Beauty tips: తీపి పదార్థాలు తింటే చర్మంలో మెరుపు తగ్గుతుందా ?  చర్మ సమస్యలు వస్తాయా?

ప్రతీకాత్మక చిత్రం

ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా (Soft skin ) ఉంచుకుంటే మంచిది. అయితే తీపి పదార్థాలు అధికంగా తింటే కూడా చర్మ సమస్యలు వస్తాయంట. ఇక సహజసిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుకోవడమెలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Share this:
    వర్షాకాలం (monsoon), చలికాలం (Winter). చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన సమయాలు. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ (External skin care ) చాలా కీలకమవుతుంటుంది.  చర్మం సంరక్షణ (Skin protection ) అనేది చాలా కీలకం. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం (Skin ) పొడి బారి.. దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా (Soft skin ) ఉంచుకుంటే మంచిది. అయితే తీపి పదార్థాలు అధికంగా తింటే కూడా చర్మ సమస్యలు వస్తాయంట. ఇక సహజసిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుకోవడమెలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం.

    శరీరం తేమగా ఉండాలి..

    మీ చర్మం అనేది ఎప్పుడు తేమగా తాజాగా ఉండాలంటే శరీరాన్ని తేమగా ఉంచాలి. ఇక ఇందుకోసం రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు (water) తాగడం చాలా మంచిది. చక్కెర (sugar) కూడా మీ శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ను బాగా పెంచడం జరుగుతుంది. దాని ఫలితంగా మీ చర్మాన్ని (skin) బిగుతుగా ఉంచే కొలాజెన్‌ అనేది తగ్గుతుంది. కాబట్టి తీపి పదార్థాలను (sweet food) తినడం (eat) మాత్రం వెంటనే తగ్గించాలి. అస్సలు తినకూడదు. ఇక ఈ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఎలాంటి చర్మ సమస్యలు అనేవి రావు.

    ఎండతో చర్మం దెబ్బతింటుంది..

    ఎండ వల్ల చర్మం (skin) బాగా దెబ్బ తింటుంది. అందువల్ల చర్మం అడుగున ఉండే కొల్లాజెన్‌ అనేది బాగా దెబ్బతిని ఇంకా తరిగిపోయి చర్మానికి ముడతలు అనేవి ఏర్పడతాయి. ఇక అంతేకాదు సూర్యరశ్మి ధాటి నుంచి చర్మం తనను తాను కాపాడుకోవడం కోసం చర్మం క్రమక్రమంగా మందంగా మారడం జరుగుతుంది. అలా మందం పెరిగేకొద్దీ మీ చర్మం అనేది ముడతలుగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎండలో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ (sun screen lotion) అప్లై చేసుకోండి. ఇక అలాగే గంధంతో తయారైన ఫేస్‌ పౌడర్ల (face powders) వల్ల కూడా చర్మం బాగా నల్లగా మారడం జరుగుతుంది.

    అలాగే సన్‌ ట్యాన్‌ (sun tan)కు గురయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఇలాంటి పౌడర్లతో ఉంటాయి. కాబట్టి సన్‌ట్యాన్‌కు లోనైతే చర్మం పై ముడతలు అనేవి మొదలవుతాయి. కాబట్టి శాండిల్‌వుడ్‌ బేస్‌డ్‌ పౌడర్లకు చాలా అంటే చాలా దూరంగా ఉండటం మంచిది. ఇక సబ్బు కూడా చర్మం మీద వుండే మురికిని వదిలించాలి గానీ సహజ నూనెలను మాత్రం అస్సలు తొలగించకూడదు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published: