Home /News /life-style /

DO YOU SUFFERING FROM HEADACHE PROBLEMS REGULARLY THEN FOLLOW THIS TIPS AND PRECAUTIONS TO GET RID OF IT PRV

Headache remedies: తరుచుగా తలనొప్పి వస్తోందా? నొప్పి తట్టుకోలేక పోతున్నారా? అయితే ఇలా చేయండి

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

తలనొప్పికి చాలా కారణాలుంటాయి. కొద్దిమందికి ఈ సమస్య రెగ్యులర్​గా వస్తుంటుంది. కొన్ని పద్దతులు (Remedies) పాటిస్తే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

    కరోనా అందరి జీవితాల్లో కష్టాలే తెచ్చిపెట్టింది. పని ఒత్తిడి (Stress), సమస్యలు తలనొప్పి (headache)ని తీసుకొస్తాయి. అయితే అన్ని బాధల కంటే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా.. వస్తూ పోతున్నట్లుగా.. తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు (Sounds) వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం (food) ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి (headache) రావచ్చు. కొన్ని కుటుంబాలలో వంశపారపర్యంగా కూడా తలనొప్పి వస్తుంది. మరో వాదనలో తలలోని రక్తనాళాల్లో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడటం వలన వస్తున్నట్లు వాదన. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి (stress), టెన్షన్ (tension), నిద్రలేమి (sleeping problems), జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. కొన్ని పద్దతులు (Remedies) పాటిస్తే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

    ఆవు పాలు వేడి చేసి తాగితే తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పి తరచూ వేధిస్తుంటే భోజనంలో నెయ్యి వేసుకొని తింటే ఫలితం ఉంటుంది. తలకు కొబ్బరి నూనెతో 10, 15 నిమిషాల పాటు మర్దనా చేసుకున్నా తలనొప్పి తగ్గిపోతుంది. కుర్చీలో కూర్చొని పాదాలను వేడి నీళ్లు నింపిన బకెట్‌లో ఉంచాలి. నిద్రకు ముందు ఇలా కనీసం పావుగంట పాటు చెయ్యడం వలన దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ వల్ల వచ్చిన తలనొప్పి తగ్గిపోతుంది. కొత్తి మీర, జీలకర్ర, అల్లం కలిపి చేసిన కషాయం తాగితే తలనొప్పి తేలికగా తగ్గిపోతుంది. నీళ్లల్లో కొత్తిమీర, జీలకర్ర, అల్లం వేసి మరిగించి దాన్ని వడపోసి తాగాలి.

    ప్రశాంతమైన గదిలో..

    తలనొప్పి (headache) వచ్చింది అంటే ఎంత ప్రశాంత మనసు ఉన్న వారైనా సరే చీటికిమాటికి చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పని కుదురుగా చెయ్యలేరు. చిన్న శబ్దాన్ని భరించలేరు, వెలుతురును సరిగ్గా చూడలేకపడం.. కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇవీ తలనొప్పి లక్షణాలు. అయితే తలనొప్పి అధికంగా ఉంటే ఏదైనా గదిలో ఒంటరిగా కూర్చొంటే బెటర్​ అంట. అంతేకాదు ఆ గది కొంచెం చీకటి (dark room)గా ఉంటే ప్రశాంతత ఎక్కువుంటుందట. ఇక ఆహారంలో  ద్రవ పదార్థాలు (liquid items) ఎక్కువ తీసుకుంటే నొప్పి నుంచి కొంచెం అయినా విశ్రాంతి లభిస్తుందట.

    తలస్నానం చేసిన ప్రతి సారి తల (head)ను పూర్తిగా ఆరబెట్టుకుంటే తల నొప్పి రాదు, ఎండ ఎక్కువ ఉన్న సమయంలో నీళ్లను బాగా తీసుకోవాలి, అలాగే కొన్ని కొన్ని సార్లు మనకు సరిపడని సెంట్​ని వాడినా తలనొప్పికి దారి తీస్తుంది. అలాంటి సమయంలో సెంట్​ని ధరించకపోవడం మంచిది. తలనొప్పి ఉన్న సమయంలో ఫోన్ (phone), ల్యాప్ టాప్, కంప్యూటర్ వంటి వాటికీ దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి అన్ని పక్కన పెట్టిన .. శరీరానికి కావాల్సినంత ఆహారం, కావాల్సినంత నిద్ర తీసుకుంటే అసలు ఎలాంటి తలనొప్పి లేకుండా ఉత్సాహంగా ఉంటారు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు