హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hair fall tips: బియ్యం కడిగిన నీటిని జుట్టుకు రాసుకుంటే నిజంగానే పొడుగ్గా పెరుగుతుందా? తెలుసుకుందాం?

Hair fall tips: బియ్యం కడిగిన నీటిని జుట్టుకు రాసుకుంటే నిజంగానే పొడుగ్గా పెరుగుతుందా? తెలుసుకుందాం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సగటు జీవిలో జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. అందులో బియ్యం కడిగిన నీళ్లు చాలా ఉపయోగం. దానితో జుట్టును పదిలపరుచుకోవచ్చు

ఇంకా చదవండి ...

ఆధునిక యుగంలో మనిషి ఆరోగ్యంగా ఉండటం కంటే అందంగా కనిపించడం కోసమే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. లేనివీ పోనివీ ఫేస్​ ప్యాక్​లు (face packs), క్రీమ్​లు, హెయిర్​ ఆయిల్​లు వాడి ఉన్న జుట్టు, అందాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే మనిషి అందానికి కేశాలు కూడా ముఖ్యమే. కానీ, సగటు జీవిలో జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. అందులో బియ్యం కడిగిన నీళ్లు ( rice washing water) చాలా ఉపయోగం. దానితో జుట్టును పదిలపరుచుకోవచ్చు. పొడుగ్గా పెరిగేలా చేయవచ్చంట. అదేలాగో చూద్దాం..

పోషకాలు ఉండటం..

బియ్యం (rice) కడిగిన నీటి (water)ని పారేస్తుంటారు. కానీ, దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. అదే విధంగా గంజి  (Porridge) నీరు కూడా అంతే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. బియ్యం నీటితో కడిగి ఆ నీటిని ముఖానికి (face), జుట్టు (hair)కి రాయడం వల్ల అద్భుత ప్రయోజనాలు (benefits) ఉన్నాయి. అదే విధంగా.. బియ్యం (rice)లోనే ఎక్కువ నీరు పోసి కాస్తా ఉడికిన తర్వాత నీటి (water)ని వంపేస్తారు. ఆ వంపిన నీటినే గంజి అంటారు. అసలు ఇందులోనే అనేక పోషక విలువలు ఉంటాయి. అందుకే వెనుకటి రోజుల్లో చాలా మంది గంజి తాగే బతికేవారు. కానీ, రాను రాను ఆ గంజి వాడకం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు గంజిని షాంపూ, బట్టలకి కండీషనర్‌గా వాడేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ఈ గంజిని జుట్టుకి, ముఖానికి రాయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. గంజిలో ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టుకి రాయడం వల్ల జుట్టు రాలే (hair fall) సమస్యల తగ్గుతుంది. ఇందులోని అమైనో ఆమ్లాలు కుదుళ్ళని బలంగా చేస్తాయి. ఇక ఈ గంజిలో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్‌ని కూడా కలిపి రాయొచ్చు. వాటి వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి.

మొటిమలకు చెక్​..

ఇక ముఖంపై మొటిమలు (pimples), మచ్చలు, ముడతల వంటివి ఉంటే వాటిపై ఈ గంజి నీటిని రాయడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. దీనిని ఓ స్ప్రే బాటిల్‌లో పోసి అప్పుడప్పుడు స్ప్రే చేస్తుండాలి. దీని ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక గంజి నీటిలో కాస్తా పసువు వేసి ఆ నీటిని దూదితో అద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు అన్ని దూరం అవుతాయి. అంతేకాకుండా ముఖం కూడా కాంతి వంతంగా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మవ్యాధులు దూరం అవుతాయి. అందాన్ని మెరుగుపరుచుకోవడంలో దీనికి మించినది లేదట.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

First published:

Tags: Beauty, Beauty tips, Face mask, Hair fall, Health benefits, Health Tips, Rice

ఉత్తమ కథలు