Alcohol: బీర్​ తాగితే శృంగార సామర్థ్యం పెరుగుతుందా ? మరి అధికంగా తాగితే ఏమవుతుంది?

ప్రతీకాత్మక చిత్రం

యువకులు బీర్ (Beer) ను తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ బీర్ తాగడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందని ప్రచారంలో ఉన్నప్పటికీ తెలుస్తున్న సమాచారం ప్రకారం బీర్ (beer) తాగడం వలన పురుషులకు (men) కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

  • Share this:
    మద్యం (Alcohol) తాగడం మంచిదా? అంటే టక్కున మంచిది కాదు అంటారు. ఆల్కహాల్ తాగడం అనారోగ్యకరమైనది అనే భావన ఉంది. అయితే మద్యం తాగినప్పుడు పెద్దవారు పొందే ఆనందాన్ని (happiness) విస్మరించలేం. అనేక దీనిని డిప్రెషన్​, వారాంతపు వేడుకల (celebrations)కు నివారణగా కోరుకుంటారు. ఒక్క మద్యం సేవించడానికి మాత్రమే ఒక్క సందర్భం అవసరం లేదు. శుభకార్యాలు అయినా, బర్త్ డే పార్టీ అయినా, ఫ్రెండ్ బాధలో ఉన్నా, అదే ఫ్రెండ్ సంతోషంలో ఉన్నా మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. మీకు ఇష్టమైన అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలు, ఆల్కహాల్ తక్కువ కేలరీ (calories) లు ఉంటాయి. అయితే డైట్ చేసేవారు దీనికి దూరంగా ఉండాలి. మద్యం (alcohol) సేవించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా ఆల్కహాల్ మన ఆరోగ్యానికి (health) మంచిది కాదు. కానీ సరైన రీతిలో, తాగడం (drink) వల్ల మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పలు పరిశోధనలు (research) చెబుతున్నాయి.

    ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఎక్కువగా యువకులు బీర్ (Beer) ను తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ బీర్ తాగడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందని ప్రచారంలో ఉన్నప్పటికీ తెలుస్తున్న సమాచారం ప్రకారం బీర్ (beer) తాగడం వలన పురుషులకు (men) కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

    బీర్ (beer) ఏదో కొంచెం పరిమితంగా తీసుకుంటే ఓకె గానీ, అపరిమితంగా తీసుకుంటే మాత్రం  నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా చేసిన ఒక  అధ్యయనం ప్రకారం శృంగారం (sex)లో పాల్గొనే ముందు కొంత మంది మహిళలకు మరియు పురుషులకు బీర్ ను ఇచ్చారట. అయితే బీర్ తీసుకున్న తర్వాత మహిళల (women)లో ఎటువంటి ఎఫెక్ట్ లేదని వీరు గమనించినట్లు తెలిసింది.  అదే పురుషులలో మాత్రం బీర్ తాగిన తర్వాత శృంగార సామర్థ్యం (sexual power) పెరిగిందని ఈ అధ్యయనం తెలిపింది. అంతే కాకుండా నపుంసకులు బీర్ (beer) తీసుకుంటే ఆ ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని వీరు చెబుతున్నారు.

    అయితే ఇక్కడ ఒక సంకటం ఏర్పడే ప్రమాదం ఉందని వీరు చెబుతున్నారు. నపుంసకత్వం సమస్య (problem) పూర్తిగా తొలగిపోవాలని ఎక్కువగా బీర్లు (lot of beers) తాగితే మాత్రం అంగం స్థంభన సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం తెలుపుతోంది. కాబట్టి బీర్ ను చాలా పరిమితంగా (limited) మాత్రమే సేవించాలని చెబుతున్నారు. కాబట్టి యువకులు అందరూ ఆలోచించి బీర్ (think before taking beer) ను తక్కువగా మాత్రమే తాగండి. వీలైతే మానేయండి. మద్యం తాగడం (alcohol consumption) మన ఆరోగ్యానికి (health) ఏ మాత్రం  మంచిది కాదు.

    ఇది కూడా చదవండి: ఆల్కాహాల్​ తాగే సమయంలో ఈ పదార్థాలు అసలే తినొద్దు.. లేదంటే ఆరోగ్య సమస్యలే..

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published: