Home /News /life-style /

Hair fall: షాంపూ రోజూ వాడితే జుట్టు రాలిపోతుందా? జుట్టు బలంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

Hair fall: షాంపూ రోజూ వాడితే జుట్టు రాలిపోతుందా? జుట్టు బలంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సహజ పదార్థాలతో జుట్టు (hair)ని కాపాడుకోవచ్చు. దాదాపుగా రాలిపోయిన జుట్టును ఆపడం చాలా కష్టం కానీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం జుట్టు ఎక్కువ రాలకుండా అరికట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు

    జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె(oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (hair) అందరికీ ఉండేది. కానీ ఇప్పటి కాలుష్యం, షాంపూలు (shampoo), హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి.

    ఆయిల్​ రాయాలి..

    చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె (oil) అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె అప్లై చేయాలి. అందుకే ఇప్పుడు ఆ సహజ పదార్థాలతో జుట్టు (hair)ని కాపాడుకోవచ్చు. దాదాపుగా రాలిపోయిన జుట్టును ఆపడం చాలా కష్టం కానీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం జుట్టు ఎక్కువ రాలకుండా అరికట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

    ప్రోటీన్లు (proteins) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.. ద్వారా జుట్టు ఎంతో దృఢంగా మారుతుంది.  అంతేకాదు కంటినిండా నిద్రపోవటం.. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి చేయాలి. మద్యపానం ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక బయటికి వెళ్ళినప్పుడు వెంట్రుకలపై దుమ్ము ధూళి పడకుండా స్కార్ఫ్ లేదా క్యాప్ పెట్టుకోవడం లాంటి చేయాలి.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

    ప్రతిరోజు కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే షాంపూ 9shampoo) చేయాలి. దువ్వెనతో తలని బలంగా దువ్వ కూడదు.. అంతేకాకుండా హెయిర్ డ్రయ్యర్ వాడకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు అని చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    నల్ల జీలకర్ర నూనె అధికంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, బలంగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది .2 టేబుల్ స్పూన్ల నల్ల జీలకర్ర నూనె (oil) తీసుకొని, తలమీద రుద్దండి.  ఆ తరువాత నెత్తికి మసాజ్ చేయాలి. జుట్టు రాలడం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాగా మసాజ్ చేయాలి. నూనెను మూలాల నుంచి చివర వరకు జుట్టుకు రాయాలి. నూనె రాసిన తరువాత జుట్టును 30 నిమిషాల నుంచి గంట వరకు ఆరబెట్టండి. ఆపై షాంపూతో మీ జుట్టును కడగాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల మీ జుట్టు అది ఉత్తేజ పరుస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..




    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Hair fall, Hair Loss, Hair problem tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు