Home /News /life-style /

DO YOU WANT YOUR HAIR SHOULD BE STRONG AND SOFT THEN FOLLOW THESE TIPS TO STOP HAIR FALL PRV

Hair loss: జుట్టు బలంగా, మృదువుగా ఉండాలా? ఈ ప్యాక్​తో జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్ల జుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది.

ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే బాధ ఎక్కువగా ఉంటుంది చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్ల జుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె (oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (hair) అందరికీ ఉండేది. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దాని వలన తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి. కొన్ని సహజ పద్దతులతో జుట్టుని కాపాడుకోవచ్చు.

ఆలివ్ ఆయిల్​తో..

నెయ్యి (ghee)లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మంచి కండిషనర్ లా పని చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ (olive oil) కలిపి జుట్టుకి అప్లై చేయండి. ఇరవై నిమిషాలు అలాగే ఉంచేసి తరువాత కడిగేయండి. ఈ ప్యాక్ జుట్టుని సాఫ్ట్ గా మ్యానేజ్ చేసేందుకు వీలుగా చేస్తుంది.

నెయ్యిలో నిమ్మరసం (lemon juice) కలిపి చుండ్రుని ట్రీట్ చేయడానికి కూడా వాడవచ్చు. మీ స్కాల్ప్ ని బాగా మసాజ్ చేయడం మర్చిపోకండి. ఇక మన పెదాలు ఎండకి పగిలిపోతుంటాయి. కొద్దిగా నెయ్యి వెచ్చ చేసి రాత్రి నిద్రకి ముందు ఆ నెయ్యిని పెదవులకి అప్లై చేయండి. మీరు నిద్ర లేచేప్పటికి మీ లిప్స్ పైన డ్రై ఫ్లేక్స్ కనబడతాయి. వాటిని స్క్రబ్ చేసేయండి. మీ పెదాలు మృదువుగా మారిపోతాయి.

చుండ్రు  సమస్యలు తగ్గించడానికి గసగసాలు బాగా పనిచేస్తాయి. గసగసాలను కొన్ని తీసుకొని తగా పేస్టులా చేసుకొని, తలంతా అప్లై చేసి అరగంట తర్వాత శీకాకాయ తో తలస్నానం చేయడం వల్ల చుండ్రు  సమస్య తగ్గుతుంది. కాసింత బేకింగ్ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే, మరీ ఎక్కువగా బేకింగ్ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Beauty tips, Hair Loss

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు