Home /News /life-style /

DOES SLEEPING COMFORTABLY FOR THOSE WHO SLEEP WITHOUT CLOTHES IS THAT TRUE PRV

Sleep without Dress: దుస్తులు లేకుండా పడుకున్న వారికి నిద్ర హాయిగా పడుతుందా? ఇందులో నిజమెంత?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొద్దిమందికి దుస్తులు లేకుండా(Without dress)  పడుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే బయటికి మాత్రం చాలామంది అలా చెప్పరు. ఏదో అనుకుంటారని. అయితే మామూలుగా పడుకునే వారికంటే అలా దుస్తులు లేకుండా పడుకునే వారికే హాయిగా నిద్రపడుతుందట

    బట్టలు లేకుండా (With Out Dress) ఎప్పుడైనా పడుకున్నారా(sleep)? ఛీ.. ఛీ ఏంటి...అంటే అలా కూడా పడుకుంటారా? అనుకోవచ్చు. అవును కొద్దిమంది అలాగే పడుకుంటారు. పర్సనల్ బెడ్​రూం(bedroom)లు ఉన్నవారిలో కొద్దిమందికి దుస్తులు లేకుండా(Without dress)  పడుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే బయటికి మాత్రం చాలామంది అలా చెప్పరు. ఏదో అనుకుంటారని. అయితే మామూలుగా పడుకునే వారికంటే అలా దుస్తులు లేకుండా పడుకునే వారికే హాయిగా నిద్రపడుతుందట (Happy sleep). అంతేకాదు అలా పడుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ(Health benefits) ఎక్కువేనట. దుస్తులు తొలగించి నిద్రపోవడం వల్ల బాడీ టెంపరేచర్ తగ్గుతుంది (Decreasing body Temperature). దీని కారణంగా వేగంగా నిద్రపోవచ్చు. చాలామంది నిద్ర పోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దుస్తులు తొలగించి నిద్ర పోవడం వల్ల నిద్ర యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH) నిద్రపోయేటప్పుడు రూమ్ టెంపరేచర్ చాలా ముఖ్యం అని చెబుతోంది. బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల చల్లదనం ఉంటుంది. దీనితో నిద్ర(Sleep) యొక్క నాణ్యత కూడా పెరుగుతుందట.

    ఒత్తిడి తక్కువ..

    నిద్ర యొక్క నాణ్యత పెరగడం వల్ల చర్మం కూడా బాగుంటుంది. అలానే దెబ్బలు, గాయాలు(Wounds) వంటివి కూడా ఈజీగా మానిపోతాయి. బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల ఒత్తిడి(Stress), ఎంగ్జైటీ సమస్య ఉండదు. నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి. అలానే బరువు కూడా పెరగవచ్చు.

    మధుమేహం బాధితులకు ఊరట..

    టైప్2 డయాబెటిస్, హృదయ సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చని నిపుణులు(Experts) చెపుతున్నారు. అలానే వాజినాల్ సమస్యలు, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా మహిళలకి రావు. టైట్ గా పట్టే దుస్తులు వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అయితే బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల టెంపరేచర్ తగ్గి ఫెర్టిలిటీ హెల్త్ కి సహాయపడుతుంది. బట్టలు లేకుండా సమయాన్ని వెచ్చించడం వల్ల సెల్ఫ్ ఎస్టీం పెరుగుతుంది. అలాగే వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ పెరుగుతుంది. దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల రిలేషన్ షిప్(Relationship) కూడా అద్భుతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు నిద్రపోయే ముందు పర్సనల్​ రూం అయితేనే బెటర్​. ఒకవేళ కనుక మీరు పూర్తిగా దుస్తులు లేకుండా నిద్రపోవడానికి కంఫర్టబుల్ గా లేకపోతే లో దుస్తులు తొలగించి నిద్రపోండి. ఇది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

    బిగుతుగా ఉండే దుస్తులు(Tight dress) ధరించడం వల్ల రాత్రిళ్లు నిద్రకు భంగం వాటిల్లుతుంది. అదే కేవలం బెడ్‌షీట్, దిండు మాత్రమే ఉంటే.. మధ్యలో నిద్రలేచే అవకాశాలు కూడా తక్కువేనట. పైజామాల్లాంటి దుస్తులు వేసుకోకుండా ఉండటం వల్ల రాత్రి సమయంలో చక్కటి నిద్ర పడుతుందట. చెమట తక్కువగా రావడం వల్ల శరీర శుభ్రత మెరుగవుతుంది. దాంతోపాటు డెడ్ స్కిన్ కూడా తగ్గుతుంది. బాడీ మాయిశ్చరైజేషన్ కూడా బాగుంటుంది. ఫలితంగా శరీరం కాంతివంతమవుతుంది. న్యూడ్‌గా నిద్రించడం వల్ల మీరు రిలాక్స్‌గా ఫీలవుతారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health benefits, Single piece dress, Sleep

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు