హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో ప్యాట్​ పెరుగుతుందా? గుడ్డును ఎలాంటి వారు తినాలి?

Health tips: గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో ప్యాట్​ పెరుగుతుందా? గుడ్డును ఎలాంటి వారు తినాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది కొడిగుడ్డు తింటే బాడీలో ప్యాట్​ పెరుగుతుందని, ముఖ్యంగా గుడ్డులోని సొన తింటే అధిక బరువు సమస్యలతో బాధపడాల్సి వస్తుందని అనుకుంటుంటారు.. మరి ఇందులో నిజమెంత ..ఒకసారి తెలుసుకుందాం.

అధిక బరువు ఉంటే వేగంగా పరిగెత్తలేరు. కూర్చుంటే లేవలేరు. ఎక్కువగా తిరగలేరు. వ్యాయామాలు (Exercise) చేయడం ఇబ్బందిగానే ఉంటుంది. మరోవైపు భారీ శరీరం (heavy body) ఉండటంతో కడుపు (stomach) కట్టుకోలేరు. ఏదో ఒకటి తినాల్సిందే (should eat). లేకపోతే శరీరం సహకరించదు. సమాజంలో అందరి శరీరాకృతి చూసి మానసికంగా ఒత్తిడి (stress)కి లోనవుతుంటారు. బరువు ఎక్కువుంటే కొన్ని రకాల సమస్యలు కూడా వస్తాయి. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  అయినా బరువు తగ్గకపోగా ఇతర సమస్యలు (side effects) కూడా వస్తుంటాయి. ఆరోగ్యకరమైన  ఆహారం (healthy food) తీసుకోవడం వల్ల బరువు తగ్గడం (weight loss) సులువు అవుతుంది. అలాగే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు (weight) తగ్గుతారు.

కొడిగుడ్డు తింటే బాడీలో ప్యాట్..

అయితే చాలామంది కోడిగుడ్డు తింటే బాడీలో ప్యాట్​ పెరుగుతుందని, ముఖ్యంగా గుడ్డులోని సొన తింటే అధిక బరువు సమస్యలతో బాధపడాల్సి వస్తుందని అనుకుంటుంటారు.. మరి ఇందులో నిజమెంత ..ఒకసారి తెలుసుకుందాం.. మనలో చాలా మంది గుడ్డు (Egg)ను సంపూర్ణంగా తినకుండా తెల్లసొన తిని, పచ్చసొన పడేస్తారు. శరీరానికి ఉపయోగపడే మినరల్స్ 45 అయితే, అందులో గుడ్డులో 44 మినరల్స్ ఉన్నాయి. అందులోనూ పచ్చసొనలో 12 దాకా మినరల్స్ ఉన్నాయి. కనుక సంపూర్ణ ఆరోగ్యం కోసం పచ్చసొన కూడా తినాల్సిందే.

పచ్చసొనలో కెలోరీలు..?

బరువు పెరగడం (weight gain) అనేది శరీరంలోకి చేరే కెలోరీ (calories)ల మీద ఆధారపడి ఉంటుంది. పచ్చసొనలో కెలోరీలు తక్కువగానే ఉంటాయి. కనక దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం పెట్టుకోవద్దంటున్నారు నిపుణులు. ఎక్కువ ఆహారం (food) తింటే ఎక్కువ కెలోరీలు ఒంట్లోకి చేరతాయి... అలాగే ఎక్కువ గుడ్లు తింటే... అధికంగా కెలోరీలు శరీరానికి అందుతాయి. కనుక రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తింటే ఆరోగ్యంగా (healthy) ఉండొచ్చని, బరువు పెరుగుతామన్న భయం పెట్టుకోవద్దంట. కనుక పచ్చసొన తీసి బయట పడేయకుండా తిని ఆరోగ్యంగా ఉండండి. అయితే ఊబకాయంతో బాధపడే వారు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే పచ్చసొనను తీసుకుంటే మంచిది.

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

పచ్చసొనలో విటమిన్ ఎ, బి, ఇ, డి, కె లతో పాటూ సెలీనియం, జింక్ వంటి ముఖ్య పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్ డి కూడా దీన్నుంచి లభిస్తుంది. ల్యూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ దీనిలో ఉంటుంది. ఇది కంటి (eye) ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజుకో గుడ్డు తినడం అలవాటుగా మార్చుకుంటే గుండె సంబంధింత వ్యాధులకు గురికాకుండా జాగ్రత్త పడచ్చు.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

చంకల్లో దురద ఎందుకు వస్తుందో తెలుసా? మరి ఆ దురద తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలంటే

First published:

Tags: Egg, Health benefits, Health Tips, Weight gain, Weight loss

ఉత్తమ కథలు