పెద్దలు ఎటువంటి టూత్ పేస్ట్ లు వాడకుండానే, వారి దంతాలు ఎంతో గట్టిగా ఉండేవి. మనం మాత్రం దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వేప పుల్లలు ఈ బాధలు అన్నీ తొలగిస్తాయంట.
దంతాలు (Teeth). ముఖంలో నవ్వు(Smile)ను ప్రతిబించించేవి. అయితే దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రంగు మారుతుంటాయి. పసుపు పచ్చ(yellow)గా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా(smile) మొహమాటపడే పరిస్థితికి వస్తారు. అయితే. అందుకే, ఎప్పుడూ పళ్లను శుభ్రంగా (clean teeth) ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ (brush) చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్ల (white)గా మిళమిళలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి.
చిగుళ్ల నొప్పి, రక్తం రావడం..
దంత నొప్పులు (teeth pains), చిగుళ్ల నొప్పి, రక్తం రావడం (blood colt), నోటి దుర్వాసన (mouth smell) ఇలా అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే పూర్వకాలంలో మన పెద్దలు ఎటువంటి టూత్ పేస్ట్ లు వాడకుండానే, వారి దంతాలు ఎంతో గట్టిగా ఉండేవి. మనం మాత్రం దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వేప పుల్లలు ఈ బాధలు అన్నీ తొలగిస్తాయంట.
సహజమైన టూత్ పేస్టులు..
అప్పట్లో దంతాలకు వేప పుల్లలు (Neem Stick), ఉత్తరేణి పుల్లలు, ఉప్పు, ఇటుక పెల్ల పౌడర్, బొగ్గు అప్పటి సహజమైన టూత్ పేస్టులు. అంతేకాకుండా వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. ఈ వేప పుల్ల (Neem Stick )లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకని దీనితో రోజు దంతాలు తోముకుంటే చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా నివారిస్తుందని చెప్పవచ్చు. అయితే ముందుగా ఈ వేప పుల్ల (Neem Stick )ని బాగా నమిలి, ఆ రసాన్ని పిక్కిలి పట్టాలి. తర్వాత పండ్లను తోమాలి.. ఇలా ప్రతిరోజూ చేస్తే నోటి దుర్వాసన పోతుంది. సూక్ష్మ క్రిములు చేరకుండా రక్షణ కల్పిస్తుంది.
ఇక దంత చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను తొలగించాలంటే, రోజు వేపాకులతో శుభ్రం చేసుకుంటే, వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ (bacterial), యాంటి మైక్రోబియల్ (anti microbiyal) గుణాలు నోటిలోని బ్యాక్టీరియా (bacteria) ను నాశనం చేస్తాయి. తద్వారా ఆరోగ్యంగా (healthy) ఉంటాయి దంతాలు. ఇలా చేయడం ద్వారా చిగుళ్ళవాపు సహజంగానే తగ్గుతాయి.
వేప పుల్లలో యాంటీ ఫంగల్ (anti-fungal), యాంటీ వైరస్ (anti virus) గుణాలు అధికంగా ఉంటాయి. దీంతో రోజు 15 నిమిషాల పాటు పళ్ళు తోముకుంటే నోటి దంతాలు, చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి. రోజు వేప పుల్ల, బొగ్గు ఉప్పుతో దంతాలు శుభ్రం చేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.