Alcohol: మద్యం తాగితే జుట్టు ఎక్కువ రాలుతుందా? జుట్టు బాగా పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ప్రతీకాత్మక చిత్రం

మీ జుట్టు అకస్మాత్తుగా రాలితే మీరు తినే ఆహారంలో కొన్ని పోషకాలు లేకపోవడమే అని చెప్పవచ్చు. అయితే మద్యం (Alcohol) కూడా జుట్టు రాలడానికి ఓ కారణమట. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

  • Share this:
పొడవైన కేశాలను చూసి అమ్మాయిలే అసూయ పడుతారట. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తాయి. జుట్టు (hair) ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని (Beauty) చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల (bald head) వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(hair fall) జరుగుతుంది. జుట్టు(hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ ఆహారాన్ని మానేస్తే మంచిది అంటున్నారు నిపుణులు.

మనం తీసుకునే ఆహారం వల్ల మనకు అందం, ఆరోగ్యం (health) రెండూ వస్తాయి. చర్మ సౌందర్యం మరియు జుట్టుకు అవసరమైన పోషకాలను అందించేది ఆహారం. అయితే మీ జుట్టు అకస్మాత్తుగా రాలితే మీరు తినే ఆహారంలో కొన్ని పోషకాలు లేకపోవడమే అని చెప్పవచ్చు. అయితే మద్యం (Alcohol) కూడా జుట్టు రాలడానికి ఓ కారణమట. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

ప్రోటీన్లను బలహీనం చేస్తుంది..

ఆల్కహాల్ (Alcohol) జుట్టుకు చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ (Alcohol) ప్రొటీన్లను బలహీనపరుస్తుంది. దీంతో జుట్టు అధికంగా రాలిపోవడం జరుగుతుంది. జుట్టు రాలడం (hair fall) కూడా ఆల్కహాల్ సేవనం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టే. జుట్టు అంటే అది ప్రొటీన్ తో తయారవుతుంది. కెరాటిన్ అనే ప్రొటీన్ తో తయారయ్యే జుట్టుకు ఆల్కహాల్ అత్యంత ప్రమాదకారి. ఆల్కహాల్ ప్రొటీన్లను బలహీన పరుస్తుంది కనుక జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది. అందుకే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేవారిలో పోషకాల లేమి అనేది సహజంగానే ఉంటుంది.

డైట్ సోడా..

అస్పర్టేమ్ అనే కృత్రిమ స్వీట్నర్ వేసి తయారు చేసే డైట్ సోడా వెంట్రుకలను బలహీనపరుస్తుంది. కుదుళ్లను బలహీనపరచి జుట్టు రాలేలా చేసే సైడ్ ఎఫెక్ట్ డైట్ సోడాతో ఉంటుంది. మీకు జుట్టు రాలుతుంటే డైట్ సోడాలు తక్షణం తాగటం ఆపేయండి.

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

విటమిన్లు ఉన్న ఆహారం..

బాదంలో బయోటిన్, మాగ్నీషియమ్ ఎక్కువగా ఉంటుంది. బాదం పప్పులను రెగ్యులర్‌గా తినడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఓట్స్‌లో ఫైబర్, జింక్, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ బీ ఎక్కువగా ఉంటాయి. ఓట్స్‌ను తినడం ద్వారా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇక మనం తీసుకొనే ఆహారంలో సరైన విటమిన్లు (No vitamins) , ఖనిజాలు, ప్రోటీన్లు (proteins) లేకపోవడం వల్ల కూడా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది.. సాధారణంగా జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు ఒక ముఖ్యమైన అంశం. హెయిర్ ఫోలికల్స్ తగినంత ప్రోటీన్ ను పొందలేని సమయంలో జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి . ఫలితంగా జుట్టు రాలడం మొదలవుతుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
Published by:Prabhakar Vaddi
First published: