హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Slow Eating: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల 5 ప్రయోజనాలు..

Slow Eating: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల 5 ప్రయోజనాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా మనం రోజూ ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లాలని.. మధ్యాహ్నం పని చాలా ఉండిపోయిందని.. ఇలా చెబుతూ ఏ పూటకాపూట భోజనం వేగంగా పూర్తి చేసేస్తుంటాం. చాలా మంది భోజనం చేయడానికి కనీసం పది నిమిషాలు కూడా పట్టదంటే వారు ఎంత వేగంగా తింటున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

సాధారణంగా మనం రోజూ ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లాలని.. మధ్యాహ్నం పని చాలా ఉండిపోయిందని.. ఇలా చెబుతూ ఏ పూటకాపూట భోజనం వేగంగా పూర్తి చేసేస్తుంటాం. చాలా మంది భోజనం చేయడానికి కనీసం పది నిమిషాలు కూడా పట్టదంటే వారు ఎంత వేగంగా తింటున్నారో అర్థం చేసుకోవచ్చు. రోజూ వారి పని ఒత్తిడి, సమయం లేకపోవడం వల్లే ఇలా వేగంగా తింటున్నామని చెబుతుంటారు. అయితే, ఈ విధంగా వేగంగా ఆహారం తింటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినడం వల్ల మనం తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి అందవని, తద్వారా వారు త్వరగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం నమలకుండా మింగటం వల్ల ఆహారం జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయని, తద్వారా మలబద్దక సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. తొందరగా భోజనం చేసే వారిలో షుగర్​ లెవెల్స్​ పెరిగి, మధుమేహ సమస్య వచ్చే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. అలా కాకుండా నెమ్మదిగా తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. నెమ్మదిగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు దూరం

నెమ్మదిగా తినడం వల్ల ఆహారం సజావుగా జీర్ణమవుతుంది. నోట్లోనే ఆహారం మెత్తగా కావడం వల్ల జీర్ణ వ్యవస్థకు పని తగ్గుతుంది. దీనివల్ల మనం తినే ఆహారంలోని పోషకాలను సులభంగా జీర్ణం చేసుకోవచ్చు.

ఒత్తిడి తగ్గుతుంది

ఆహారాన్ని పూర్తిగా నమలడం ద్వారా ఎక్కువగా తిన్నట్లు ఫీలింగ్ వస్తుంది. తద్వారా, ఇది మానసిక ప్రశాంతతను చేకూర్చుతుంది. అంతేకాక, ఒత్తిడిని నియంత్రించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది

నెమ్మదిగా తినడం వల్ల మీరు ఆహారాన్ని పూర్తిగా నమలుతారు. తద్వారా, ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, చాలా తక్కువ ఆహారం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా ఇది మీరు బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

సంతృప్తిని ప్రేరేపిస్తుంది

నెమ్మదిగా తినడం వల్ల మీ ఆహారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు. ఆహారం రంగు, రుచి, వాసన, ఆకృతిని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తూ తినడం ద్వారా అది మరింత సులభంగా జీర్ణం అవుతుంది. మీకు సంతృప్తిని చేకూర్చుతుంది.

ఆరోగ్యాన్ని అందిస్తుంది.

నెమ్మదిగా తినడం ద్వారా మీరు ఆహారాన్ని సులభంగా నమగలుగుతారు. తద్వారా, ఇది మీ క్యాలరీల వినియోగాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఫలితంగా, ఇది మీ బరువు తగ్గించడానికి దోహదం చేస్తుంది. నెమ్మదిగా తినడం మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువ ప్రయోజనాలనే అందిస్తుంది. ఇది అధిక బరువు వల్ల వచ్చే ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడుతుంది. జీర్ణ రసాలు సరిగ్గా విడుదలయ్యేందుకు సహాయ పడుతుంది. ఆహారంలోని అన్ని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. ఫలితంగా, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన శరీరానికి మరింత దోహదం చేస్తుంది.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Health benifits, Health tip, Health Tips, Weight loss

ఉత్తమ కథలు