Home /News /life-style /

DO YOU PEOPLE WITH LOW IMMUNITY KNOW HOW TO TAKE AN EGG MUST KNOW PRV

 Egg for less immunity people: రోగ నిరోధక శక్తి తక్కువున్న వాళ్లు గుడ్డును ఏ రూపంలో తీసుకోవాలో తెలుసా?

గుడ్డు

గుడ్డు

కొందరు ఉడకబెట్టి గుడ్డుని తింటే.. మరికొందరు పచ్చిగా తింటారు. అవును కోడిగుడ్డుని పచ్చిగా కొట్టేసుకొని త్రాగేస్తూ ఉంటారు. అయితే ఇలా పచ్చిగా కోడిగుడ్డు తీసుకోవడం మంచిదా చెడ్డదా ఏమైనా ఆరోగ్య సమస్యలు(health problems) వస్తాయా అనే సందేహం చాలామందిలో ఉంది

ఇంకా చదవండి ...
    అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు(Egg). అందుకే గుడ్డును ఆరోగ్యానికి మంచిందని పేర్కొంటుంటారు నిపుణులు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటిన్లు(proteins), శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉన్నాయి.. అందుకే గుడ్డు శరీరానికి(body) మల్టీ విటమిన్‌(vitamin)గా రోగ నిరోధక శక్తి(Immunity system)ని పెంచడానికి దోహదపడుతుంది. అయితే కొంతమంది గుడ్డుని ఉడక బెట్టుకుని(boiled) తింటే.. మరికొందరు ఆమ్లెట్(omelet), కూరలు(curries) వంటివి చేసుకుని తింటారు. కొంతమంది గుడ్డులోని తెల్లని సొనని తిని.. పచ్చని సొన పడేస్తుంటారు. ఇంకొందరు ఉడకబెట్టి గుడ్డు(steamed egg)ని తింటే.. మరికొందరు పచ్చిగా(raw) తింటారు. అవును కొంటామని కోడిగుడ్డుని పచ్చిగా కొట్టేసుకొని(broken) త్రాగేస్తూ ఉంటారు. అయితే ఇలా పచ్చిగా కోడిగుడ్డు తీసుకోవడం మంచిదా చెడ్డదా ఏమైనా ఆరోగ్య సమస్యలు(health problems) వస్తాయా అనే సందేహం చాలామందిలో ఉంది. అయితే ఓ సారి దాని గురించి తెలుసుకుందాం..

    ఆ బ్యాక్టీరియా..

    కోడి గుడ్డుని పచ్చి(raw)గా  పగల కొట్టుకుని త్రాగవచ్చు. అయితే అలా చేసే వాళ్లు ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి(remember). కోడిగుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా(bacteria) ఉంటుంది. మామాలుగా అయితే కోడిగుడ్డుని ఉడికిస్తే ఆ బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ, చాలా మంది మాత్రం పచ్చిగానే పగలకొట్టి తాగుతున్నారు. పచ్చిగా త్రాగితే ఆ బ్యాక్టీరియా శరీరంలోకి(into body) చేరుతుంది. కోడిగుడ్డుతో ఈ బ్యాక్టీరియా స్వల్ప మోతాదులో ఉంటుంది. కనుక ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఎటువంటి హాని కలగదు. అయితే రోగ నిరోధక శక్తి (less Immunity power people)తక్కువగా ఉన్నవారిలో ఇన్‌ఫెక్షన్లు, జ్వరం(fever) వస్తాయి. పచ్చి గుడ్డు(raw egg)లోని తెల్లటి భాగంలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

    ఇది కూడా చదవండి: మీ చిరుతిండిలోనూ రోగనిరోధక శక్తి ఉండాలంటే.. వీటిని తినండి

    ఆరోగ్యంగా ఉన్నవాళ్లకే..

    అంతేకాదు ఆరోగ్యంగా లేని వ్యక్తులు కూడా పచ్చి కోడి గుడ్డుని రోజూ తీసుకోకూడదంటున్నారు నిపుణులు(experts). ఏమైనా వ్యాధులున్న వారు పచ్చి కోడి గుడ్డుని రెగ్యులర్ గా తీసుకుంటే బయోటిన్ అనే పోషక లోపం ఏర్పడుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయోటిన్ లోపాన్ని విటమిన్ బి 7 అని కూడా అంటారు. ఈ లోపం ఏర్పడితే.. చర్మంపై దురదలు, వెంట్రుకలు రాలిపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. కొంతమందికి పచ్చి గుడ్డులోని తెల్లసొన అలర్జీని కలిగించే అవకాశం ఉంది. శరీరంలో దద్దుర్లు, వాపు, చర్మం ఎర్రబడటం, తిమ్మిరి, విరేచనాలు, దురద, కళ్ళు నీరు కారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అంతేకాదు గుడ్డులోని తెల్లసొన కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. బీపీలో హెచ్చితగ్గులు ఏర్పడతాయి. ఒకొక్కసారి అపస్మారక స్థితికి చేరుకున్నట్లు కూడా అనిపిస్తుంది. కనుక కోడిగుడ్డు పచ్చిగా తాగాలనుకునే వారు తమ శరీర తత్వానికి సరిపడుతుందా లేదా అని చూసుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Egg, Health Tips, Immunity

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు