Home /News /life-style /

DO YOU WANT TO LOSE WEIGHT EASILY THEN TRY THIS METHODS TO CONTROL HEAVY WEIGHT IN FEW DAYS FULL DETAILS HERE PRV

Easy Weight loss tips: ఈజీగా బరువు తగ్గాలని ఉందా? అయితే ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​.. బరువు కంట్రోల్​లో ఉంటుంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామందికి అధిక బరువు సమస్య తెచ్చిపెడుతుంది. మీరు బరువు తగ్గాలని (weight loss) తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మీకు ఏదీ సరిగ్గా పని చేయనట్లయితే ఈ పద్దతి సరిగా పాటించండి

    చాలామందికి అధిక బరువు సమస్య తెచ్చిపెడుతుంది. మీరు బరువు తగ్గాలని (weight loss tips) ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మీకు ఏదీ సరిగ్గా పని చేయనట్లయితే ఈ పద్దతి సరిగా పాటించండి. నిద్రపోవడం (sleep mandatory) వంటి విశ్రాంతి కూడా మీకు కిలోల బరువు తగ్గడానికి (weight loss tips) సహాయపడుతుంది. అంతేకాకుండా ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి (Easy Weight loss tips) సహాయపడుతుంది అనే వాస్తవం శాస్త్రీయంగా నిరూపించబడింది. దీనిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కడుపు చెట్టు కొవ్వును కరిగిస్తుంది మరియు శరీర కొవ్వును అణచివేస్తుంది. చాలా మంది సూప్‌లను తాగడానికి బాగా ఇష్టపడతారు. సూప్​లలో పోషకాలు (Nutrients) ఎక్కువగా ఉండటంతో పాటు, సులువుగా తయారు చేయగలిగే ఆహార పదార్థం కావడంతో దీనిలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇది చాలా సులువుగా కూడా జీర్ణమవుతుంది. తద్వారా బరువు తగ్గడంలోనూ సూప్‌ ఉపయోగపడుతుంది.

    బరువు తగ్గడం, డైట్‌ విధానాలపై అన్‌ లూయిస్‌ జిటెల్‌మన్‌ రాసిన ‘దిన్యూ ఫ్యాట్‌ ఫ్లష్‌ ప్లాన్’బుక్​లోసూప్​ గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. బరువు తగ్గాలని కోరుకుంటున్న వారికి సూప్‌ ఎలా ఉపయోగపడుతుందనే అంశాలను అన్‌ లూయిస్‌ జిటెల్‌మన్‌ వివరించారు. ఆయన చెప్పిన వాటి మేరకు.. కిటో డైట్‌ (Keti Diet) పాటిస్తూ సూప్‌ తాగితే ఒక వారంలోనే 18 పౌండ్ల బరువు తగ్గవచ్చని ఆయన తెలిపారు. సూప్​తో బరువు ఎలా తగ్గాలో తెలుసుకుందాం.

    ఫాస్ట్‌ రిజల్ట్స్‌ కావాలనుకొనే వారు (Easy Weight loss tips) కీటో డైట్‌ను ఎంచుకోవచ్చు. దీని గురించి అన్‌ లూయిస్‌ జిటెల్‌మన్‌ మాట్లాడుతూ..‘ సరైన ఆహార పదార్థాలు తీసుకొంటూ కీటో డైట్‌ను పాటిస్తే కనీసం ఐదు రోజుల నుంచి గరిష్టంగాఐదు వారాల్లో బరువు తగ్గుతారు.’ అని అన్నారు. సూప్‌ చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చు.

    కాబట్టి ఎక్కువ మంది హెల్తీ స్నాక్‌గా తీసుకొంటారు. సూప్​ త్రాగడం వల్ల తొందరగా ఆకలి వేయదు. ఇది మెటబాలిస్మ్‌ను మెరుగుపరుస్తుంది. కొవ్వును కరిగించడంపై పని చేస్తుంది. ఈ కారణాలతో త్వరగా బరువు తగ్గుతారు. జిటెలెమన్‌ సూచించే సూప్‌ తయారు చేసుకోవడానికిఆనియన్స్‌, లైక్‌ జ్యూస్‌, ససమే ఆయిల్‌, కర్రీ పౌడర్‌, కోకోనట్‌ మిల్క్‌, హెర్బ్స్‌, గార్లిక్, మీకు నచ్చిన కూరగాయల ముక్కలు, మష్రూమ్స్‌ అవసరమవుతాయి.

    ఈ హెల్తీసూప్స్‌ ట్రై చేయండి

    టమోటా సూప్‌: ఇది చాలా పాపులర్‌ సూప్‌. క్రీమీగా ఉండే ఈ రుచికరమైన సూప్‌ను ఎక్కువ మంది త్రాగుతుంటారు.ఈ సూర్‌ జీర్ణశక్తిని పెంచుతుంది. చర్మం ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది.

    చికెన్‌ సూప్‌: కీటో డైట్‌లో ఉండేటప్పుడు శరీరానికి ప్రోటీన్లు అందేలా చూసుకోవాలి. అందుకే, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్​ తినండి. అయితే, చికెన్‌ సూప్‌ తయారు చేసే సమయంలో ఎక్కువ సాల్ట్‌ వాడకుండా జాగ్రత్తపడండి.

    మష్రూమ్‌ సూప్‌: మష్రూమ్స్‌లో కాలరీస్‌ తక్కువగా ఉంటాయి. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. శాఖాహారులు ప్రొటీన్ల కోసం మష్రూమ్స్‌ను వినియోగించవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Weight loss tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు