Back pain: నడుం నొప్పి సమస్య ఎక్కువగా వేధిస్తుందా? అయితే ఈ చిన్న చిట్కాతో నొప్పిని మాయం చేయండి

ప్రతీకాత్మక చిత్రం

వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పి(back pain)  సర్వసాధారణం. ఎక్కువ మందిలో కనిపించేదీ… అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నొప్పి మాత్రం డిస్కు సమస్యల (disk problems) వల్ల వచ్చే నడుము నొప్పే.

  • Share this:
    కొంత మందికి కాల్షియం సరిపడా ఉండదు. ఫలితంగా రకరకాల అనారోగ్య సమస్యలు (health issues) వస్తాయి. వాటిలో బ్యాక్ పెయిన్ (back pain) ఒకటి. దీన్నే మనం వెన్ను నొప్పి అంటాం. 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లే వెన్నుపూసపై ఎక్కువ భారం పెడతారు. కానీ... కాల్షియం (calcium) లోపం వల్ల వెన్నుపూస ఆ భారాన్ని భరించలేక... వెన్నునొప్పి వస్తూ ఉంటుంది. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ (pain killer) వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి (pain) దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు (legs) చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది.

    కండరాలకు (muscles) సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాలలో రాళ్ల (stones in kidneys) దాకా నడుము నొప్పి (back pain)కి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పి(back pain)  సర్వసాధారణం. ఎక్కువ మందిలో కనిపించేదీ… అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నొప్పి మాత్రం డిస్కు సమస్యల (disk problems) వల్ల వచ్చే నడుము నొప్పే.

    గృహ చిట్కాలతో..

    కొన్ని గృహ చిట్కాలతో నడుం నొప్పిని దూరం (Back pain treatment )చేసుకోవచ్చు. కొబ్బరి నూనె (coconut oil)ను కొద్దిగా తీసుకొని అందులో కాస్త కర్పూరాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు మరిగించిన తర్వాత చల్లారాక ఈ మిశ్రమాన్ని (mixer) ఒక బాటిల్లో తీసుకుని  రోజు పడుకునే ముందు నొప్పి ఉన్నచోట ఈ మిశ్రమంతో మర్దన చేయాలి. వారానికి మూడు సార్లు (three times) ఇలా చేయడం వల్ల నడుము నొప్పి మటుమాయం అవుతుంది అని చెబుతున్నారు నిపుణులు.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?



    కొన్ని సందర్భాల్లో నడుం నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాము (Spinal cord)తో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇలాంటప్పుడు ఇతరత్రా సమస్యలేవైనా ఉండవచ్చు. అయితే నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కొంతవరకు నిర్థారించవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..

    Published by:Prabhakar Vaddi
    First published: