Health tips: ఎవరైనా ఈ సిగరెట్లు తాగుతున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

ధూమపానం (Smoking)లో ఉండే నికోటిన్ ఆరోగ్యానికి హానికరమని.. ప్రత్యామ్నాయంగా ఈ సిగరెట్ (E cigarette) మార్కెట్ లోకి వచ్చింది. ఇది సురక్షితమైన ఎంపిక అంటూ యువతని (youngsters) ఆకర్షించింది. అయితే..

 • Share this:
  యువత సిగరెట్ (cigarette) తాగడం ఓ అలవాటుగా మార్చుకున్నారు. ఇక అదొక ఫ్యాషన్ గా అనుకుంటున్నారు. సిగరెట్, మద్యం తాగితే హానికరమని (harmful) ఎంతలా చెప్పినా వినిపెంచుకోరు. పైగా సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. కానీ, ఈ వ్యసనాలే భవిష్యత్తులో అనారోగ్యాలను తెచ్చిపెడుతాయి. మద్యం తాగినే ఎలాంటి అనర్థాలు (Side effects ) కలుగుతాయో తెలిసిందే. ఇక సిగరెట్​ అయితే కేన్సర్ (cancer)​ ముప్పు ఎక్కువగా వస్తుంది. వారికే కాదు వారి పక్కనున్న వారికీ క్యాన్సర్​ ప్రమాదం లేకపోలేదు. ఇలా ఎంతోమంది పురుషులే కాకుండా, పలుచోట్ల లో స్త్రీలు కూడా సిగరెట్ (cigarette)  తాగడం అలవాటు చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయారు. వీటి వల్ల ప్రాణాలు తొందరగా కోల్పోతున్నారు. అయితే..

  ధూమపానం (Smoking)లో ఉండే నికోటిన్ ఆరోగ్యానికి హానికరమని.. ప్రత్యామ్నాయంగా ఈ సిగరెట్ (E cigarette) మార్కెట్ లోకి వచ్చింది. ఇది సురక్షితమైన ఎంపిక అంటూ యువతని (youngsters) ఆకర్షించింది. దీంతో సిగరెట్ అలాగ మానలేనివారు.. ఈ‌‌‌‌‌‌‌‌- సిగరెట్ (E cigarette)  ను ఉపయోగిస్తున్నారు. ఇది చూడానికి సిగరెట్ షేప్ లోనే ఉంటుంది. ఇక పొగాకు ఉండదు.. కానీ పొగాకులో ఉండే నికోటిన్ (nicotine) రుచిని తలపించేలా కొన్ని రసాయనాలు ఉంటాయి. దీంతో ఈ సిగరెట్ ను తాగితే.. నిజమైన సిగరెట్ ను తాగిన ఫీలింగ్ వస్తుందట. ఇందుకు గాను ఈ సిగరెట్ ను కొన్ని రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తున్నారట.

  ఆరు హానికరమైన పదార్థాలు..

  అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ వారు ఈ‌ ‌‌‌‌‌‌‌- సిగరెట్  (E-cigarette) పై జరిపిన పరిశోధనలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సిగరెట్ లో ఉన్న వాపింగ్ లిక్విడ్, ఏరోసోల్స్ లో పూర్తి స్థాయి రసాయనాలను వెతికేందుకు శాస్త్రవేత్తలు (scientists) ప్రయత్నించారు. అయితే సాధారణ సిగరెట్లలో ఉండే నికోటిన్ వంటివి పదార్థాలు ఈ-సిగరెట్లలో చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ‌‌‌‌‌‌‌‌- సిగరెట్ తయారీకి వాడిన రసాయనాల్లో ముఖ్యంగా ఆరు హానికరమైన పదార్థాలు (Harmful substances) ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా స్టిమ్యులేటెడ్ కెఫీన్ (Stimulated caffeine) ఉన్నట్టు తెలిసింది.

  ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?  ధూమపానం చేసేవారికి అదనపు కిక్ ఇవ్వడానికి ఈ-సిగరెట్ల తయారీదారులు కెఫీన్ ను కావాలనే జోడించినట్టు నిపుణులు భావిస్తున్నరు. ఇంకా మూడు పారిశ్రామిక రసాయనాలు, పురుగు మందులు,  విషపూరిత ప్రభావం ఉన్న రసాయనాలు (chemicals),  శ్వాసకోశ ఇబ్బందిని  కలిగించే రెండు సువాసనలు ఉన్నాయని నిపుణులు (expert) కనుగొన్నారు. అయితే ఆ విషయాన్ని తయారీదారులు బహిర్గతం చేయకుండా ఉద్దేశ పూర్వకంగానే దాస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

  వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..

  Published by:Prabhakar Vaddi
  First published: