Home /News /life-style /

DO YOU WANT TO KNOW WHICH FRUIT CAN REDUCE CONSTIPATION AND THE FRUIT IS PRV

health tips: మలబద్దకంతో బాధపడుతున్నారా? ఈ పండు తింటే చాలు.. సమస్య తీరినట్లే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మలబద్దకం సమస్యను ఆయుర్వేద మందులను వాడి సింపుల్గా తగ్గించవచ్చు. అంతేకాకుండా మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి ఓ పండు బాగా ఉపయోగపడుతుందట. అదే అరటి పండు.

    చాలా మంది మలబద్దకం(constipation)తో బాధపడుతూ ఎలా నయం చేసుకోవాలో తెలియక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేలల్లో ఖర్చు చేసుకుంటున్నారు. ఈ సమస్య గురించి బహిరంగంగా ఎవరికీ చెప్పుకోలేక చాటుగా భరిస్తూ అనేక మంది అవస్థలు పడుతున్నారు. అసలు మలబద్దకం(constipation) కోసం ఎటువంటి మందులు వాడాలో తెలియక తికమకపడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో పిల్లల ఆరోగ్య విషయాల గురించి తల్లిదండ్రులు అనేక రకాలుగా చింతిస్తూ ఉంటారు. ముందే ఈ రోజుల్లో పిల్లలు బయట ఆటలు ఆడడం పూర్తిగా మరిచిపోతున్నారంటే ... ఈ మహమ్మారి కారణంతో మనమే వారిని బయట ఆడటం వద్దని వారిస్తూ ఉన్నాం. అటువంటి సమయంలో వారికి ఇళ్లు, ఫోన్లే ప్రపంచంలా మారిపోయాయి. వారిలో మలబద్దకం సమస్య ఉద్బవించడానికి ఇది కూడా ఒక కారణమే.  మలబద్దకం సమస్యను ఆయుర్వేద మందులను వాడి తగ్గించవచ్చు. అంతేకాకుండా మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి ఓ పండు(fruit) బాగా ఉపయోగపడుతుందట. అదే అరటి పండు. ఇంతకీ అరటిపండు(banana)తో మలబద్దకం ఎలా తగ్గించుకోవచ్చో ఓ సారి తెలుసుకుందాం..

    అరటిపండు అంటే చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంతింటూ ఉంటారు. అరటి పండు(fruit) తింటే(eat) లావు అవుతారని చాలా మంది అరటిపండు తినటానికి ఇష్టపడరు. అయితే అరటిపండు తినటం వలన లావు అవ్వటం అనేది ఒక అపోహ మాత్రమే. 100 గ్రాముల అరటిపండు తీసుకుంటే 120 కేలరీలు వస్తాయి. అదే మనం 100 గ్రాముల రైస్ తీసుకుంటే 300 కేలరీలు వస్తాయి. అరటిపండులో మంచి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మన జీర్ణ వ్యవస్థ శుభ్రంగా ఉండేలా చేయటమే కాకుండా మంచి బ్యాక్టీరియా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు అరటిపండుతో సలాడ్ తయారుచేసుకుందాం.
    ఒక కప్పు అరటి పండు ముక్కలలో పావు స్పూన్ కారం,పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ సలాడ్ ని డైటింగ్ లో ఉన్నవారు తీసుకుంటే బాగుంటుంది. ఈ సలాడ్ ని సాయంత్రం సమయంలో తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఉదయం నుంచి పని చేసి సాయంత్రం అయ్యేసరికి అలసి పోతూ ఉంటాం. ఆ సమయంలో ఏదైనా తినాలని అనిపిస్తుంది. ఆ సమయంలో ఈ బనాన సలాడ్ తీసుకుంటే బాగుంటుంది. ఈ అరటి పండు సలాడ్ ని బరువు తక్కువ ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు, బీపీ ఉన్నవారు తీసుకోవచ్చు. అయితే బీపీ ఉన్నవాళ్లు సోడియం తక్కువ ఉన్న ఉప్పును వాడితే మంచిది.

    అరటి పండుతో చాలా లాభాలు..

    అరటి పండు తినటం(eat) వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, మనకి అరటిపండ్లు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఒక అరటిపండు తింటే చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అరటి పండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రోజంతా ఎనర్జీని ఇచ్చి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఒక నెల రోజుల పాటు రోజుకొక అరటి పండు తింటే మలబద్దకం సమస్య తొలగిపోతుంది. అరటిపండులో ఉండే ఫైబర్ మలబద్దక సమస్యను తొలగిస్తుంది. ఎసిడిటీ సమస్యలు, గుండెకు సంబందించిన సమస్యలు కూడా తగ్గుతాయి. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటంవలన రక్తపోటును నియంత్రిస్తుంది. ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది. అరటిపండులా విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వలన కంటి చూపుకు కూడా చాలా పనిచేస్తుంది.ఈ పండు తినడం వలన జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఎసిడిటీని ఎక్కువగా తగ్గిస్తుంది. మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Banana, Fruits, Health benefits, Health problem, Health Tips, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు