Home /News /life-style /

DO YOU SUFFERING FROM NECK PAIN REGULARLY THEN MUST REMEMBER THIS THINGS FOR SURE PRV

neck pain: మెడ నొప్పి తరుచుగా బాధిస్తోందా? అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోజంతా పనిచేసి ఇంటికి చేరుకున్నాక ఒంటినొప్పులు (body pains) మరో బాధను తెచ్చిపెడుతాయి. మెడనొప్పి. ఇంట్లో సరిగ్గా కూర్చునేందుకు వీలు లేకపోవడం… ఎక్కువగా సేపు సిస్టం చూడటం వలన ఈ సమస్య మరింతగా వేధిస్తుంది. అయితే కొన్ని రకాల ట్రిక్స్ ఫాలో అయితే ఈ సమస్యను నుంచి సులభంగా బయటపడోచ్చట

ఇంకా చదవండి ...
    రోజంతా పనిచేసి ఇంటికి చేరుకున్నాక ఒంటినొప్పులు (body pains) మరో బాధను తెచ్చిపెడుతాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా.. ఇంటి బాధ్యతలు నిల్చోనివ్వవు, కూర్చోనివ్వవు. మరోవైపు కరోనా తెచ్చిన సమస్యలు మనిషిని అతలాకుతలం చేసింది. సగటు జీవి ఆర్థికంగానూ బలహీన పడటంతో మళ్లీ గాడిలో పడటానికి నానా తంటాలు పడుతున్నారు. ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ అధికమవుతోంది. నొప్పులు (pains) తెచ్చిపెడుతోంది. అటువంటి పరిస్థితిలో చాలా సార్లు వారు కూడా పెయిన్ కిల్లర్స్ (pain killers) తీసుకుని తమ పనిని పూర్తి చేస్తుంటారు. కానీ, పదేపదే నొప్పి నివారణ మందులు తీసుకోవడం శరీరానికి ప్రయోజనకరం కాదట. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు ( health tips) పాటిస్తే సరి.

    మెడనొప్పి (neck pain). ఇంట్లో సరిగ్గా కూర్చునేందుకు వీలు లేకపోవడం… ఎక్కువగా సేపు సిస్టం చూడటం వలన ఈ సమస్య మరింతగా వేధిస్తుంది. ఇక సమస్యను తగ్గించుకోవడానికి చాలా మది ట్యాబ్లెట్స్ వేసుకోవడం, బాబ్స్ రాయడం, అయింట్ మెంట్స్ వాడడం చేస్తుంటారు. అయినా ఆ సమస్య నుంచి పరిష్కారం మాతర్ం లభించదు. దీంతో చేస్తున్న పనిపై శ్రద్ధ వహించలేకపోతుంటారు. అయితే కొన్ని రకాల టిప్స్​ (neck pain treatment) ఫాలో అయితే ఈ సమస్యను నుంచి సులభంగా బయటపడోచ్చట.  తెలుసుకుందామా.

    మనం కూర్చునే ప్రదేశం (sitting place), కూర్చునే విధానం సరిగ్గా ఉండకపోతే ఈ మెడ, భుజాల నొప్పి (neck and shoulder pain) మొదలవుతుంది. ఆరోగ్య నిపుణులు దీనికి మూడు మార్గాలు చెబుతున్నారు. పని మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. బెడ్‌పైకి ల్యాప్‌టాప్ తీసుకెళ్లకూడదు. ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే ఇలాంటి నొప్పులు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి.  కానీ కూర్చొనే ల్యాప్‌టాప్, సిస్టం లాంటి వాటిలో పని చేయాల్సి వస్తే మార్చుకోవడం మంచింది.

    మీ కీ బోర్డు (Keyboard) మీ మోచేతుల కంటే కిందకు ఉండేలా చేసుకోవాలి. మీరు కూర్చునే విధానంలో మీ మోచేతుల కంటే కీబోర్డు ఎత్తుగా ఉంటే మరీ మీ కుర్చీ హైట్ పెంచుకొని కూర్చోవాలి. లేదా కీ బోర్డ్ ఎత్తు (keyboard height) తగ్గించాలి. ఏం చేసైనా సరే మోచేతులే ఎత్తుగా ఉండాలి. లేదంటే భుజం నొప్పి (shoulder pain) భరించాల్సి వస్తుంది.

    రెగ్యులర్‌గా యోగా, ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తూ ఉండాలి. ఇవి కండరాల్లో కదలికలు పెంచి… రక్త ప్రసరణ బాగా అయ్యేలా చేసి… నొప్పుల నుంచి కాపాడతాయి. రోజూ కనీసం గంటైనా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉండాలంటున్నారు. ఇందుకోసం మెట్లు ఎక్కి దిగడం, గార్డెన్‌లో మొక్కల పని చెయ్యడం చేస్తుండాలి. ఇలా చేయడం వలన బాడీలో కొవ్వు కరిగిపోతుంది. పండ్లు, జ్యూస్, డ్రాఫ్రూట్స్, పప్పులు, గింజల వంటివి తినమని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తీసుకోవడం ఉత్తమం.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు