Home /News /life-style /

DOES DRINKING TOO MUCH BEER CAUSE ERECTILE DYSFUNCTION MUST KNOW HERE PRV

Side Effects of Beer: అతిగా బీరు తాగితే... అంగస్తంభన సమస్యలొస్తాయంటా.. ఇందులో నిజమెంత?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీరు తాగడం వల్ల పురుషుల్లో నపుంసకత్వం సమస్య 26 శాతానికి తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలిందట. ఇక్కడి వరకూ ఒకే కానీ, ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. బీర్ తాగితే నపుంసకత్వం రాదని భావించి అతిగా తాగినా ప్రమాదమే.

    మద్యం(alcohol). తమకు కిక్కిచ్చే ఔషధమని మందుబాబులని కదిలిస్తే పలుకుతుంటారు. ఇంతకీ మద్యం మితంగా తాగినంత వరకే. ఒకవేళ హద్దు దాటితే దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. స్నేహితులు కలిసినా, ఇంట్లో ఫంక్షన్లు అయినా.. ఆఫీసుల్లో పార్టీలు అయినా మద్యం ఉండేలా చూసుకుంటారు మందుబాబులు. అయితే వైన్​ వరకు కొంచెం ఆరోగ్య పరంగా చికాకులు లేకపోయినా బీర్(beer)​ మాత్రం సమస్యలు తెచ్చే అవకాశం ఉందట. అదికూడా పురుషులకు. అయితే బీర్​ తాగితే కలిగే ప్రయోజనాలు కొంచెం ఉన్నాయటండోయ్​. అది కూడా పురుషులకే. అయితే అది మితంగా తాగినంత వరకే ప్రయోజనం. ఒకసారి లిమిట్(limit)​ దాటిందనుకోండి. అంతే సంగతులు.. సరే ఇంతకీ ఈ బీరు తాగితే(drink) వచ్చే కష్టనష్టాలు, ప్రయోజనాలూ తెలుసుకుందాం.. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో బీరు తాగే పురుషులు శృంగారం (sex)లో రెచ్చిపోతారని తేలిందట. పరిశోధనల్లో భాగంగా మహిళలకు, పురుషులకు కొద్దిగా బీరును ఇచ్చారట. అయితే, బీరు మహిళలపై ఎలాంటి ప్రభావం చూపించలేదట. కానీ, పురుషుల్లో మాత్రం లైంగిక శక్తి పెరిగినట్లు తేలింది.

    బీరు తాగితే శృంగారంలో కొంచెం శక్తి పెరిగినట్లుగా ఉంటుందట. బీరు తాగడం వల్ల పురుషుల్లో నపుంసకత్వం సమస్య 26 శాతానికి తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలిందట. ఇక్కడి వరకూ ఒకే కానీ, ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. బీర్ తాగితే నపుంసకత్వం(impotence) రాదని భావించి అతిగా తాగినా ప్రమాదమే. ఎందుకంటే అతిగా బీరు(beer) తాగితే అంగస్తంభన సమస్యలు( erectile dysfunction) తలెత్తుతాయట. ఒక పింట్ కంటే ఎక్కువ బీర్(beer) తాగొద్దని నిపుణులు(experts) సూచిస్తున్నారు. బీరును ధాన్యపు గింజల నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఎన్నో పోషకాలు ఉంటాయి. బీర్‌లో తాగేవారికి విటమిన్-B, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు లభిస్తాయి. ఇంకా పొటాషియం, పాస్పరస్, బియోటిన్, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలు సైతం బీరులో ఉంటాయి.

    కొద్దిగా ప్రయోజనాలూ ఉన్నాయట..

    బీరు తాగేవారిలో రక్త ప్రసరణ(blood) pumping) సాధారణంగా ఉంటుందని, దానివల్ల రక్తపోటు సమస్యలు(BP problems) దరిచేరవని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. బీరులో ఉండే సిలికాన్ ఎముకలను దృఢంగా ఉంచేందుకు సహకరిస్తుంది. బీరు తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధులు(disease) కూడా తగ్గుముఖం పడతాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. బీరు జీర్ణక్రియను పెంపొందిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా అరికడుతుంది. బీరులోని  ఫ్లవనోయిడ్ సమ్మేళనాలు వివిధ క్యాన్సర్‌లను అడ్డుకుంటుంది. బీరులోని విటమిన్-E వృద్ధాప్యాన్ని దరిచేరనీయదు. మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగించే సత్తా కూడా బీరుకు ఉందట. వివిధ రకాల కిడ్నీ వ్యాధులు, అల్జిమర్స్ నుంచి కూడా బీరు కాపాడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. బీరు మోతాదు మించి తాగితే ఎన్నో సమస్యలు వెంటాడతాయి. కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం కూడా ఉంది. పొట్టరావడం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వెంటాడుతాయి. కాబట్టి.. బీరు మంచిదే కదా అని అదేపనిగా తాగకుండా అప్పుడప్పుడు తాగి ఆరోగ్యంగా ఉండండి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beer, Drinkers, Life Style, Side effects

    తదుపరి వార్తలు