హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Cold and cough remedies: దగ్గు, జలుబు తరుచుగా వస్తుంటే మాత్రం.. ఈ చిట్కాలతో రెండింటికీ చెక్​ పెట్టండి

Cold and cough remedies: దగ్గు, జలుబు తరుచుగా వస్తుంటే మాత్రం.. ఈ చిట్కాలతో రెండింటికీ చెక్​ పెట్టండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

దగ్గు, జలుబు అనేవి.. మన బాడీలో చాలా రుగ్మతలకు అవకాశం కల్పిస్తాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా వన్ బై వన్ అన్నీ వచ్చేలా చేస్తాయి. కాబట్టి... దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి.

దగ్గు, జలుబు లేకుండా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీలవుతాం. అదే గొంతులో తేడాగా ఉన్నా.. ముక్కులో గడబిడ ఉన్నా.. క్రమంగా మనం నీరసించిపోతాం. ఎందుకంటే ఈ దగ్గు, జలుబు అనేవి.. మన బాడీలో చాలా రుగ్మతలకు అవకాశం కల్పిస్తాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా వన్ బై వన్ అన్నీ వచ్చేలా చేస్తాయి. కాబట్టి... దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. వేడి చేసే ఆహారం, స్పైసీ ఫుడ్ తగ్గించెయ్యాలి. ఇవన్నీ చేస్తూనే చాలా మంది టాబ్లెట్లు వేసేసుకుంటారు. అది ప్రమాదకరం. ఎందుకంటే, ప్రతీ చిన్న అనారోగ్యానికీ టాబ్లెట్లు వేసేసుకుంటే... మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.

ఏదైనా జబ్బు రాగానే మంచి బ్యాక్టీరియా... ఆ జబ్బుకి కారణమయ్యే సూక్ష్మక్రిములను తరిమెయ్యడం మానేస్తాయి. టాబ్లెట్ వేసుకుంటారుగా మనకెందుకులే అని సైలెంటవుతాయి. అందువల్ల మంచి బ్యాక్టీరియాతోనే పని కానివ్వాలి. అందుకోసం మనం వీలైనంతవరకూ శరీరానికి మందులు అలవాటు చెయ్యకూడదు. అదే సమయంలో మనం  అల్లంతో జలుబుకి తొందరగా చెక్ పెట్టొచ్చంట. అంతేకాదు అల్లంతో చాలా ఉపయోగాలు(benefits) కూడా ఉన్నాయంట. ఈ అల్లం యాంటి ఆక్సిడెంట్​గా పనిచేస్తుందట. శరీరంలో రోగ నిరోధక శక్తి (immunity power)ని పెంచుతుందట. వ్యాధులపై పోరాటానికి తగిన శక్తి అందిస్తుందట. ఆ వివరాలు తెలుసుకుందాం..

అల్లం (ginger) మనం కూరలకు(curries) ఎక్కువగా వాడుతుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక మాంసాహార వంట‌కాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవ‌లం రుచికే(taste) కాదు. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను(Unhealth issues) న‌యం చేయ‌డంలోనూ అల్లం(ginger) బాగా ఉప‌యోగ‌ప‌డుతుందట.

అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే ద‌గ్గు(cough), జ‌లుబు(cold), జ్వ‌రం(fever) త‌గ్గుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.రక్త శుద్ధికి అల్లం తోడ్పడుతుంది. ర‌క్త‌ నాళాలలో ర‌క్తం గడ్డకట్టనీయకుండా అల్లం సహాయపడుతుందట.  అల్లంలోని గుణాల వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అందుకే జలుబు, వైరస్ (Flu, virus) బారిన పడిన వారికి త్వరగా కోలుకోవడానికి అల్లం సహాయపడుతుంది.

పుక్కిలింతల చిట్కా : నీటిని నోటిలో పోసుకొని... ఓ రెండు నిమిషాలు పుక్కిలించి... బయట పారేయాలి. ఇలా ఒకట్రెండుసార్లు చేస్తే... గొంతులో రిలీఫ్ లభిస్తుంది. ఇలా రోజుకు రెండుసార్లైనా చెయ్యాలి. గోరువెచ్చటి నీటిలో... ఉప్పు లేదా పసుపు వేసుకొని... పుక్కిలిస్తే... గొంతులో మంట, గరగర వంటివి తాత్కాలికంగా తగ్గుతాయి.

First published:

Tags: Cold remedies, Health Tips

ఉత్తమ కథలు