DO YOU SUFFERING FORM BODY PAINS REGULARLY THEN FOLLOW THIS HOME REMEDIED TO GET RID OF THAT PAINS EASILY PRV
Body pains: బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటున్నాయా? అయితే నొప్పులు తగ్గడానికి ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే తప్పక ఫలితం ఉంటుంది..
ప్రతీకాత్మక చిత్రం
పదేపదే నొప్పి నివారణ మందులు తీసుకోవడం శరీరానికి ప్రయోజనకరం కాదట. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు(tips) పాటిస్తే సరి. హాయిగా ఇంటిలోని వైద్యం చేసుకోవచ్చు
ఉరుకుల పరుగుల జీవితంలో అలసట, ఆందోళన సర్వసాధారణమే. రోజంతా పనిచేసి ఇంటికి చేరుకున్నాక ఒంటినొప్పులు (body pains) మరో బాధను తెచ్చిపెడుతాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా.. ఇంటి బాధ్యతలు నిల్చోనివ్వవు, కూర్చోనివ్వవు. మరోవైపు కరోనా తెచ్చిన సమస్యలు మనిషిని అతలాకుతలం చేసింది. సగటు జీవి ఆర్థికంగానూ బలహీన పడటంతో మళ్లీ గాడిలో పడటానికి (health acre) నానా తంటాలు పడుతున్నారు. ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ అధికమవుతోంది. నొప్పులు ( body pains) తెచ్చిపెడుతోంది. అటువంటి పరిస్థితిలో చాలా సార్లు వారు కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకుని తమ పనిని పూర్తి చేస్తుంటారు. కానీ, పదేపదే నొప్పి నివారణ మందులు తీసుకోవడం శరీరానికి ప్రయోజనకరం కాదట. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు (tips) పాటిస్తే సరి. హాయిగా ఇంటిలోని వైద్యం చేసుకోవచ్చు. చిటికెలో నొప్పులు (pains) తగ్గించుకోవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం..
అలసటను తొలగించడానికి పసుపు పాలు (Turmeric milk) చాలా ఉపయోగపడుతాయి. రాత్రి పడుకునే ముందు, ఒక గ్లాసు పాలను(milk) వేడి చేయాలి. అందులో ఒక చెంచా పసుపు కలిపి తాగండి (drink). దీని వలన మీరు ఒళ్ళు నొప్పుల నుంచి చాలా ఉపశమనం పొందుతారు. అల్లం వినియోగం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర నొప్పి, వాపు మొదలైన వాటిని కూడా తగ్గిస్తుంది. మీరు ఒక అల్లం ముక్కను నీటిలో మరిగించి ఫిల్టర్ చేసి తాగితే ఉపశమనాన్ని ఇస్తుంది.
ఒకవేళ మీ శరీరంలో వాపు ఉన్నట్లయితే ఆవ నూనె (oil)ను వాడాలి. మీరు ఒక కప్పు ఆవనూనెలో నాలుగు లవంగాలు వెల్లుల్లి వేసి బాగా వేడి చేయాలి. దీని తరువాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడు, మీరు దానిని నొప్పి ఎక్కువ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. సల్ఫర్, మెగ్నీషియం ఉప్పులో తగినంత పరిమాణంలో ఉంటాయి. అందువల్ల, మీరు ఉప్పును వేడి చేసి, ఒక వస్త్రంలో ఉంచి, నొప్పి వస్తున్న ప్రదేశంలో అప్లై చేయండి. ఇది మీకు శరీర నొప్పి నుంచి వెంటనే ఉపశమనం ఇస్తుంది.
బెల్లం తినండి..
బెల్లం తీసుకోవడం మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రాత్రి భోజనం (dinner) తర్వాత మీరు ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోని తినండి. ఇది మీకు అలసట నుండి ఉపశమనం ఇస్తుంది మిమ్మల్ని మీరు రిఫ్రెష్‌గా భావిస్తారు. శరీర నొప్పిని వదిలించుకోవడానికి మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా శరీరం వాపును తగ్గించవచ్చు. ఇది నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, రుచికి అనుగుణంగా తేనె కలిపిన తర్వాత తాగండి. ఇది నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.