Hair fall: జుట్టు తరుచుగా ఊడిపోతుందా? అయితే భవిష్యత్తులో బట్టతల రాకుండా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

పురుషుల (men)కు యుక్త వయస్సు (young age)లోనే జుట్టు (hair) తగ్గడం ప్రారంభమవుతుంది. బట్టతల సమస్యతో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్టతల రాకుండా జుట్టు బాగా పెరగాలంటే ఖచ్చితంగా ఈ ఆహారం తీసుకోవాలి.

 • Share this:
  కరోనా కారణంగా చాలా రోజుల వరకు అందరూ ఇంటికి పరిమితమయ్యారు. బయట తిరగడం మానేశారు. వేళకూ నిద్ర పోవడం లేదు.చాలామంది యువత సోషల్​ నెట్​వర్కింగ్​ సైట్లలో పడిపోయారు. ఎక్కవ సేపు దానిమీదే గడుపుతున్నారు. ఇక ఉద్యోగులైతే సరేసరి. ఎప్పడూ కంప్యూటర్​ మీద, లేదా ఏదో ఓ రూమ్​లో కూర్చుండిపోతారు. అయితే నిరంతరం పని చేయడం వల్ల నిద్ర ఎక్కువగా పట్టకపోవడం, తదనంతరం డిప్రెషన్​కు కారణాలుగా మారవచ్చంట. అయితే ఈ దశలే మనిషికి బట్టతల (bald head)ను తెచ్చే అవకాశం ఉందని వైద్యులు (doctors) చెబుతున్నారు. దీనికి కారణం మీకు తెలుసా? అధిక ఒత్తిడి వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి. అలోపేసియా ఏరియాటా ఏర్పడుతుంది. ఈ విధంగా, పురుషుల (men)కు యుక్త వయస్సు (young age)లోనే జుట్టు (hair) తగ్గడం ప్రారంభమవుతుంది. బట్టతల సమస్యతో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్టతల రాకుండా జుట్టు బాగా పెరగాలంటే ఖచ్చితంగా ఈ ఆహారం తీసుకోవాలి.

  పెరిగే జుట్టు కోసం..

  కోడి గుడ్లు (Eggs) ప్రోటీన్ అలాగే బయోటిన్ వంటి పోషకాలు కలిగిన అతిపెద్ద మూలం. ఈ రెండు పోషకాలు కూడా జుట్టు పెరుగుదలకు (hair increase) చాలా అవసరం. ఇక మన జుట్టు (hair) కుదుళ్లను బాగా బలోపేతం చేయడానికి ప్రోటీన్ అనేది బాగా సహాయపడుతుంది. అయితే బయోటిన్ అనేది పెరిగే జుట్టు కోసం ప్రోటీన్ కెరాటిన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది మన జుట్టు (hair) పెరుగుదలను బాగా పెంచుతుంది. ఈ పోషకాల లోపం సాధారణంగా జుట్టు రాలడానికి బాగా కారణమవుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు (eggs) అనేవి తప్పనిసరిగా తీసుకోవడం చాలా మంచిది. బట్టతలకు (bald head) చెక్​ పెట్టొచ్చు.

  ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

  జుట్టు రాలడాన్ని (hair fall) కూడా క్యారెట్ (carrot) నివారిస్తుంది. అలాగే క్యారెట్‌లో విటమిన్ ఎ, సి, కె, బి కాంప్లెక్స్ ఇంకా పొటాషియం, ఫాస్పరస్ అలాగే ఫైబర్ వంటి పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఈ మొత్తం అన్ని కూడా శారీరక ఆరోగ్యానికి (body health) కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.

  పచ్చని ఆకు కూరలు కూడా శారీరక ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ ఆకుకూరలో జుట్టు సంరక్షణ రహస్యం కూడా ఉంది. ఇక పాలకూర అనేది వివిధ పోషకాలతో కూడిన గొప్ప మూలం. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ బి, సి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇంకా ఐరన్ ఉంటాయి.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

  ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
  Published by:Prabhakar Vaddi
  First published: