హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Skin care: చర్మం ఎక్కువ అందంగా ఉండాలంటే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి

Skin care: చర్మం ఎక్కువ అందంగా ఉండాలంటే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చర్మం యొక్క గోప్ప తనం ఏంటంటే పాత కణాలు, చెడిపోయిన కణాలు నిరంతరం కొత్త కణాలతో రిప్లేస్ అవుతుంటాయి. మంచి పోషకాహారం మరియు మంచి జీవన శైలి ఉంటే  ఈ  ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. దాని వల్ల మీ చర్మం (skin) సహజంగా అందం (beauty)గా అవుతుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  చల్లటి వాతావరణం కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. తద్వారా, చర్మం తరచుగా జిడ్డు, నీరసంగా మారుతుంది. ఇది క్రమంగా మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు తగ్గిపోతుంది. మొటిమలు (pimples) తయారవుతాయి. ఇక వేళకు తినకుండా ఒత్తిడికి లోనయ్యే వారికి నల్లటి వలయాలు (dark circles) కంటి చుట్టూ ఏర్పడతాయి. మనం తినే ఆహారం కూడా మన అందం (beauty)పై ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యులు సరైన పోషక ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. అయితే  కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్​ ప్యాక్​లు వాడినా తమ చర్మం (skin) జిడ్డు (oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటిస్తే జిడ్డును తొలగించుకోవచ్చు. మన  చర్మం యొక్క గోప్ప తనం ఏంటంటే పాత కణాలు, చెడిపోయిన కణాలు  నిరంతరం  కొత్త కణాలతో రిప్లేస్ అవుతుంటాయి. మంచి పోషకాహారం మరియు మంచి జీవన శైలి ఉంటే  ఈ  ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. దాని వల్ల మీ చర్మం (skin) సహజంగా అందం (beauty)గా అవుతుంది.

  ఆరోగ్యకరమైన  చర్మానికి ..

  అయితే మన చర్మం ఆరోగ్యంగా (healthy), అందంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి విటమిన్లు (vitamins) ఉండాలనేది తెలుసుకుందాం.. విటమిన్ ఇ (vitamin E) ఆరోగ్యకరమైన చర్మం (health skin) పెరగడానికి తోడ్పడుతుంది. విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలలో బాదం (almonds), అవోకాడో, సన్ ఫ్లవర్ ఆయిల్, మొక్కజొన్న నూనె.  ఆరోగ్యకరమైన  చర్మానికి  మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు  చాలా అవసరం. అవోకాడో,  చేపలు (fish), కాయకూరలు (vegetables) మరియు విత్తనాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

  విటమిన్ సి (vitamin C) మంచి యాంటీ ఆక్సిడెంట్. అంతేకాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగా (brightness) చేస్తుంది మరియు మచ్చలను తోందరగా పోగొడుతుంది . యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా నిమ్మకాయ (lemon). జామకాయ (guava), కివి ఫ్రూట్స్, నారింజ, బొప్పాయి, స్ట్రాబెర్రీ , బ్లాక్ కారెంట్స్, బ్లూ బెర్రీస్లో ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది

  జింక్ (zink) ఎక్కువగా తీసుకోవడం చర్మానికి (skin) చాలా మంచిది. జింక్ చర్మాన్ని డ్యామెజ్ కాకుండా కాపాడుతుంది . అలాగే చర్మాన్ని మృదువుగా చేస్తుంది. జింక్ అధికంగా  చేపలు, రెడ్ మీట్ , నువ్వులు, వేరుశనగకాయ, పుట్టగొడుగులు, ఆకుకూరల్లోఉంటాయి. రోజుకు కనీసం 6-7 గ్లాసుల నీరు తాగాలి . నిమ్మకాయ లేదా  వాటర్ మిలన్ వంటి పండ్ల రసం తీసుకుంటే ఇంకా మంచిది.రోజు కనీసం 6-8 గంటల నిద్ర చాలా అవసరం.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Beauty tips, Skin care

  ఉత్తమ కథలు