Sleep tips: ఆహారంలో తేనె తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుందా? ఇది ఎంతవరకు నిజం.. తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం

నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసం ఈ తేనె చిట్కా

  • Share this:
    ఉరుకుల పరుగుల జీవితం, టెక్నాలజీ (Technology) పెరిగిపోయింది. బద్దకం ఎక్కువయింది. శరీరంలో చెమట చిందించడం తగ్గింది. వేళకు తినడం లేదు. పడుకోవడం లేదు. ఒక వేళ పడుకున్నా అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలామందికి నిద్ర పట్టదు. ప్రశాంతంగా నిద్రపోవడం (Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి, నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు.

    అటువంటి వాళ్ళ కోసం ఈ తేనె చిట్కా. ఈ చిట్కా (sleep tips)ని కనుక పాటించారంటే నిద్ర త్వరగా పడుతుంది. అయితే మీరు దీని కోసం చేయాల్సిన పని ఒక్కటే... మీరు ప్రతి రోజూ తినే ఆహారం (food)లో కొద్దిగా తేనె వేసుకొని తినడం వల్ల మీకు మంచి ఫలితాలు కనపడతాయి. దీనితో మీ మైండ్ ఇంకా బాడీ అనేవి చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అంతేగాక మీరు గోరు వెచ్చని పాలలో కొద్దిగా తేనె వేసుకుని రాత్రి నిద్ర పోయేటప్పుడు తాగితే మంచి నిద్ర పట్టడానికి వీలవుతుంది. ఇక దీని వలన వాళ్ళకి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

    వీటిని దూరం పెట్టండి..

    సాయంత్రం పూట మద్యం, సిగరెట్లు (cigarettes), ఎక్కువ భోజనం మానుకోండి. ఆల్కహాల్ (alcohol), సిగరెట్లు మరియు కెఫిన్ నిద్ర (sleep)కు భంగం కలిగిస్తాయి. ఎక్కువ, కారంగా భోజనం చేయడం వల్ల అజీర్ణం (digest) వల్ల అసౌకర్యం కలుగుతుంది. అది నిద్రపోవటాన్ని కష్టంగా చేస్తుంది. నిద్రకు ముందు (before sleep) రెండు, మూడు గంటలు ముందు ఎక్కువ భోజనం (food) తినొద్దు (don’t eat). ఒకవేళ ఆకలి (hungry)తో ఉంటే నిద్రపోవడానికి 45 నిమిషాల ముందు తేలిక పాటి చిరుతిండి (snacks)ని ప్రయత్నించండి. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి: ఏ పని చేయాలన్నా నీరసంగా ఉంటుందా.. అయితే ఈ ఆహారం తిని ఇమ్యునిటీ పెంచుకోండి
    Published by:Prabhakar Vaddi
    First published: