Sleep tips: మీరు రోజూ ఏడు గంటలపాటు నిద్రపోతారా? అయినా నిద్ర సరిపోవడం లేదా? అయితే ఇది తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

మన జీవితానికి నిద్ర కూడా ముఖ్యమే. సరైన నిద్ర (Good sleep) లేకపొతే మర్నాడు రోజంతా ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి మనిషికీ సరాసరి ఏడు గంటల నిద్ర (7 hours sleep) తప్పనిసరి అని చెబుతున్నారు. ఇది ఒక గంట అటో, ఇటో అయినా పెద్ద నష్టం లేదు. మీరు సరిపోయినంత నిద్రపోతున్నారా లేదా అని తెలుసుకునేందుకు ఒక్కటే మార్గం (one way).

  • Share this:
    ఉరుకుల పరుగుల జీవితం కావడంతో సగటు మనిషి నిద్రించడమే మానేశాడు. రోజుకు ఐదు లేదా ఆరుగంటలు నిద్రపోతున్నాడు. మరికొందరైతే లేట్​నైట్​ పని, పార్టీలు, పబ్​లు అంటూ ఆలస్యంగా పడుకుంటున్నారు. ఆలస్యంగా లేస్తున్నారు. అయితే వీరిలో కొద్దికొద్దిగా అనారోగ్య సమస్యలూ (Unhealthy problems) వస్తున్నాయట. మరి నిజంగానే మనకు నిద్ర (sleep) సరిపోతుందా?  అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి.. ఎంత సమయం నిద్ర (sleep) పోతున్నారు అన్న విషయంతో పాటూ, ఎప్పట్నుంచి ఎప్పటి వరకూ నిద్రపోతున్నారు అనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

    ఇలా కనుక్కోండి..

    మన జీవితానికి నిద్ర కూడా ముఖ్యమే. సరైన నిద్ర (Good sleep) లేకపొతే మర్నాడు రోజంతా ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి మనిషికీ సరాసరి ఏడు గంటల నిద్ర (7 hours sleep) తప్పనిసరి అని చెబుతున్నారు. ఇది ఒక గంట అటో, ఇటో అయినా పెద్ద నష్టం లేదు. మీరు సరిపోయినంత నిద్రపోతున్నారా లేదా అని తెలుసుకునేందుకు ఒక్కటే మార్గం (one way). మర్నాడు రోజంతా మీకు నిద్ర రాకూడదు, నిద్ర పోవాలనిపించకూడదు, కునుకు తియ్యాలని కూడా అనిపించకపోతే మీకు నిద్ర సరిపోతున్నట్టు.

    7 గంటలు నిద్ర పోయినా..

    ఒక వ్యక్తి ఏడు గంటలు నిద్రపోతారనుకుందాం. రాత్రి పదింటికి నిద్రపోయి తెల్లవారి ఐదు గంటలకి లేవడం ఒక లెక్క. రాత్రి పన్నెండింటికి నిద్రపోయి పొద్దున్న ఏడు గంటలకి లేవడం ఇంకో లెక్క. అర్ధరాత్రి రెండింటికి పడుకుని పొద్దున్న తొమ్మిదింటికి లేవడం, తెల్లవారుజామున నాలుగింటికి పడుకుని పొద్దున్న పదకొండింటికి లేవడం ఇంకో లెక్క. అన్ని సందర్భాలలోనూ నిద్రపోయిన సమయం ఏడుగంటలే.

    కానీ, రోజులో ఏ సమయంలో (timing) నిద్ర పోయారనేది కూడా చాలా ముఖ్యమైన విషయం (Important issue). సూర్యోదయానికీ, మనం నిద్రలేచిన సమయానికీ దూరం పెరుగుతున్న కొద్దీ అనారోగ్యానికి (unhealthy) మనకి దూరం తగ్గుతుందన్నది అక్షరసత్యం. మిగిలిన అనారోగ్యాలతో పాటూ ఇప్పుడు పరిశోధకులు మరో విషయం కూడా కనుక్కున్నారు. టీనేజ్ పిల్లలు రాత్రి లేట్‌గా పడుకుని పొద్దున్న లేట్‌ (late)గా లేస్తుంటే వారు ఎలర్జీ (Alergy)ల బారిన ఆస్త్మా (Asthma) బారినపడే అవకాశం చాలా ఎక్కువగా ఉందని తెలిసింది.

    ఈ పరిశోధనలో టీనేజ్ పిల్లలు పాల్గొన్నారు. వారిని ఏ టైమ్‌ (time)కి పడుకుంటారు. ఏ టైమ్‌కి లేస్తారు. ఏ టైమ్‌లో చురుగ్గా ఉంటారు. రోజులో ఏ టైమ్‌లో అలసటగా అనిపిస్తుంది, ఏ టైమ్‌లో చదువుకుంటే బాగా అర్ధమవుతుంది లాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ ప్రశ్నలతో పాటు వారు గురక పెడతారా, ఆస్థ్మా ఉందా, తుమ్ములు (cough) , జలుబు (cold) ఎక్కువగా ఉంటాయా అని కూడా అడిగారు.

    ఈ వివరాలన్నీ పోల్చి చూస్తే లేట్‌గా పడుకుని లేట్‌గా లేచే టీనేజర్లలో ఆస్థ్మా, అలెర్జీలు వచ్చే అవకాశం మిగిలిన వారి కన్నా మూడు రెట్లు అధికంగా ఉందని తెలిసింది. తెల్లవారి లేట్‌గా లేచినప్పుడు మన బాడీ క్లాక్ కన్‌ఫ్యూజ్ అవుతుంది. దీనివల్లే ఇలాంటివి వచ్చే అవకాశం.
    Published by:Prabhakar Vaddi
    First published: