పని ఒత్తిడి (Stress), సమస్యలు తలనొప్పి (headache)ని తీసుకొస్తాయి. అయితే అన్ని బాధల కంటే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా.. వస్తూ పోతున్నట్లుగా.. తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు (Sounds) వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం (food) ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి (headache) రావచ్చు. కొన్ని కుటుంబాలలో వంశపారపర్యంగా కూడా తలనొప్పి వస్తుంది. మరో వాదనలో తలలోని రక్తనాళాల్లో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడటం వలన వస్తున్నట్లు వాదన. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి (stress), టెన్షన్ (tension), నిద్రలేమి (sleeping problems), జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. కొన్ని పద్దతులు (Remedies) పాటిస్తే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
చీకటి గదిలో..
తలనొప్పి (headache) వచ్చింది అంటే ఎంత ప్రశాంత మనసు ఉన్న వారైనా సరే చీటికిమాటికి చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పని కుదురుగా చెయ్యలేరు. చిన్న శబ్దాన్ని భరించలేరు, వెలుతురును సరిగ్గా చూడలేకపడం.. కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇవీ తలనొప్పి లక్షణాలు. అయితే తలనొప్పి అధికంగా ఉంటే ఏదైనా గదిలో ఒంటరిగా కూర్చొంటే బెటర్ అంట. అంతేకాదు ఆ గది కొంచెం చీకటి (dark room)గా ఉంటే ప్రశాంతత ఎక్కువుంటుందట. ఇక ఆహారంలో ద్రవ పదార్థాలు (liquid items) ఎక్కువ తీసుకుంటే నొప్పి నుంచి కొంచెం అయినా విశ్రాంతి లభిస్తుందట.
తల స్నానం బెటర్..
తలస్నానం చేసిన ప్రతి సారి తల (head)ను పూర్తిగా ఆరబెట్టుకుంటే తల నొప్పి రాదు, ఎండ ఎక్కువ ఉన్న సమయంలో నీళ్లను బాగా తీసుకోవాలి, అలాగే కొన్ని కొన్ని సార్లు మనకు సరిపడని సెంట్ని వాడినా తలనొప్పికి దారి తీస్తుంది. అలాంటి సమయంలో సెంట్ని ధరించకపోవడం మంచిది. తలనొప్పి ఉన్న సమయంలో ఫోన్ (phone), ల్యాప్ టాప్, కంప్యూటర్ వంటి వాటికీ దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి అన్ని పక్కన పెట్టిన .. శరీరానికి కావాల్సినంత ఆహారం, కావాల్సినంత నిద్ర తీసుకుంటే అసలు ఎలాంటి తలనొప్పి లేకుండా ఉత్సాహంగా ఉంటారు.
గంధాన్ని కొంచెం పేస్టులా చేసి తలకు (Head) రాసుకుని, కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే సులువుగా తలనొప్పి తగ్గిపోతుంది. కుర్చీలో కూర్చొని పాదాలను వేడి నీళ్లు నింపిన బకెట్లో ఉంచాలి. నిద్రకు ముందు ఇలా కనీసం పావుగంట పాటు చెయ్యడం వలన దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ వల్ల వచ్చిన తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే గోరువెచ్చని ఆవుపాలు తాగినా తలనొప్పి నుంచి సులువుగా రిలాక్స్ అవ్వొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bathtub photo, Health Tips, Life Style