడం అనేది చర్మానికి చాలా మంచిది. సూర్య కిరణాల కారణంగా స్కిన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా సన్ స్క్రీన్ ని వాడటం మంచిది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Beauty tips, Skin care

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు