హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Cry: ఏడవడమూ మనిషికి మంచే చేస్తుందట.. బ్రదరూ... ఎలాగంటే..

Cry: ఏడవడమూ మనిషికి మంచే చేస్తుందట.. బ్రదరూ... ఎలాగంటే..

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మనిషికి ఏడుపు కూడా కావాలంటా బ్రదర్​. ఆరోగ్యకర జీవితానికి ఏడుపుకూడా ఓ సాధనమంటా. మనుసులో బాధ మొత్తం తొలిగిపోయేలా ఏడవడమే మంచిదంటా. ఈ ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకోవాలి.

  నవ్వు ఒక భోగం, నవ్వడం యోగం, నవ్వలేకపోవడం రోగమని అంటారు కదా​. ఇపుడైతే ఏడవడం ఒక భోగం, ఏడవడం(cry) యోగం, ఏడవలేకపోవడం ఒక రోగం(diseases) అనాలేమో. అవును మనిషికి ఏడుపు కూడా కావాలంటా బ్రదర్​. ఆరోగ్యకర జీవితానికి ఏడుపుకూడా ఓ సాధనమంటా. మనుసులో బాధ(pain) మొత్తం తొలిగిపోయేలా ఏడవడమే మంచిదంటా.  ఏంటి అయితే ఇపుడు ఏడవమని చెబుతున్నాడా? ’’ అని ఆశ్చర్యపోతున్నారా? మరీ అలా ఏం లేదులే కానీ, ఏడుపు వస్తే మాత్రం ఏడ్చేయండి. ఎందుకంటే ఏడుపు కూడా మనిషికి అవసరం. ఇపుడు ఈ ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకోవాలి.

  టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మనిషి కూడా అంతేవేగంగా దాన్ని అందిపుచ్చుకునేందుకు ఉవిళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో ఉరుకులు పరుగుల జీవనంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. కాస్త స్ట్రెస్‌ను తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా వంటివి ప్రయత్నించి సేదతీరుతున్నారు జనం. ఈ క్రమంలో మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంతముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు(experts) చెబుతున్నారు. ఎక్కువ సమయం మనం దేనిగురించైనా బాధపడుతూ ఏడిస్తే మన మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌ అనే ఫీల్‌ గుడ్‌ రసాయనాలు విడుదల కావడంతో శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు కలుగుతాయి. ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఏడవడం వల్ల మెదడు శరీర ఉష్ణోగ్రతలు సంతులితంగా ఉంటాయి. దీంతో మనం సమన్వయంతో ఆలోచించగలుగుతాం. అప్పుడప్పుడు ఏడవటం ద్వారా మన బీపీ కూడా కంట్రోల్‌ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు ఏవీ దరిచేరవు.

  కళ్ల(eye) నుంచి నీరు కారడం వల్ల కంటికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన కళ్లల్లో ఉండే దుమ్ము(dust), మలినాలు బయటకు పోగొడతాయి. కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్‌లు .. క్రిములు, బ్యాక్టీరియాల(bacteria) నుంచి కన్నుకు రక్షణ కల్పిస్తాయి. కన్నీళ్లు రావడం వల్ల చెడు ఆలోచనలు దూరం కావడంతోపాటు, మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్‌ ఆలోచనల వైపు దృష్టి మరులుతుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Health benifits, Health problem, Life Style

  ఉత్తమ కథలు