Home /News /life-style /

DO YOU KNOW YOU CAN REDUCE DANDRUFF IN YOUR HAIR WITH HENNA AND HAIR CAN BE CHANGED BEAUTIFULLY PRV

Dandruff: గోరింటాకుతో మీ జుట్టులో చుండ్రును తగ్గించుకోవచ్చంట.. కేశాలను అందంగానూ మార్చుకోవచ్చు.. ఎలాగో తెలుసుకుందాం.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చుండ్రు (dandruff) సమస్య చాలా మందిని వేధిస్తోంది. రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు.. ఇలా ఎన్ని ఉపయోగించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని బాధపడేవారు ఎందరో ఉన్నారు.

మనిషి అందానికి కేశాలు (Hairs) ముఖ్యమే. కానీ,  జుట్టు (hair) రాలిపోతుండటాన్ని(loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. చుండ్రు (dandruff) సమస్య చాలా మందిని వేధిస్తోంది. రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు.. ఇలా ఎన్ని ఉపయోగించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని బాధపడేవారు ఎందరో ఉన్నారు.  గోరింటాకు (henna) పొడిని ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు.. గోరింటాకు (henna) జుట్టుని సైతం బలంగా తయారయ్యేలా చేస్తుంది.

హెన్నా పౌడర్లతో..

మార్కెట్లో మనకు వివిధ రకాల బ్రాండ్లకు చెందిన హెన్నా పౌడర్లు లభిస్తున్నాయి. వాటిలో మీకు నచ్చినదాన్ని హెయిర్ ప్యాక్స్ (hair packs) వేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఒకవేళ వాటిలో రసాయనాలు ఉపయోగిస్తారనుకొంటే మీరే స్వయంగా గోరింటాకు పొడిని తయారు చేసుకోవచ్చు. దీని కోసం గోరింటాకును నీడలో ఆరబెట్టి.. మిక్సీలో వేసి మెత్తటి పొడిగా తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సైతం ఉండవు.

గోరింటాకు నాలుగు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం (Lemon), టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె (Olive oil), టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, మెంతుల పొడి చెంచా, పెరుగు (curd) రెండు టేబుల్ స్పూన్లు. శుభ్రమైన గిన్నెలో అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని12 గంటల పాటు పక్కన పెట్టి ఉంచేయాలి. దీనిని రాత్రి సమయంలో (night time) నాన బెట్టుకొంటే ఉదయం (morning) ఉపయోగించడానికి వీలుగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నుంచి మూడు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. మీ జుట్టు డ్రై హెయిర్ అయితే తలస్నానం తర్వాత కండిషనర్ రాసుకోవాల్సి ఉంటుంది. వారానికి ఒకసారి (weekly once) ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు (dandruff) సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఇది కూడా చదవండి: ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

నిమ్మరసంతో..

నిమ్మరసం (lemon juice) వివిధ రకాల కారకాలను కలిగి ఉండి, జుట్టు (hair)ను తాజీకరణకు గురి చేసి, డాండ్రఫ్ ను తొలగిస్తుంది. నిమ్మరసాన్ని సేకరించి, ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేసి, పూర్తి రాత్రి అలాగే వదిలేయండి. తరువాత రోజు చల్లటి నీటితో జుట్టు (hair)ను కడిగి వేయండి. లేదా వేడి చేసిన రెండు భాగాల కొబ్బరి నూనె (coconut oil)లో ఒక భాగపు నిమ్మరసం కలపండి. రోజు వెంట్రుకల  (hairs) మొదల్లకు మసాజ్ చేసి ఫలితాలను చూడండి.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Beauty tips, Dandruff, Hair fall, Life Style

తదుపరి వార్తలు