Weight loss: రోజువారి అల్పాహారంలో ఇడ్లీ, సాంబార్​ తింటే బరువు తగ్గుతారా ? ఎలా సాధ్యమవుతుంది?

ప్రతీకాత్మ క చిత్రం

బరువు తగ్గడానికి(weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం(food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు(tips) పాటిస్తే బరువు(weight) తగ్గుతారు

  • Share this:
    పని ఒత్తిడి, సమస్యలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేళకు తినడం (eat) లేదు. సుఖంగా నిద్ర పోవడం లేదు. దీంతో కొత్తకొత్త రోగాలు కొనితెచ్చుకుంటున్నాడు. వాటిని నయం చేయడానికి సంపాదించినదంతా మళ్లీ ఆసుపత్రులకే పెడుతున్నాడు. ముఖ్యంగా అధిక బరువు (heavy weight) తగ్గించుకోవాడానికి ఆపరేషన్లని, ఇంకా చాలా చాల పద్దతులు ఫాలో అవుతున్నారు జనం.  చాలామంది ఎంత ప్రయత్నించినా బరువు(weight) తగ్గరు. కొందరు డైట్​లు, జిమ్(gym)​ల వంటివి ప్రయత్నించి ఉంటారు. అలాంటి వారిలో ఫలితాలు కనిపించినా.. సమయం లేక మధ్యలో వదిలేసిన వారి పరిస్థితి వేరు. బరువు తగ్గడానికి(weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం(food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు(tips) పాటిస్తే బరువు(weight) తగ్గుతారు.

    మన బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ముఖ్యమైన కారణం మన డైట్. మనం వ్యాయామం చేసినా.. దాని పాత్ర బరువును తగ్గించడంలో కేవలం 20 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలిన 80 శాతం మన డైట్ మీదే ఆధారపడుతుంది. అందుకే బరువు తగ్గడానికి ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి స్వస్తి చెప్పి.. వేరే ఆహార పదార్థాలను మన డైట్‌లో భాగం చేసుకోవాలి.

    ఒక వారం పాటు రోజూ ఉదయం కేవలం ఇడ్లీ (idly), సాంబార్‌ (sambar)ని మాత్రమే బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకుంటే.. మీ జీర్ణ శక్తి చాలా బాగా పెరుగుతుంది. సాంబార్‌లో పప్పు ప్రొటీన్‌ని, పీచు పదార్థాన్ని అందిస్తుంది. కాబట్టి ఇది చాలా సేపటి వరకూ ఆకలి లేకుండా చేస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్‌ను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ పద్దతిని కొద్ది రోజులు అనుసరించండి. తద్వారా సులువుగా బరువు తగ్గే వీలుంటుంది.

    ఇది కూడా చదవండి: ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్​ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?

    రాగుల్లో పీచుపదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది. కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు.. ఇది చాలా సమయం వరకూ.. మన పొట్టను నిండుగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం (food) తీసుకోవడం వల్ల.. గుండె సంబంధిత సమస్యలు కూడా రావు. అధిక బరువు, డయాబెటిస్ వంటివి కూడా తగ్గుతాయి

    రోజుకో యాపిల్ (apple) తింటే రోగాలన్నీ దూరమైపోతాయని.. మన పెద్దలు చెప్పడం తెలిసిందే. ఆపిల్ కేవలం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం మాత్రమే కాదు.. బరువు తగ్గేందుకు కూడా  తోడ్పడుతుంది. ఎందుకంటే ఇందులో నీటి శాతం ఎక్కువ. అందుకే దీన్ని తినడం వల్ల.. కడుపు తొందరగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత ఆహారం తక్కువగా తీసుకుంటాం. అంతేకాదు.. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి:

    గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?
    Published by:Prabhakar Vaddi
    First published: