హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Body Types: మీ బాడీ టైప్ ఏంటో మీకు తెలుసా..? ఆయుర్వేదం ఏం చెబుతుందంటే.. వెరీ ఇంట్రెస్టింగ్ అస్సలు మిస్సవ్వొద్దు..!

Body Types: మీ బాడీ టైప్ ఏంటో మీకు తెలుసా..? ఆయుర్వేదం ఏం చెబుతుందంటే.. వెరీ ఇంట్రెస్టింగ్ అస్సలు మిస్సవ్వొద్దు..!

మీ బాడీ టైప్ ఏంటో మీకు తెలుసా..?

మీ బాడీ టైప్ ఏంటో మీకు తెలుసా..?

ఆయుర్వేదం (Ayurveda) ప్రకారం, వాత (Vata), పిత్త (Pitta), కఫా (Kapha) అనే మూడు దోషాలు లేదా మూడు శరీర రకాలు (Body Types) ఉంటాయి. ఈ శరీర రకాలపై ఆధారపడి మనుషుల ఆరోగ్యం ఉంటుందని ఆయుర్వేదం తెలుపుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో చాలామంది తమ శరీర రకం ఎలాంటిదో తెలియక తగిన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే ఆయుర్వేదం (Ayurveda) ప్రకారం, వాత (Vata), పిత్త (Pitta), కఫా (Kapha) అనే మూడు దోషాలు లేదా మూడు శరీర రకాలు (Body Types) ఉంటాయి. ఈ శరీర రకాలపై ఆధారపడి మనుషుల ఆరోగ్యం ఉంటుందని ఆయుర్వేదం తెలుపుతోంది. ఈ దోషాలను శరీరం, మనస్సు అంతటా కనిపించే జీవ శక్తులుగా ఆయుర్వేదం అభివర్ణిస్తుంది. మానసికంగా, శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ప్రజలు తమ శరీర రకాన్ని లేదా తమ దోషాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. అలా తెలుసుకుంటే తగిన ఆహారం, వ్యాయామం, జీవనశైలి విధానాలను పాటించడం సాధ్యమవుతుంది. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మరి దోషాలను తెలుసుకోవడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏంటి? జీవితాన్ని ఆరోగ్యంగా ఎలా సాగించాలి? లాంటి విషయాలు తెలుసుకుందాం.

దోషాలను తెలుసుకోవడం వల్ల చేకూరే ప్రయోజనాలు

మెరుగైన ఆరోగ్యంతో ఉండొచ్చు. మానసిక ఆరోగ్యం మెరుగుపడటం వల్ల అందరితో మంచి సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. బాడీకి తగిన డైట్ ప్లాన్ చేయొచ్చు. బాడీ టైప్ తెలుసుకోవచ్చు.

వాత: ఈ శరీర రకం గాలి మూలకం వల్ల ప్రభావితమవుతుంది

వాత రకానికి చెందిన వారు బరువు పెరగడంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే వీరి శరీరంలో అద్భుతంగా పనిచేసే జీవక్రియ కొవ్వులను ఇట్టే కరిగిస్తుంది. ఈ కారణంగానే వీరు చాలా సన్నగా ఉంటారు. జలుబు, దగ్గు బారిన ఎక్కువగా పడుతుంటారు. పొడి చర్మ సమస్యలు కూడా వీరిని వేధిస్తాయి. వేగవంతమైన జీవక్రియ కారణంగా, వాత శరీర రకాలు చాలా చురుకుగా, ఫుల్ ఎనర్జీతో ఉంటాయి. వీరు సరిగా నిద్రపోరు. దీని వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. వాత శరీర రకం ఉన్నవారు మానసికంగా చురుకుగానే ఉంటారు కానీ అన్ని విషయాలను వెంటనే జ్ఞాపకం తెచ్చుకోలేరు. కానీ వేగంగా విషయాలను గుర్తుంచుకోగలరు.

ఇదీ చదవండి: రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!


పిత్త: ఈ శరీర రకం అగ్ని మూలకం వల్ల ప్రభావితమవుతుంది

పిత్త శరీర రకానికి చెందిన వారు మరీ సన్నగా, మరీ లావుగా ఉండకుండా మంచి శరీరాకృతితో ఉంటారు. వీరికి బలమైన కండరాలు ఉంటాయి. వారి శరీరం చాలా వెచ్చగా ఉంటుంది. జుట్టు రాలడం వల్ల వారికి త్వరగా బట్టతల వస్తుంది. ఫాస్ట్ గా పనిచేసే మెటబాలిజం ఉంటుంది. కానీ వాత శరీర రకాలు వలె మెటబాలిజం అంత వేగంగా ఉండదు. వీరు కాస్త త్వరగానే వృద్ధాప్యానికి గురవుతారు. పిత్త రకం శరీరం గలవారు ఆహారం, నిద్రను ఇష్టపడతాయి. వీరిని అగ్ని మూలకం పాలిస్తుంది కాబట్టి వేడి వాతావరణం లేదా ఆహారాన్ని ఇష్టపడరు. వీరు మంచి కమ్యూనికేటర్లగా ఉంటారు. వీరు ఆధిపత్యం చెలాయించినా సులభంగా స్నేహితులను చేసుకుంటారు. ఈ శరీర రకం గలవారు చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటూ జీవిత ఆశయాలతో ఉంటారు. పిత్త రకాల వ్యక్తులు చిన్న చిన్న వాటికే చిరాకు పడతారు.

కఫా: ఈ శరీర రకం నీరు, భూమి మూలకాల వల్ల ప్రభావితమవుతుంది

కఫా రకానికి చెందిన వ్యక్తులు సాధారణంగా భారీ కాయంతో చాలా పెద్దగా కనిపిస్తారు. వీరికి విశాలమైన భుజాలు ఉంటాయి. సాధారణంగా అధిక బరువు లేదా ఊబకాయంతో ఉంటారు. అలానే మందపాటి జుట్టు ఉంటుంది. ఈ శరీర రకం ఉన్నవారు సులభంగా బరువు పెరుగుతారు. వీరు ఆయిల్, స్పైసీ జంక్ ఫుడ్‌ను తినడానికి మక్కువ చూపిస్తారు. వారికి బలమైన కండరాలు, ఎముకలు ఉంటాయి. ఈ మూడు శరీర రకాల ప్రకారం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ దోషాలను సమతుల్యం చేసుకోవడం మంచిది.

First published:

Tags: Ayurvedic, Ayurvedic diet, Ayurvedic health tips, Health

ఉత్తమ కథలు