హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

sleep tips: రాత్రి పడుకునే ముందు పిస్తా తింటే హాయిగా నిద్ర పడుతుందా? మంచి నిద్ర కోసం ఏం చేయాలి

sleep tips: రాత్రి పడుకునే ముందు పిస్తా తింటే హాయిగా నిద్ర పడుతుందా? మంచి నిద్ర కోసం ఏం చేయాలి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.  అయితే  నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  నిద్ర‌లేమితో స‌త‌మ‌త‌మ‌య్యే వారు పిస్తా (Pistachio) తినాల‌ని సూచిస్తున్నారు

    ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం..  అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల (health problems)తో నేటి రోజులలో జనాలు బాధపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర (sleep) లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం (sleeping)..  ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు ఎంతో మందిపై  ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడి పోతున్నాయి.

     ఒత్తిడితో కూడిన లైఫ్..

    అయితే ఈ మధ్య కాలంలో యువత (youngsters) పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి (Insomnia) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.  అయితే  నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  నిద్ర‌లేమితో స‌త‌మ‌త‌మ‌య్యే వారు పిస్తా (Pistachio) తినాల‌ని సూచిస్తున్నారు వైద్యులు. రోజూ రాత్రి ప‌డుకునే ముందు కాస్త పిస్తా తింటే ఆ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. దాని గురించి (sleep tips) ఒకసారి తెలుసుకుందాం..

    మెల‌టోనిన్ ఆధారంగానే..

    పిస్తా (Pistachio)లో నిద్ర ఉప‌క్ర‌మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మెల‌టోనిన్ పుష్క‌లంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెద‌డులోని పీయూష గ్రంథి నుంచి ఉత్ప‌త్తి అయ్యే మెల‌టోనిన్ (Melatonin) ఆధారంగానే మ‌న నిద్ర‌ (sleep), మెల‌కువ‌ల‌ను నియంత్రించే జీవ‌గ‌డియారం ప‌నితీరు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

    కృత్రిమంగా అందించడం మంచిది కాదు..

    శ‌రీరంలో మెల‌టోనిన్ రాత్రి వేళల్లో ఎక్కువ‌వుతాయి కాబ‌ట్టే మ‌న‌కు నిద్ర (good sleep) వ‌స్తుంది. దీంతో తీవ్ర నిద్ర‌లేమి (Insomnia)తో బాధ‌ప‌డే వారికి వైద్యులు (Doctors) మెల‌టోనిన్ హార్మోన్‌ను కృత్రిమంగా అందిస్తుంటారు. అయితే ఇది అంత‌గా సూచించ‌ద‌గ్గ అంశం కాదు కాబ‌ట్టి.. స‌హ‌జంగా మెల‌టోనిన్ (Melatonin) ల‌భించే పిస్తా తీసుకోవ‌డం ఉత్త‌మమ‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీకు హాయిగా నిద్ర పడుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Food Grains, Sleep tips

    ఉత్తమ కథలు