మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. ప్రతీ ఒక్కరికి బరువు (weight) అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. డాక్టర్లు వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే బరువు తగ్గడం కోసం రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న (weight loss) కల.. కలగానే ఉండిపోతుంటుంది. అయితే కొన్ని పద్దతులు (weight loss tips) పాటిస్తే బరువు అదుపులో పెట్టుకోవచ్చు.
సరైన ప్రణాళికతో వాకింగ్..
అధిక బరువు తగ్గాలనుకొనే (weight loss) వారు సరైన ప్రణాళికతో వాకింగ్ చేయాలే గాని దానికి సుమారుగా 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు 9weight loss). ఈ క్రమంలో అలాంటి వారి కోసం నెల రోజుల (One month) పాటు వాకింగ్ ప్లాన్ ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం 20 నిమిషాల పాటు నెమ్మదిగా వాకింగ్ (walking) చేయాలి తర్వాత పదిహేను నిమిషాలపాటు ఒక మోస్తరు వేగంతో వాకింగ్ (walking) చేయాలి ఇలా మళ్ళీ ఐదు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ చేయాలి. మంగళవారం రోజు పది నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ తరువాత 20 నిమిషాలు మోస్తారు వేగవంతమైన వాకింగ్ అలాగే ఐదు నిమిషాలు నెమ్మది వాకింగ్. మరుసటి రోజున విశ్రాంతి తీసుకోవాలి.
Thursday 20 నిమిషాల పాటు నెమ్మదిగా నడక (slow walking) చేయాలి. తర్వాత 15 నిమిషాలు మోస్తారు వాకింగ్ తర్వాత నిమిషాలు నెమ్మది నడక చేయాలి. శుక్రవారం పది నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ 20 నిమిషాలు మోస్తారు వాకింగ్ 20 నిమిషాల వేగవంతమైన వాకింగ్. శనివారం ఐదు నిమిషాలు నెమ్మదిగా నడక 5 నిమిషాలు మోస్తారు వాకింగ్ 25 నిమిషాలు వేగమైన వాకింగ్ (fast walking) తరువాత ఐదు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్. ఆదివారం రోజున విశ్రాంతి తీసుకోవాలి.
తర్వాత రెండో వారంలో (second week) సోమవారం 10 నిమిషాలు మోస్తరు వాకింగ్, 2 నిమిషాలు వేగమైన వాకింగ్, పది నిమిషాలు మోస్తరు వాకింగ్ ఐదు నిమిషాలు నెమ్మదిగా నడక. మంగళవారం ఐదు నిమిషాలు మోస్తరు వాకింగ్ ముప్పై ఐదు నిమిషాలు మోస్తారు మరియు వేగవంతమైన నడక తర్వాత ఐదు నిమిషాలు నిమ్మదిగా వాకింగ్ చేయాలి. బుధవారం రోజున విశ్రాంతి తీసుకోవాలి. గురువారం 10 నిమిషాలు మోస్తారు వాకింగ్, 30 నిమిషాలు వేగమైన వాకింగ్ పది నిమిషాలు మోస్తరు వాకింగ్ ఐదు నిమిషాలు నెమ్మదిగా నడక. శుక్రవారం 5 నిమిషాలు మోస్తరు వాకింగ్, 35 నిమిషాలు మోస్తరు వాకింగ్ మరియు వేగవంతమైన వాకింగ్ ఐదు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే మీ బరువు అదుపులో ఉంటుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food, Walking, Weight loss tips