Home /News /life-style /

DO YOU KNOW WITH TURMERIC PACK WE CAN REDUCE BODY PAINS LIKE SHOULDERS FOLLOW THESE TIPS PRV

Shoulder pain: భుజం నొప్పి ఎక్కువగా ఉంటుందా? అయితే నొప్పి తగ్గాలంటే పసుపు చాలు.. ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామందిలో భుజం నొప్పి చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని అసలు భుజం నొప్పి (shoulders pain) తగ్గదు. ఇక భుజం నొప్పితో తీవ్రంగా బాధపడేవారు ఖచ్చితంగా ఈ సింపుల్ టిప్స్ పాటించండి.

    రోజంతా పనిచేసి ఇంటికి చేరుకున్నాక ఒంటినొప్పులు (body pains) మరో బాధను తెచ్చిపెడుతాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా.. ఇంటి బాధ్యతలు నిల్చోనివ్వవు, కూర్చోనివ్వవు.  మరోవైపు కరోనా తెచ్చిన సమస్యలు మనిషిని అతలాకుతలం చేసింది. సగటు జీవి ఆర్థికంగానూ బలహీన పడటంతో మళ్లీ గాడిలో పడటానికి నానా తంటాలు పడుతున్నారు. ఎక్కువ సమయం (time) పనిచేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ అధికమవుతోంది. నొప్పులు (pains) తెచ్చిపెడుతోంది. అటువంటి పరిస్థితిలో చాలా సార్లు వారు కూడా పెయిన్ కిల్లర్స్ (pain killers) తీసుకుని తమ పనిని పూర్తి చేస్తుంటారు. కానీ, పదేపదే నొప్పి నివారణ మందులు తీసుకోవడం శరీరానికి ప్రయోజనకరం కాదట. అందుకే ఈ ఒంటినొప్పులు (body pains) తగ్గించడానికి కొన్ని చిట్కాలు (health tips) పాటిస్తే సరి. ఇక చాలామందిలో భుజం నొప్పి చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని అసలు భుజం నొప్పి (shoulders pain) తగ్గదు. ఇక భుజం నొప్పితో తీవ్రంగా బాధపడేవారు ఖచ్చితంగా ఈ సింపుల్ టిప్స్ పాటించండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే పసుపుతో నొప్పి దూరం చేసుకోవచ్చంట.

    ఒక గిన్నె తీసుకుని అందులో మూడు స్పూన్ల ప‌సుపు (Turmeric) ఇంకా అలాగే నాలుగు స్పూన్ల కొబ్బ‌రి నూనె వేసి బాగా కలపాలి. ఇక ఈ మిశ్ర‌మాన్ని మీ భుజాల‌కు (shoulders) అప్లై చేసిన తరువాత అది బాగా డ్రై అయ్యేవరకూ ఉండాలి. ఇక ఆ తర్వాత వేడి నీటి (hot water)తో శుభ్రం చేసుకోవాలి. ఇక ఇలా కనుక రోజూ ఉదయం ఇంకా సాయంత్రం కనుక చేస్తే.. మీకు మీ తీవ్రమైన భుజం నొప్పి నుంచి ఉపశమనం అనేది మీకు లభిస్తుంది.

    కండరాలు బలహీనమైనప్పుడు

    ఇక అలాగే మీ కండరాలు (muscles) అనేవి బలహీనమైనప్పుడు కూడా మీకు భుజాలు నొప్పులు అనేవి వస్తాయి. కాబట్టి మీరు తినే ఆహారంలో కండ‌రాల‌కు బలం ఇచ్చే ఆహార పదార్ధాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక అంతేకాదు భుజాల నొప్పి (shoulder pain)తో బాధ ప‌డే వారు ఆట‌లు అసలు ఆడకూడదు. అలాగే అసలు బ‌రువైన వ‌స్తువులు  ఎత్తకూడదు. ఇక వారు ఎక్కువ సమయం పాటు విశ్రాంతి (rest) తీసుకోవాలి. నిపుణులు సూచించిన కొన్ని యోగాసనాలు కనుక వేస్తే వారికి భుజాల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  మీ మోకాళ్ల అందం తగ్గిపోతుందా? నల్లగా మారుతున్నాయా? అయితే ఇలా చేసి సమస్య దూరం చేసుకోండి
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Ayurvedic medicine, Health Tips, Life Style, Turmeric

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు