Home /News /life-style /

DO YOU WANT BETTER SLEEP AT NIGHT THEN TAKE THESE BANANA TEA FOR HAPPY SLEEP PRV

sleep tips: రాత్రిళ్లు హాయిగా నిద్ర పట్టాలంటే ఈ పండుతో చేసిన టీ తాగండి.. ప్రశాంతంగా పడుకోవచ్చు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిద్రపట్టడం లేదా, మీకున్న టెన్సన్స్ తో సరిగా నిద్రపోలేక పోతున్నారా, మీరు నిద్ర లేమి సమస్యతో బాధ పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే. సాధారణంగా మనకు నిద్ర పట్టకుండా ఉండడానికి వేడి వేడి టీ తాగుతాం, కానీ ఇలా చేస్తే (sleep tips) మనకు చక్కటి నిద్ర పట్టడం ఖాయం.

ఇంకా చదవండి ...
ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం..  అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల (health problems)తో నేటి రోజులలో జనాలు బాధపడుతూ ఉన్నారు . మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర (sleep) లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది. కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం (sleeping)..  ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు ఎంతో మందిపై  ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడి పోతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో యువత (youngsters) పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి (Insomnia) . కొన్ని రకాల పద్ధతులు (sleep tips) పాటిస్తే హాయిగా పడుకోవచ్చు.

మనకు నిద్ర పట్టకుండా ఉండడానికి వేడి వేడి టీ తాగుతాం, కానీ ఈ టీ తాగితే మనకు చక్కటి నిద్ర పట్టడం ఖాయం. అదే అరటి పండు తో చేసే బనానా టీ (banana tea). ఈ టీ తాగడం వలన చక్కటి నిద్ర పడుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు.  బనానాలో సహజం గానే ఎన్నో మూలకాలు ఉండడం వలన అవి మీకు శక్తీ తో పాటు, అందులో వుండే అమైనో ఆమ్లాల వల్ల మీకు చక్కటి నిద్ర కూడా పడుతుంది .

ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు..

ఈ టీ (tea) తయారు చేయడానికి మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత రిలాక్స్ గా ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు. ఇప్పుడు ఈ టీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ టీ తయారు చేయడానికి మీకు ప్రత్యేక దినుసులు ఏమి అవసరం లేదు కేవలం అరటి పండు (banana), కాస్త నీళ్లు, దాల్చిన చెక్క ఉంటే సరిపోతుంది. ఒక బనానా ను తీసుకొని కొనలను ఇరువైపులా అంటే పైన కోన, కింద కొన కత్తిరించేయండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దానిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ముందుగా మనం కత్తిరించి పెట్టుకున్న బనానాను అందులో వేసి ఒక పది నిమిషాల పాటు బాగా మరగా పెట్టండి.

ఇప్పుడు బాగా మరిగించిన తర్వాత ఆ పాత్రను తీసుకొని దానిని వడకట్టి ఆ నీరు ను వేరు చేయండి. బనానా (banana) మామూలుగానే తీయగా ఉంటుంది కనుక మనం ప్రత్యేకంగా చక్కర, బెల్లం లాంటి వాటిని కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ మిశ్రమం ఉడికేటప్పుడే దాల్చిన చెక్క కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకున్నా దాని పొడి నైనా మరిగించిన నీటిలో కలుపు కోవచ్చు అది మీ ఇష్టం. ఇలా మంచి పద్దతులు (sleep tips) పాటిస్తే నిద్ర ప్రశాంతంగా పడుతుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Banana, Sleep tips, Tea

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు