హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: గ్యాస్​ సమస్య ఎక్కువగా ఉందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి.. సమస్యను దూరం చేయండి

Health tips: గ్యాస్​ సమస్య ఎక్కువగా ఉందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి.. సమస్యను దూరం చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి వారిలోనూ గ్యాస్ తయారవుతూనే ఉంటుంది. సాధారణ వ్యక్తుల్లో మామూలు పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 సార్లు గ్యాస్ విడుదల చేస్తూ ఉంటారు. కొంత మందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రస్థాయిలో కడుపునొప్పి (stomach pain)ని కలిగించే అవకాశం ఉంది. మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే కారణాల వల్ల అదనంగా గ్యాస్ తయారవటమే కాకుండా నొప్పిగా అనిపిస్తుంది. అయితే ఈ గ్యాస్​ సమస్య దూరం అవ్వాలంటే కొన్ని పద్దతులు లేదా చిట్కాలు (health Tips )పాటిస్తే సరిపోతుంది.

ఇంకా చదవండి ...

  పేగుల్లో తయారయ్యే గ్యాస్ (gas) ప్రమాదం కలిగించదు. కానీ, మహా ఇబ్బందిని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన మీటింగులో ఉన్నప్పుడు గాని, లిఫ్ట్‌లో ఇతరులతో పాటు నిలబడినప్పుడు గాని, తరగతి గదిలో కానీ, ఏకాంత సమయాల్లో గాని గ్యాస్ విడుదల చేయాల్సి వస్తే సంకట స్థితి అంతా ఇంతా కాదు. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించి ఉదరం (Stomach)లో నొప్పిని కలిగిస్తుంది. కాగా మలద్వారం నుంచి విడుదలయ్యే గ్యాస్‌ (gas)ని అపానం (ప్లాటస్) అనే పేరుతో వ్యవహరిస్తారు. ప్రతి వారిలోనూ గ్యాస్ తయారవుతూనే ఉంటుంది. సాధారణ వ్యక్తుల్లో మామూలు పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 సార్లు గ్యాస్ విడుదల చేస్తూ ఉంటారు. కొంత మందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రస్థాయిలో కడుపునొప్పి (stomach pain)ని కలిగించే అవకాశం ఉంది. మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే కారణాల వల్ల అదనంగా గ్యాస్ తయారవటమే కాకుండా నొప్పిగా అనిపిస్తుంది. అయితే ఈ గ్యాస్​ సమస్య దూరం అవ్వాలంటే కొన్ని పద్దతులు లేదా చిట్కాలు (health Tips )పాటిస్తే సరిపోతుంది.

  గ్యాస్​ ఎందుకు వస్తుంది..

  మాట్లాడేటప్పుడు గాని, ఆహారాలను మింగేటప్పుడు గాని గాలి (air)ని మింగటం; ఆందోళనగా ఉన్నప్పుడు గాని ఉధ్విగ్నంగా ఉన్నప్పుడు గాని గాలిని అసంకల్పితంగా మింగటం, ఆహారాన్ని నమలకుండా గబగబ మింగటం, చూయింగ్‌ గమ్ వంటి వాటిని అదే పనిగా నమలటం, స్ట్రాతో ద్రవహారాలను (liquid things) తాగటం, సోడా, బీర్ (beer), శీతల పానీయాలు (cool drinks) తదితర గాలి నిండిన కార్బనేటెడ్ పానీయాలను తీసుకోవటం. ఇతర వ్యాధులు సమాంతరంగా బాధిస్తుండటం. యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడటం పండ్లు (fruits), కాయగూరలు, గింజధాన్యం, బీన్స్, చిక్కుడు, బఠాని తదితర పదార్థాలూ అరగక పోవటం.

  ఏం చేస్తే తగ్గుతుంది..?

  గ్యాస్‌ని కలిగించే ఆహారాలను మానేయాలి. చిక్కుళ్లు, ఉల్లిపాయ (Onions), క్యాబేజి, క్యాలీఫ్లవర్, జల్లించని గోధుమ పిండి, కోడిగుడ్డు (eggs), శనగ పిండి వంటకాలు తదితరాలు మానేయాలి. వేపుడు పదార్థాలను, నూనె పదార్థాలను (oil food) మానేయాలి. కొవ్వు పదార్థాలు అమ్లాశయంలో వేగంగా కదలవు. దీనితో పొట్ట నిండినట్లు అనిపించి ఉబ్బరిస్తుంది. పీచు పదార్థాలను తగ్గించాలి. పీచు పదార్థాలను ఆహారంలో నెమ్మదిగా, అల్ప మోతాదులో చేర్చుతూ క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.

  ఇది కూడా చదవండి: చర్మం కాలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయకూడదు.. తెలుసా?

  పీచుపదార్థాలను తీసుకునే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలి. పాలను మానేయాలి. లేదా కనీసం బాగా తగ్గించాలి. పాలకు బదులు అవసరమనుకుంటే పెరుగు వాడాలి. లేదా పాలను వాడటం తప్పదనుకుంటే పాలను అన్నం వంటి ఇతర పదార్థాలతో కలిపి వాడాలి. పుదీనా పచ్చడి గాని, లేదా వేడి వేడి పుదీనా కషాయం గాని తీసుకోవాలి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Food, Gas, Health care, Health Tips

  ఉత్తమ కథలు