Memory power increase tips: ఎరోబిక్​​ వ్యాయామాలు చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందా? ఇందులో నిజమెంత?

ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యంగా (healthy) ఉండేందుకు ప్రతీ ఒక్కరూ వ్యాయామం (exercise) చేయాలి. ఎరోబిక్ (aerobics)  వర్కవుట్ చేయడం వల్ల క్యాలరీలు కరుగుతాయి. కండరాలు బలోపేతం అవుతాయట. మెదడు (brain) ఆరోగ్యం కూడా బాగుంటుందట. ఎరోబిక్స్ (aerobics) చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి జ్ఞాపకశక్తి (memory power) మెరుగు అవుతుందని తేలింది.

  • Share this:
    ఎరోబిక్స్ (aerobics) అంటే చాలా ఉంటాయి.. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్టేషనరీ, సాధారణ సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ వంటివన్నీ ఎరోబిక్స్‌లో భాగాలే. ఆరోగ్యంగా (healthy) ఉండేందుకు ప్రతీ ఒక్కరూ వ్యాయామం (exercise) చేయాలి. ఎరోబిక్ (aerobics)  వర్కవుట్ చేయడం వల్ల క్యాలరీలు కరుగుతాయి. కండరాలు బలోపేతం అవుతాయట. మెదడు (brain) ఆరోగ్యం కూడా బాగుంటుందట. ఎరోబిక్స్ (aerobics) చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి జ్ఞాపకశక్తి (memory power) మెరుగు అవుతుందని తేలింది. ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు ఎరోబిక్ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. రెగ్యులర్‌గా ఎరోబిక్స్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం (heart health) బాగు పడుతుంది. ఎరోబిక్స్ చేయడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, డిమెన్షియా వంటి సమస్యలు దరిచేరవు. రెగ్యులర్‌గా వీటిని చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట.

    నడి వయసు దాటిన వారు నుంచి వయసు మళ్లిన వారు ఈ ఎరోబిక్స్ (aerobics)  చేయడం వల్ల మతి మరుపు (Forgetfulness) వంటి సమస్యలు దూరం అవుతాయి. అదే విధంగా.. స్టూడెంట్స్ (students) చేయడం వల్ల జ్ఞాపకశక్తి  (memory power)పెరుగుతుంది. ఒత్తిడి కూడా చాలా వరకూ దూరం అవుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కారణాలతో మెమరీ పవర్ పెరిగినట్లు గుర్తించారు పరిశోధకాలు.. ఎరోబిక్స్  (aerobics) చేయడంలో మెదడు (brain)లో ఎండూ మార్ఫిన్లు అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ కారణంగా రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు.

    రెగ్యులర్‌గా ఈ వర్కువుట్ చేయడం వల్లో శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రక్త సరఫరా మెరుగు అవుతుంది. అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.. ఎప్పుడైతే శారీరకం ఎలాంటి సమస్యలు ఉండవో.. అప్పుడే మనసు కూడా బావుంటది. ఇలా మానసికంగా (mentally), శారీరకంగా బావున్నప్పుడు మెదడు (brain) పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ కారణంగా జ్ఞాపకశక్తి (memory power) బాగుంటుంది అని పరిశోధనలు తేల్చాయి.

    షుగర్ వ్యాధిగ్రస్తులకు ఏరోబిక్ (aerobics)  వర్కవుట్ చాలా బాగా పనిచేస్తుందని తేలింది. దీని వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ కారణంగా బరువు (weight) కూడా అదుపులో ఉంటుంది. కండరాల బలానికి తోడ్పడుతుంది. అలాగే.. శరీరరం వదులుగా మారే గుణం కూడా తగ్గి ఫిట్‌‌గా ఉంటారు. శరీర కండరాల బలానికి కూడా ఎరోబిక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

    రెగ్యులర్‌గా ఏరోబిక్స్ చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. ఇలా చేయడం వల్ల తర్వాత రోజు నూతనోత్సాహంతో ఉంటారు. వీటిని చేయడం అధిక రక్తపోటు తగ్గుతుంది. ఈ సమస్య రాకుండా చేస్తుంది. మంచి శరీరాకృతి మ సొంతం అవుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published: