Memes of social media: మీకు మీమ్స్‌ చదివే అలవాటు ఉందా? పరిశోధనల్లో ఏం తేలిందంటే.. ..!

ప్రతీకాత్మక చిత్రం

మీమ్స్‌ అతి కొద్ది సమయంలోనే ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. అందుకే దీనికి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, ట్వీటర్‌ ఇతర సోషల్‌ మీడియాల్లో ఇవి విస్తృతంగా దర్శనమిస్తూనే ఉంటాయి.

  • Share this:
నేటి లైఫ్‌స్టైల్ ( Lifestyle), సోషల్‌ మీడియా (social media)మన జీవితంలో భాగంగా మారిపోవడం. వినోదంతోపాటు ప్రపంచాన్ని పరిచయం చేసే మెరుగైన ప్రపంచం ఇది.అవును.. సోషల్‌ మీడియా మన జీవితంలో అంత ముఖ్యమైంది. ఏదైనా సంఘటన జరిగినా.. వర్తమాన అంశాలు, రాజకీయ, సామాజిక చర్చలు, ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా దీని వేదికగా తెలియజేస్తారు.

అస్సలు ప్రపంచం ఏ మూలలో ఏం జరుగుతుందో కూడా క్షణాల్లో చూడేయగలుగుతున్నాం. దీనికి ప్రధాన కారణం సోషల్‌ మీడియా. ఈ నేపథ్యంలోనే అనేక మీమ్స్‌ (memes)సృష్టించారు. ఇవి చర్చలను కూడా హాస్యంగా ప్రదర్శిస్తున్నారు. ఏవైనా ట్రెండింగ్‌లో జరిగిన సంఘటనలను క్షణాల్లో మీమ్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చేస్తాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం మీమ్స్‌తో జీవితంలో ఏమైనా ఒత్తిడి ఉంటే సులభంగా తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం కనుగొంది.

ఇది కూడా చదవండి:   సౌత్‌కొరియా BTS బ్యాండ్‌ సభ్యుల కల్లు చెదిరే లగ్జరీ లైఫ్‌!

ఓ వార్తపత్రికలో ప్రచురించిన నివేదికలో మానసకి ఆరోగ్యంతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు వారి మాటల కంటే ఎక్కువ మీమ్స్, కార్టూన్లు స్ట్రెస్‌తో బాధపడుతున్నవారికి సానుకూల ప్రభావాన్ని చూపాయని నమ్ముతున్నారు. పెన్‌ స్టేట్‌ యూనివర్శిటీ ఆఫ్‌ అమెరికా ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం మీమ్స్‌ చూడటం వల్ల సానుకూల భావోద్వేగాలు పెరుగుతాయి. ఇది ఒత్తిడిని కూడా ఎదుర్కోవడంలో మనల్ని శక్తివంతం చేస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సైకాలజీ ఆఫ్‌ పాపులర్‌ మీడియాలో ప్రచురించిన ఈ అధ్యయనం మీమ్‌లను చూస్తే.. మానసిక స్థితి మెరుగుపడుతుందని కనుగొన్నామన్నారు.

ఇది కూడా చదవండి:  పండగపూట..ప్రత్యేకపూలతో ఫ్యాషన్‌ జడ!

ఈ అధ్యయనంలో 748 మంది పాల్గొనేవారికి 3 చిత్రాల సెట్స్‌ను చూపించారు. వారి ప్రతిచర్యలను అధ్యయనం చేశారు. సగం మందికి మీమ్స్‌ చూపించగా... మిగతా సగం వేరు ఫోటోలను చూపించారు. మీమ్స్‌ కాని చిత్రాలతో పోలిస్తే.. మీమ్స్‌ ఫోటోలు చూసిన వారిలో భావోద్వేగాలను గణనీయంగా పెంచామని అధ్యయనం ఫలితాలు చూపించాయి.

మీమ్స్‌ అతి కొద్ది సమయంలోనే ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. అందుకే దీనికి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, ట్వీటర్‌ ఇతర సోషల్‌ మీడియాల్లో ఇవి విస్తృతంగా దర్శనమిస్తూనే ఉంటాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా మీమ్స్‌ చూసే అలవాటు చేసుకోంది.
Published by:Renuka Godugu
First published: