హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weight loss tips: బరువు తగ్గాలంటే జిమ్​కే వెళ్లాల్సిన అవసరమే లేదు.. ఈ టిప్స్​ పాటించినా చాలు..

Weight loss tips: బరువు తగ్గాలంటే జిమ్​కే వెళ్లాల్సిన అవసరమే లేదు.. ఈ టిప్స్​ పాటించినా చాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

త్వరగా బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి  క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి. అయితే జిమ్​కు వెళ్లకుండా ఈజీగా బరువు తగ్గాలనుకునే వారికి కొన్నిచిట్కాలు ఉన్నాయి. ఇవి రెగ్యులర్​గా పాటిస్తే బరువు తగ్గిపోతారు. ఆ చిట్కాలు ఒకసారి చూద్దాం..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  చాలామంది ఎంత ప్రయత్నించినా బరువు(weight) తగ్గరు. కొందరు డైట్​లు, జిమ్(gym)​ల వంటివి ప్రయత్నించి ఉంటారు. అలాంటి వారిలో ఫలితాలు కనిపించినా.. సమయం లేక మధ్యలో వదిలేసిన వారి పరిస్థితి వేరు. బరువు తగ్గడానికి(weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం(food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు(tips) పాటిస్తే బరువు(weight) తగ్గుతారు. అతిగా వ్యాయామాలు చేయడమే. ఎంత చక్కటి వర్కవుటైనా... ఇన్నిసార్లు... ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. అలా కాకుండా త్వరగా బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి  క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి. అయితే జిమ్​కు వెళ్లకుండా ఈజీగా బరువు తగ్గాలనుకునే వారికి కొన్నిచిట్కాలు ఉన్నాయి. ఇవి రెగ్యులర్​గా పాటిస్తే బరువు తగ్గిపోతారు. ఆ చిట్కాలు ఒకసారి చూద్దాం..

  బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు చేసే మొట్ట మొద‌టి పొర‌పాటు బ్రేక్ ఫాస్ట్‌ని స్కిప్ చేయ‌టం. బ్రేక్ ఫాస్ట్ తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల ఆక‌లి ఎక్కువ అవ‌టంతో ఎక్కువ తిన‌డం జ‌రుగుతుంది. అల్పాహారం(breakfast) తీసుకునే వారి కంటే బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసేవారిలో ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌లు స‌ర్వేల్లో తేలింది. సో బ‌రువు త‌గ్గాల‌నుకుంటే మాత్రం అల్పాహారం క‌చ్చితంగా తీసుకోవాలి. మీ శరీర బరువును తగ్గించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఆహారం ద్వారా మీ శరీరానికి(body) అందిన అధిక కొవ్వును కరిగించడానికి వ్యాయామం చక్కటి మార్గం. ఆహారం తినకుండా బరువు తగ్గాలనుకోవడం సరైన పని కాదు. దానివల్ల ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇవాళే వ్యాయామం ప్రారంభించండి.

  బరువు తగ్గడానికి ఆహారం మానేయడానికి బదులు మనస్ఫూర్తిగా తినడం నేర్చుకోండి. మీ పొట్టకి కావాల్సినంత మాత్రమే తినండి. మనస్ఫూర్తిగా తినడం వల్ల మీ పొట్ట(stomach)కి ఎంత సరిపోతుందో మీ మెదడు సంకేతాలు అందిస్తుంది. అందుకే తినేటపుడు స్మార్ట్ ఫోన్ వాడడం, టీవీ చూడడం చేయవద్దు. ఆహారాన్ని సరిగా నమిలి తింటున్నారో లేదో చూసుకోండి. ఇది జీర్ణక్రియకే కాదు ఆహారాన్ని ఎక్కువ తినకుండా చూసుకుంటుంది. దానివల్ల అధిక కేలరీలు శరీరాన్నికి చేరవు.

  ఎక్కువ తినడం వల్ల మీ శరీరానికి చేటు కలుగుతుంది. దాన్నుండి బయటపడడానికి ఎక్కువ నీళ్ళు తాగండి. దీనివల్ల తొందరగా ఆకలి వేయదు. అప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలామంది ఒత్తిడిలో ఎక్కువ తింటుంటారు. అందుకే బరువు పెరుగుతుంటారు. ఒత్తిడి ఎక్కువైతే తినే ఆహారం మీద నియంత్రణ ఉండదు. ఆకలి ఎక్కువ అవుతున్నటు అనిపించి ఎక్కువ ఆహారాన్ని శరీరానికి అందించేలా ఒత్తిడి చేస్తుంది. అందుకే ఒత్తిడిని పక్కన పెట్టండి. అప్పుడే బరువు తగ్గుతారు

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Exercises, Gym, Weight loss tips

  ఉత్తమ కథలు