Curry leaves: కూరలో కరివేపాకును తీసేస్తున్నారా.. వాటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

Curry leaves: కూరలో కరివేపాకులా తీసిపారేశారు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కరివేపాకే కదా.. అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే డిఫరెంట్‌గా ఉంటుంది. కరివేపాకు వల్ల రుచే కాదు ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి.

 • Share this:
  కూరలో(Curry) కరివేపాకులా తీసిపారేశారు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కరివేపాకే కదా.. అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా(Upma), రసం దేనిలోనైనా కరివేపాకు(Curry Leaves) వేస్తే వచ్చే రుచే డిఫరెంట్‌గా ఉంటుంది. కరివేపాకు వల్ల రుచే కాదు ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. మన రోజువారీ దినచర్యల్లో చిన్నపాటి మార్పులు చేసుకుంటే... అవి ఒక్కోసారి అద్భుత ప్రయోజనాల్ని కలిగించగలవు. ఉదయాన్నే కొన్ని కరివేపాకుల్ని తింటే... ఎంతో ఆరోగ్యం. కరివేపాకులు మన వంటిళ్లలో ఎప్పుడూ ఉండేవే. కూరల్లో కరివేపాకులు వేస్తే... ప్రత్యేక రుచి, సువాసన వస్తాయి.

  Daily Walking Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడకలో ఇలాంటి మార్పులు చేయండి.. వివరాలు తెలుసుకోండి..


  కొంత మంది తినకుండా పక్కన పెట్టేసే ఈ కరివేపాకుల ప్రయోజనాలు తెలుసుకుంటే... ఇక వీటిని వదలం. ఇవి మన చర్మం, జుట్టు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడగలవు. అందుకే కూరల్లో వేసుకోవడంతోపాటూ... కొన్ని కరివేపాకుల్ని ఉదయాన్నే ఖాళీ పొట్టతో తింటే మేలు. మొదట్లే కాస్త చేదుగా అనిపించినా... రాన్రానూ అలవాటైపోతుంది. ఇలా చెయ్యడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది. ఎలాగో తెలుసుకుందాం.

  జుట్టు రాలిపోతున్న వారు ఇలా చెయ్యాలి. ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఓ గ్లాస్ మంచినీరు తాగాలి. కొన్ని నిమిషాల తర్వాత.. ఓ నాలుగైదు కరివేపాకుల్ని నోట్లో వేసుకొని... కరకరా నమిలేయాలి. ఆ తర్వాత అరగంటపాటూ ఏమీ తినకుండా ఉండాలి. కరివేపాకుల్లో విటమిన్ C, ఫాస్పరస్, ఐరన్ (ఇనుము), కాల్షియం, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. కూరల్లో కూడా కరివేపాకుల్ని ఎక్కువగా వాడితే.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కరివేపాకుల్ని తింటే.. పొట్టలో జీర్ణక్రియ మెరుగవుతుంది.

  పురుషుల కంటే మహిళల్లోనే అవి ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏమిటి..? తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..


  ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు వాటిని నమలడం వల్ల.. అవి జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్‌ని క్రమబద్ధం చేస్తాయి. మూత్రనాళం బాగా పనిచేసేలా చేస్తాయి. మలబద్ధకం సమస్య తీరుతుంది. కొంత మందికి ఉదయం లేవగానే బద్ధకంగా, వికారంగా ఉంటుంది. ఆ సమస్య కరివేపాకులతో తీరిపోతుంది. జీర్ణక్రియావ్యవస్థ సక్రమంగా పనిచేస్తుండటంతో... వికారం, వాంతులు అయ్యే పరిస్థితి నుంచీ బయటపడవచ్చు. బరువు తగ్గాలంటే కరివేపాకుల్ని తినాలి.

  Womens: కరోనా వ్యాక్సిన్​ వల్ల మహిళల్లో పీరియడ్స్‌పై ప్రభావం పడుతుందా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..


  ఇవి శరీరంలో చెడు వ్యర్థాల్ని బయటకు తరిమేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ చాప చుట్టుకొని వెళ్లిపోతుంది. ఫలితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ సక్రమంగా అవుతాయి. కరివేపాకులకూ కంటిచూపుకీ సంబంధం ఉంటుంది. ఎంత ఎక్కువగా కరివేపాకుల్ని తింటే... కంటి చూపు అంత ఎక్కువగా మెరుగవుతుంది. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే పిల్లల క్యారేజీ కూరల్లో తప్పనిసరిగా కరివేపాకు ఉండేలా చూసుకోండి. అధిక రక్తపోటులో కనిపించే ఉపద్రవాలు కరివేపాకు పళ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు కూడా తగ్గుతాయి.
  Published by:Veera Babu
  First published: