• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • DOCTOR GROSS VIDEO REVEALS WHY PILLOW SHOULD BE CHANGED FOR EVERY TWO YEARS WENT VIRAL SU GH

ఈ డాక్టర్ చెప్పేది వింటే వెంటనే మీ దిండ్లు మార్చేస్తారు.. ఎందుకో తెలుసా?

ఈ డాక్టర్ చెప్పేది వింటే వెంటనే మీ దిండ్లు మార్చేస్తారు.. ఎందుకో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా మనం ఉపయోగించే వస్తువులకు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని.. వాటిని కూడా తరచూ మార్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్లు చెబుతుండడం మనం చూస్తూనే ఉంటాం.

  • Share this:
సాధారణంగా మనం ఉపయోగించే వస్తువులకు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని.. వాటిని కూడా తరచూ మార్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్లు చెబుతుండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ చాలా వస్తువులు మనం ఎక్స్ పైరీ లాంటిది చెక్ చేయకుండా ఎప్పటికీ ఉపయోగిస్తుంటాం. అందుకే తాజాగా ఓ డాక్టర్ కనీసం రెండేళ్లకోసారైనా మనం ఉపయోగించే దిండ్లు మార్చుతూ ఉండాలని లేకపోతే దానిలోపల ఉన్న బ్యాక్టీరియా, దుమ్ము, చిన్న కీటకాలు వంటివి మన చర్మంపై ప్రభావం చూపుతాయని ఆయన వెల్లడిస్తున్నారు. సాధారణంగా మనం నిత్యం ఉపయోగించే వస్తువులన్నింటినీ శుభ్రం చేయడం మనకు అలవాటు. బెడ్ షీట్స్, కర్టెన్లు, కవర్స్ వంటివన్నీ ఎప్పటికప్పుడు ఉతకడం, ఫ్యాన్లు, టీవీలు, ఫొటో ఫ్రేముల వంటివి తుడవడం వంటివి చేస్తుంటాం. కానీ ఎప్పుడైనా దిండ్లను శుభ్రం చేయడానికి ప్రయత్నించారా? దిండు కవర్లు మార్చి వాటిని శుభ్రం చేస్తాం కానీ దిండును శుభ్రం చేయడం ఎలా అన్న విషయం మాత్రం అర్థం కాదు.

వాటిని ఒకసారి తీసుకొస్తే ఎన్నో ఏళ్ల పాటు అలాగే ఉపయోగిస్తూ ఉండిపోతాం. కానీ మన దిండ్లను కూడా రెండేళ్లకోసారి మార్చుతూ ఉండాలట. ఈ విషయాన్నే వెల్లడిస్తున్నారు డా. కరణ్ రాజ్. టిక్ టాక్ యాప్ ద్వారా ఫేమస్ అయిన ఈ డాక్టర్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దిండ్లను రోజూ ఉపయోగిస్తుంటాం. వాటిని పూర్తిగా శుభ్రం చేయడం కూడా సాధ్యం కాదు. అందుకే ప్రతి రెండేళ్లకు ఒకసారి వీటిని తొలగించి కొత్త వాటిని ఉపయోగించాలి. లేదంటే అందులో చేరిన చెమట, దుమ్ముధూళి అన్నీ బ్యాక్టీరియా, ఫంగస్, చిన్న చిన్న కీటకాలు పెరిగేందుకు తోడ్పడతాయి. మన చెమటతో పాటు మన చర్మం నుంచి తొలగిపోయే చనిపోయిన కణాలపై ఇవి ఆధారపడి జీవిస్తాయి.

సాధారణంగా ఒక వ్యక్తి నుంచి సాధారణంగా సంవత్సరానికి నాలుగు కిలోల చర్మ కణాలు మృత కణాల రూపంలో బయటకు వెళ్లిపోతాయి.  ఇవన్నీ ఎక్కువగా దిండ్లు, పరుపుల పైనే ఉంటాయి. అందుకే వీటిలో బ్యాక్టీరియా, ఫంగస్ ఎక్కువగా పెరిగే అవకాశాలుంటాయి. చర్మం, జుట్టుకు ఉన్న నూనె దిండుకి అంటుకొని అందులో సూక్ష్మ క్రిములు వేగంగా పెరిగేలా చేస్తాయి. వీటిని తొలగించడానికి వీలైనన్ని సార్లు దిండును శుభ్రం చేయడం.. రెండు సంవత్సరాలకు ఒకసారి దిండును మార్చడం వంటివి చేస్తుండాలి. పరుపు పై కూడా ఇలాంటివే క్రిములు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా వీలైనంతగా శుభ్రం చేయడం మంచిది. అని చెప్పారాయన. ఈ వీడియోకి మిలియన్ల వ్యూస్ వేలల్లో లైక్స్, కామెంట్లు రావడం విశేషం.

గతంలోనూ కరోనా, ఆరోగ్య జాగ్రత్తలు వంటి అంశాలపై ఆయన పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా పాపులర్ గా మారాయి. కరోనా సమయంలో గ్లవ్స్ ఉపయోగం గురించి ఆయన ఓ వీడియో చేశారు. మీరు ఒక గ్లవ్స్ వేసుకొని నాలుగు వస్తువులు ముట్టుకుంటే ఆ నాలుగు వస్తువుల పై ఉన్న క్రిములు మీ గ్లవ్స్ మీదకు చేరతాయి. రోజంతా గ్లవ్స్ వేసుకున్నాం కదా అని అన్ని వస్తువులను మీరు ముట్టుకుంటూ ఉంటే వాటిపై ఉన్న క్రిములన్నీ మీ గ్లవ్స్ మీదకు చేరతాయి. చేతులైతే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాం. గ్లవ్స్ ని అలాగే వదిలేస్తాం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గ్లవ్స్ పై చేరిన క్రిముల్లో కొన్నైనా మన శరీరం మీదకు చేరతాయి. కాబట్టి గ్లవ్స్ వాడడం కంటే చేత్తో ఆయా వస్తువులను ముట్టుకొని ఆ తర్వాత వాటిని శుభ్రం చేసుకోవడం మంచి పద్ధతి అని వెల్లడించారాయన.
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు