Sleep tips: నిద్రమాత్రలు వేసుకుంటే నిద్ర తొందరగా పడుతుందా? ఏమైనా సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయా?

ప్రతీకాత్మక చిత్రం

నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. అయితే చాలామంది నిద్ర పోవడానికి నిద్ర మాత్రలు (sleeping tablets) వేసుకుంటారు. అయితే ఇలాంటివి చాలా ప్రమాదకరమని నిపుణులు (experts) చెబుతున్నారు.

  • Share this:
    ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం ( Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి, నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. అయితే చాలామంది నిద్ర పోవడానికి నిద్ర మాత్రలు (sleeping tablets) వేసుకుంటారు. అయితే ఇలాంటివి చాలా ప్రమాదకరమని నిపుణులు (experts) చెబుతున్నారు.

    15 రోజులకు మించి వాడితే..

    సరైన వైద్య సలహా లేకుండా దుర్వినియోగమయ్యే ఔషధాల్లో (medicines) నిద్ర మాత్రలు (sleeping pills) లేదా సెడేటివ్స్‌ అగ్రస్థానంలో ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో వీటి వినియోగం చాలా అధికంగా ఉంది. నిద్ర మాత్రలు ఎక్కువ కాలం వాడటం వల్ల వీటికి అలవాటు (habits) పడటం జరుగుతుంది. ఏ నిద్రమాత్రలైన 15 రోజులకు మించి వాడటం (usage) మంచిదికాదు. తాత్కాలికంగా ఇతర మందులతో కలిపి వైద్యులు వాడాలని సూచిస్తారు. కానీ అవగాహనలేమితో, బాగున్నాయనే ఉద్దేశంలో రోగులు కేవలం నిద్రమాత్రలు (sleeping pills) మాత్రమే ఉపయోగిస్తారు.

    నిద్రమాత్రలు (sleeping tablets)  ఎక్కువగా వేసుకోవడం వల్ల అరచేతులు, అరికాళ్లలో మంటలేర్పడటం, తలనొప్పి (headache), గుండెలో మంట, కడుపునొప్పి (stomach pain), ఆకలి తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, మైకంగా అనిపించడం, అలసట, బలహీనంగా (weakness) అయిపోవడం.. మొదలైన సమస్యలు (problems) ఏర్పడతాయి.

    కొంత మందిలో నిద్రమాత్రలు (sleeping pills)  వేసుకోవడం వల్ల అలర్జీ సంబంధిత చర్మ సమస్యలు (skin problems) వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో నిద్రమాత్రలు మానేసి వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు. లేకపోతే వాంతులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కళ్లు (eyes) మసకగా కనిపించడం, దురద, ఛాతిలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం.. ఇలా పలు రకాల దుష్ప్రభావాలు ఏర్పడతాయి.

    ఒక్క సారి నిద్రమాత్రలు (sleeping tablets) తీసుకోవడం అలవాటైతే మళ్లీ మళ్లీ తీసుకోవాలని మెదడు ప్రేరేపిస్తుంది. వైద్యుడి సలహా లేకుండా మందులు వాడటం కాని, వైద్యుడు సూచించిన మందులు (medicines) మోతాదుకు మించి వాడటం కాని ప్రమాదకరమనే విషయం నిర్వివాదాంశం.

    ఇవి కూడా చదవండి: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

    గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

    Published by:Prabhakar Vaddi
    First published: