Home /News /life-style /

DO YOU WANT TO SLEEP COMFORT FULLY IN NIGHT THEN USE THIS BIRYANI LEAF FOR BETTER SLEEP REGULARLY PRV

sleep tips: రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టాలంటే.. ఈ బిర్యానీ ఆకులను ఇలా వాడండి.. హాయిగా నిద్ర పడుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బిర్యానీ ఆకులను ఓ పద్దతిలో వాడితే మీకు ఇట్టే రోజూ నిద్ర పడుతుందట. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
  ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం..  అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల (health problems)తో నేటి రోజులలో జనాలు బాధపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర (sleep) లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది. కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం (sleeping)..  ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు ఎంతో మందిపై  ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడి పోతున్నాయి.

  ఈ మధ్య కాలంలో యువత (youngsters) పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి (Insomnia) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో  ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు (sleep tips) చేస్తూ ఉంటారు. అయితే బిర్యానీ ఆకులను (Biryani leaf) ఓ పద్దతిలో వాడితే మీకు ఇట్టే రోజూ నిద్ర పడుతుందట. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

  బిర్యానీలో మంచి వాసన కోసం వాడే ఈ ఆకుని కొంతమంది తేజ్ పత్తా గా పిలుస్తారు. ఘాటైన సువాసన ఉండడంచేత బిర్యానీ లేదా పులావ్ లోని ముఖ్య పదార్ధాలలో ఒకటిగా నిలిచింది. ఈ ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోగాలున్నాయి (Health benefits). అందుకని తరచుగా ఈ ఆకుని ఉపయోగించడం మంచిదని ఆయుర్వేద (Ayurveda) నిపుణులు చెబుతున్నారు.

  శ్వాసకోశ వ్యవస్థ (Respiratory system) ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ‘ఇంటర్‌ల్యూకిన్‌’ అనే ప్రొటీన్‌ను వ్యాధి నిరోధక వ్యవస్థ స్వల్ప పరిమాణాల్లో విడుదల చేస్తూ ఉంటుంది. బిరియానీ ఆకు తరచుగా తీసుకుంటే ఈ ప్రొటీన్‌ విడుదల తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్‌, చక్కెరలను తగ్గించి శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ తయారయ్యేలా బిరియానీ ఆకు (Biryani leaf) తోడ్పడుతుంది.

  ప్రతిరోజూ రాత్రి కొద్దిగా  ఆకులని నీళ్లలో కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. లేదా నిద్రపోయే సమయంలో దిండు పక్కనే తువ్వాలు మీద రెండు చుక్కల బే లీఫ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి పడుకుంటే, మంచి నిద్ర (better sleep) పట్టడంతో పాటు, ఉదయాన్నే కొత్త ఉత్సాహంతో నిద్ర లేస్తారు.

  బిరియానీ ఆకు (Biryani leaf)లో ఒత్తిడిని తొలగించే గుణాలు ఉన్నాయి. కనుకనే ఆరోమాథెరపీలో భాగంగా దీనిని ఉంటారు. కాబట్టి ఒత్తిడిగా అనిపిస్తే బాగా ఎండిన బిరియానీ ఆకును కాల్చి, వాసన పీల్చాలి. గది తలుపులు మూసి, ఓ గిన్నెలో బిరియానీ ఆకును కాల్చాలి. అప్పుడు పల్చని పొగతో పాటు, సువాసన గది మొత్తం అలముకుంటుంది. ఈ వాసనను పీల్చడం వల్ల మనసు నెమ్మదించి, ఒత్తిడి తొలగిపోతుంది.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ayurveda health tips, Sleep tips

  తదుపరి వార్తలు