Home /News /life-style /

DO YOU WANT YOUR SKIN HEALTHY AND BEAUTIFUL IN WINTER TOO THE FOLLOW THESE TIPS PRV

skin care for face: మీ చర్మం చలికాలంలోనూ కాంతివంతంగా ఉండాలా? అయితే ఈ ప్యాక్​ ట్రై చేయండి

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలా మందికి ఎక్కువగా అనేక రకాల చర్మ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి మనం పూర్తిగా తేనెతో చెక్ పెట్టొచ్చు. ఇక తేనెలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.

    చాలా మంది అందం (beauty)గా లేమని బాధపడుతూ ఉంటారు కూడా. ఆత్మన్యూనతా భావంలోకి వెళతారు. అయితే వారి చర్మంలో కాంతి ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే ముఖంపై నల్లటి మచ్చలు (Black spots) వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు (creams) వాడి వాటిని కనిపంచకుండా చేసినా.. అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే (Black spots)  కనిపిస్తాయి. దాచితే దాగినవి మచ్చలు.  వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. కొన్ని చిట్కాల ద్వారా (skin care for face) వాటిని తొలగించుకోవచ్చు.

    చాలా మందికి ఎక్కువగా అనేక రకాల చర్మ సమస్యలు (skin problems) ఉంటాయి. ఆ సమస్యలకి మనం పూర్తిగా తేనె (honey)తో చెక్ పెట్టొచ్చు. ఇక తేనెలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.ఇక తేనెని ఉపయోగించడం వల్ల అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని పూర్తిగా రక్షించుకోవచ్చు. ఇక అలానే చర్మం పై పొర లోకి ఇంకా సూక్ష్మ రంధ్రాలు లోకి చొచ్చుకు వెళ్లిన మలినాలుని కూడా తేనె ఖచ్చితంగా పోగొడుతుంది.

    ఇక మొటిమలుని (pimples) కూడా ఈ తేనే తొలగిస్తుంది. అలాగే మంచి స్కిన్ టోన్ ఇంకా చర్మం దృఢంగా ఉండేటట్లు తేనె చూస్తుంది.ఇక నిజంగా తేనెలో ఉండే ఔషధ గుణాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. తేనె (honey) దెబ్బతిన్న చర్మ చికిత్స ఇంకా కొత్త చర్మకణాలు పునరుత్పత్తికి ఉపయోగ పడుతుంది. అలాగే తామర వంటి ఇతర చర్మ సమస్యలను (skin problems) కూడా ఇది తొలగిస్తుంది.ఇక దీనిలో శక్తివంతమైన యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇక తేనెని ఉపయోగించడం వలన దురద, అంటు వ్యాధులనేవి పూర్తిగా తగ్గిపోతాయి. ఇక అలానే తేనెలో ప్రకృతి సహజమైన లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

    ఇక తేనె వల్ల అనేక రకాల ఉపయోగాలు కలుగుతాయి. ఇంకా అలానే మరెన్నో ఉపయోగాలు కూడా వున్నాయి. ఇక వాటిని కూడా మీరు చూసేయండి. తేనెను తరచూ ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ చర్మ కణాలను తొలగి ముఖం మడతలతో కనిపించే తీరు పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ముఖం ముడతలు అనేవి పడకుండా ఉండాలి అంటే తేనె తో మీరు ఫేస్ ప్యాక్ లాంటివి తయారు చేసుకోవడం చాలా మంచిది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు