Home /News /life-style /

DO YOU KNOW YOUR AYURVEDIC BODY TYPE KNOW THE CHARACTERISTICS TO LEAD A HEALTHY LIFE UMG GH 2

Bone Health: రుతుక్రమం ఆగిపోవడానికి ఎముకల ఆరోగ్యానికి సంబంధం ఏంటి..? మహిళలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!

రుతుక్రమం ఆగిపోవడానికి ఎముకల ఆరోగ్యానికి సంబంధం ఏంటి..?

రుతుక్రమం ఆగిపోవడానికి ఎముకల ఆరోగ్యానికి సంబంధం ఏంటి..?

మెనోపాజ్‌లో ఉన్న స్త్రీలకు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. రుతుక్రమం ఆగిపోయిన తర్వాత వచ్చే ఈ బోలు ఎముకల వ్యాధిని పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ (postmenopausal osteoporosis) అంటారు. దీనికి ప్రమాద కారకాలు కొన్ని ఉన్నాయి.

ఇంకా చదవండి ...
మెనోపాజ్ అంటే స్త్రీలలో రుతుక్రమం ఆగిపోవడం. వయసు విషయంలో మెనోపాజ్ దశ అందరు మహిళల్లో ఒకేలా ఉండదు. నలభై ఏళ్లకే ఆగిపోతే "ప్రిమెచ్యూర్ మెనోపాజ్" అంటారు. మెనోపాజ్‌ని గుర్తించే లక్షణాలు కొన్ని ఉంటాయి. వీటిల్లో కొన్ని లక్షణాలు ఒక్కసారిగా, మరికొన్ని ఆలస్యంగా మొదలవుతాయి. ఉన్నట్టుండి మొదలయ్యే లక్షణాల్లో.. శరీరమంతా లేదా కొన్ని భాగాల్లో అంటే తల, మెడ, ఛాతీ దగ్గర చర్మం అంతా కందిపోయినట్టు ఎర్రగా తయారవుతుంది. ఈ భాగాల్లో చాలా వేడిగా కూడా ఉంటుంది. చెమటలు కారిపోతూ ఉంటాయి. వీటిని 'హాట్ ఫ్లషెస్' అంటారు. నిద్రలోనూ చెమటలు పట్టి, పక్కంతా తడిసిపోయి ఉన్నట్టుండి మెలకువ వచ్చేస్తుంది. ఇలా ఎక్కువసార్లు జరగడం వల్ల దాని ప్రభావం దినచర్యపై పడి చిరాకు, కోపం, అసహనం లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. ఓ రకంగా చూస్తే ఇది మొదటి లక్షణం. మరికొంతమంది స్త్రీలు మెనోపాజ్ దశలో పెద్దగా ఇబ్బంది పడరు.

* శారీరక మార్పులు, ఎముకలు పెళుసుబారటం
మెనోపాజ్ దశకు చేరుకున్న వారి శరీరంలో చాలా మార్పులు వస్తాయి. సులభంగా బరువు పెరగడం, ఎముక లేదా గుండె ఆరోగ్యం, శరీర ఆకృతి వంటివి మారవచ్చు. పెరిమెనోపాజ్ దశలో అండాలు పూర్తయిపోయి విడుదల కాకపోవడం వల్ల మొదట ప్రొజెస్టిరాన్ హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది, ఆ తర్వాత నెమ్మదిగా ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది. నిజానికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎముకలకు బలాన్నిస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం, మెనోపాజ్ వల్ల ఏర్పడిన ఇతర కారణాల వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశముంటుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. ఎముకల లోపలి భాగంలో రంధ్రాలు పెద్దగా అవుతాయి. వాటి సంఖ్య కూడా పెరుగుతుంది. ఎముక అంతర్గత నిర్మాణం దెబ్బతిని, ఎముకలు పెళుసుగా మారతాయి.

ఇదీ చదవండి: రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!


* ఆస్టియోపొరాసిస్ ముప్పు
మెనోపాజ్‌లో ఉన్న స్త్రీలకు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. రుతుక్రమం ఆగిపోయిన తర్వాత వచ్చే ఈ బోలు ఎముకల వ్యాధిని పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ (postmenopausal osteoporosis) అంటారు. దీనికి ప్రమాద కారకాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

వయసు
30 ఏళ్ల తర్వాత ఎముకల సృష్టి కంటే ఎముక క్షీణత వేగంగా జరుగుతుంది. ఇది ఎముక ద్రవ్యరాశిని (బోన్ డెన్సిటీ) క్రమంగా కోల్పోయేలా చేస్తుంది.

జెనిటిక్స్
కుటుంబంలో ఎవరికైనా ఆస్టియోపోరోసిస్ ఉంటే, ఇది వంశపారం పర్యంగా వచ్చే అవకాశం ఉంది.



పొగ తాగడం
స్మోకింగ్ బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మెనోపాజ్ ప్రారంభాన్ని వేగవంతం చేస్తుంది. అంటే వ్యక్తుల ఎముకలను ఈస్ట్రోజెన్ రక్షించడానికి తక్కువ సమయం ఉంటుంది.

* రాకుండా ఉండాలంటే...
వ్యాయామం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా కండరాలు బలహీనపడకుండా ఉంటాయి. అలాగే ఎముకలకు కాల్షియం చేరేలా చేయడంలోనూ వ్యాయామం పాత్ర చాలా కీలకం. రోజూ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఎముకల్లోకి క్యాల్షియం చేరుతుంది. మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలి.
Published by:Mahesh
First published:

Tags: Bones, Health care, Health issues, WOMAN

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు