Home /News /life-style /

DO YOU WANT BEAUTIFUL AND HEALTHY SKIN THEN REMEMBER THESE PRECAUTIONS AND FOLLOW THIS FACE PACKS PRV

Beauty tips for face: మీ చర్మం మృదువుగా, అందంగా ఉండాలా? అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఫేస్​ప్యాక్​ ట్రై చేయండి.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది తమ చర్మం (skin) జిడ్డు (oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఈ ఫేస్​ప్యాక్​తో మీ చర్మం అందంగా మారుతుంది. దాని తయారీ ఒకసారి తెలుసుకుందాం.

    సీజన్​ మారితే చర్మంలో మార్పులు వస్తుంటాయి. అయితే ఎప్పటికప్పుడు మన చర్మాన్ని రక్షించుకుంటే అందంగా కనిపిస్తాం. చాలామందికి చర్మం తరచుగా జిడ్డు, నీరసంగా మారుతుంది. ఇది క్రమంగా మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు తగ్గిపోతుంది. మొటిమలు (pimples) తయారవుతాయి. ఇక వేళకు తినకుండా ఒత్తిడికి లోనయ్యే వారికి నల్లటి వలయాలు (dark circles) కంటి చుట్టూ ఏర్పడతాయి. మనం తినే ఆహారం కూడా మన అందం (beauty)పై ప్రభావం చూపుతుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్​ ప్యాక్​లు వాడినా తమ చర్మం (skin) జిడ్డు (oily)గా ఉంటుందని బాధపడుతుంటారు.

    ప్రతి ఒక్కరు మచ్చలు లేని ముఖం కావాలనుకుంటునట్టే, ముఖం నునుపుగా (Smooth), ప్రకాశవంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ వున్నారు. అందులో భాగంగానే ముఖం నునుపుగా మారడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే మరికొంతమంది చర్మం నునుపు తగ్గిపోతుంది అని తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఫేస్​ప్యాక్​తో మీ చర్మం అందంగా మారుతుంది. దాని తయారీ ఒకసారి తెలుసుకుందాం..

    యాపిల్ గుజ్జు..

    అర కప్పు ద్రాక్ష పండ్ల గుజ్జుకు, ఒక టేబుల్ స్పూన్ యాపిల్ గుజ్జు, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక పావు కప్పు గుడ్డులోని తెల్ల సొనను కలపాలి. దీన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మతత్వానికి మంచిగా పని చేస్తుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు ఐస్ క్యూబ్ ని కూడా ముఖానికి రాయడం వల్ల ముఖం స్మూత్ (smooth)​గా మారుతుంది.

    ఇక గింజలు లేని టొమాటోలను కూడా ముఖానికి ఉపయోగించవచ్చు. ఈ పద్ధతులను పాటిస్తే ఎంతటి పొడి చర్మం అయిన తిరిగి తాజాదనాన్ని అందుకొని, నునుపుగా అందంగా తయారవుతుంది. లావెండర్ ఆయిల్ చాలా మంచిది. లావెండర్ ఆయిల్ సన్ బర్న్, రెడ్ నెస్ మొదలైన సమస్యలని తరిమి కొడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా బాడీ బటర్ ని ఉపయోగించేటప్పుడు అందులో లావెండర్ ఆయిల్ ఉన్న వాటిని ఉపయోగించండి. తద్వారా ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అందంగా ఉండొచ్చు. చర్మ సమస్యలు కూడా మీ దరిచేరవు.

    దీని వల్ల వల్ల మనకి చర్మం బాగుంటుంది. పొడి బారిపోదు (Without drying). చాలా మంది లావెండర్ ఆయిల్‌ని ఎన్నో వివిధ రకాల ఉపయోగిస్తూ ఉంటారు. లావెండర్ ఆయిల్ వల్ల చర్మానికి ఎంత గానో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కాబట్టి చర్మాన్ని అందంగా ఉంచడంలో సాయపడుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు