Health Tips : మటన్ వల్ల కాన్సర్‌ ప్రమాదం... వ్యాధి రాకూండా ఏం చెయ్యాలి?

Cancer Awareness : ఈమధ్య ప్రజలు ఎక్కువగా చికెన్, మటన్ కూరలు తింటున్నారు. అదే సమయంలో జంతు మాంసం తినాలంటే భయపడుతున్నారు కూడా. కారణం కాన్సర్ వస్తుందేమోనన్న టెన్షన్. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే....

Krishna Kumar N | news18-telugu
Updated: February 4, 2020, 8:20 AM IST
Health Tips : మటన్ వల్ల కాన్సర్‌ ప్రమాదం... వ్యాధి రాకూండా ఏం చెయ్యాలి?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జంతు మాంసం వల్ల కాన్సర్ : కాన్సర్లలో చాలా రకాలున్నాయి. వాటిలో పెద్ద పేగుకు వచ్చే కాన్సర్‌ను కొలోరెక్టల్ కాన్సర్ (Colorectal cancer) లేదా బొవెల్ కాన్సర్ అంటారు. ఇది వ్యాపిస్తే పెద్ద పేగు కదలికల్లో మార్పులొస్తాయి. బరువు తగ్గుతారు. మాటిమాటికీ అలసట, నీరసం వచ్చేస్తాయి. మూత్రంలో బ్లడ్ పడుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాల్సిందే. ఈ కాన్సర్ ఎక్కువగా మనం తీసుకునే ఆహారంలో జంతు మాంసం, ఫ్రైలు, ఆయిల్, స్పైసీ ఎక్కువగా ఉంటే వస్తుంది. నిల్వ ఉంచిన జంతు మాంసం, ఎరుపు రంగులోకి మారిన మాంసం, ప్రాసెస్ చేసి ప్యాకింగ్ రూపంలో వచ్చే మాంసం తినేవారికి పెద్ద పేగు కాన్సర్ వస్తోందని పరిశోధనలు తేల్చాయి. ఈ కాన్సర్‌ను నయం చేసేందుకు రేడియోథెరపీ, కీమోథెరపీ ఉన్నా... కాన్సర్ తొలిదశల్లో ఉన్నప్పుడు మాత్రమే నయం చెయ్యగలరు. వ్యాధి ముదిరితే డాక్టర్లు కూడా చేసేదేమీ ఉండదు.

cancer, meat, red meat, processed meat, meat cancer, colon cancer, causes of cancer, does meat cause cancer, colorectal cancer, does red meat cause cancer, meat causes cancer, grilled meat cancer, క్యాన్సర్, మాంసం తింటే క్యాన్సర్, క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ జాగ్రత్తలు
ప్రతీకాత్మక చిత్రం


ఎంత జంతు మాంసం తింటే ప్రమాదం : ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ జంతు మాంసం తింటే ప్రమాదమే. అంటే వారానికి 350 గ్రాముల కంటే ఎక్కువ మాంసం మనం తినకూడదు. ముఖ్యంగా ఫ్రై చేసిన మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం తినకుండా ఉండే మంచిది. ఇంట్లోనే వండుకుని తింటే ఇంకా మంచిది.

cancer, meat, red meat, processed meat, meat cancer, colon cancer, causes of cancer, does meat cause cancer, colorectal cancer, does red meat cause cancer, meat causes cancer, grilled meat cancer, క్యాన్సర్, మాంసం తింటే క్యాన్సర్, క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ జాగ్రత్తలు
ప్రతీకాత్మక చిత్రం


జంతు మాంసం పెద్దపేగు కాన్సర్‌తోపాటూ... క్లోమం, ప్రొస్టేట్‌ కాన్సర్లకు కూడా కారణమవుతోందట. జంతుమాంసాన్ని ఎక్కువ వేడిలో వేయించడం, నిప్పుల్లో కాల్చుకు తినడం, వేపుళ్లు చేసుకోవడం, ఉప్పులో నానబెట్టి తర్వాత వాడటం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

cancer, meat, red meat, processed meat, meat cancer, colon cancer, causes of cancer, does meat cause cancer, colorectal cancer, does red meat cause cancer, meat causes cancer, grilled meat cancer, క్యాన్సర్, మాంసం తింటే క్యాన్సర్, క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ జాగ్రత్తలు
ప్రతీకాత్మక చిత్రం


కాన్సర్ రాకుండా ఏం చెయ్యాలి : సరిపడా మాంసం తింటూనే... దాంతోపాటూ గాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అదే పనిగా మాంసం తింటే మాత్రం రోగాల్ని ఆహ్వానించినట్లేనని హెచ్చరిస్తోంది. ఇది మంచి విషయమే. ఏటా ప్రాసెసింగ్ మాంసాన్ని తిని ప్రపంచవ్యాప్తంగా 34,000 మంది కాన్సర్‌ బారినపడి చనిపోతున్నారు. జంతుమాంసం తిని ఏటా 50 వేల మంది కాన్సర్‌ సోకి చనిపోతున్నారు. ఐతే చేపలు, కోడి మాంసం వల్ల కాన్సర్‌ వస్తున్నట్లు ఇంకా గుర్తించలేదు. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉంటే... ఈ ప్రాణాంతక రోగాల్ని దరిచేరనివ్వకుండా చేయొచ్చు. 

ఇవి కూడా చదవండి :

వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు

యాపిల్‌తో ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలిస్తే తినకుండా ఉండరు


ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం
First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading