Home /News /life-style /

DO YOU WANT YOUR SKIN BRIGHT AND BEAUTIFUL THEN USE THIS PACK WHICH IS LOW COST TO PREPARE PRV

skin care for face: మీ ముఖం అందంతో మెరిసిపోవాలా? అయితే తక్కువ ఖర్చుతో చేసుకునే ఈ ప్యాక్​ను ప్రయత్నించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చర్మం తరచుగా జిడ్డు, నీరసంగా మారుతుంది. ఇది క్రమంగా మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు తగ్గిపోతుంది.

    అందం (beauty) ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఈ వాతావరణంలో తేడాలు, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతిని ముఖంలో నలుపురంగు వస్తుంది. చల్లటి వాతావరణం కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. తద్వారా, చర్మం తరచుగా జిడ్డు, నీరసంగా మారుతుంది. ఇది క్రమంగా మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు తగ్గిపోతుంది. మొటిమలు (pimples) తయారవుతాయి. ఇక వేళకు తినకుండా ఒత్తిడికి లోనయ్యే వారికి నల్లటి వలయాలు (dark circles) కంటి చుట్టూ ఏర్పడతాయి. మనం తినే ఆహారం కూడా మన అందం (beauty)పై ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యులు సరైన పోషక ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. అయితే కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్​ ప్యాక్​లు వాడినా తమ చర్మం (skin) జిడ్డు (oily)గా ఉంటుందని బాధపడుతుంటారు.

    ఫేస్‌ క్లీనర్స్‌ (face cleaners) ఖరీదు ఎక్కవ. పైగా ఇప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి. అలాగనీ ఆందోళన అవసరం లేదు. వంటింట్లో లభించే పదార్థాలతో తక్కువ ఖర్చులోనే (face pack for low rates) ఫేస్‌వాష్‌ తయారుచేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం (Skin acre for face)...

    కావలసినవి: ఓట్స్‌ పొడి- ముప్పావు కప్పు, బాదం గింజల పొడి- రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు- టేబుల్‌స్పూన్‌, సెనగపిండి- అరకప్పు, లావెండర్‌ నూనె- పదిచుక్కలు.

    తయారీ తెలుసుకుందాం..

    ఒక గిన్నెలో ఓట్స్‌పొడి, పసుపు (Turmeric), బాదం గింజల పొడి, శనగపిండి, లావెండర్‌ నూనె వేసి బాగా కలిపితే ఫేస్‌క్లీనర్‌ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరచాలి. ముఖం శుభ్రం చేసుకునే ముందు ఒక స్పూన్‌ తీసుకొని ముఖానికి రాసుకోవాలి. ఓట్స్‌ పొడి సహజ స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది. బాదం గింజల పొడి మృతకణాలను తొలగించి ముఖాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. పుసుపు చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. సెనగపిండి చర్మం మీది అదనపు నూనెల్ని గ్రహించి, చర్మ రంధాల్రు తెరచుకునేలా చేస్తుంది. ముఖం మీది మచ్చల్ని, చర్మ మంటను లావెండర్‌ నూనె తగ్గిస్తుంది.

    ఆహారపు అలవాట్లు..

    అందాన్ని (beauty) పెంచుకోవడం కంటే ఇక పలురకాల ఆహారపు అలవాట్లను (food habits) అలవర్చుకుంటే సహజసిద్ద అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా చర్మ సౌందర్యం (skin beauty) కోసం పలు రకాల పండ్లు (fruits) తినడం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. కేవలం చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి పైన మెరుగులు దిద్దితే సరిపోదని ఆరోగ్యాన్ని పెంచితే చర్మ సౌందర్యంఆటోమేటిక్ (automatic) గా మీ సొంతం అవుతుంది అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు