Home /News /life-style /

DO YOU KNOW WITH DARK CHOCOLATES WE HAVE AMAZING BENEFITS RNK

Dark chocolates: వావ్‌..డార్క్‌ చాకొలేట్స్‌లో ఇన్ని బెనిఫిట్స్‌ ఉంటాయా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డార్క్‌ చాకొలెట్స్‌లో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల మన శరీరానికే కాదు, చర్మానికి కూడా రక్షణ అందుతుంది.

Health benefits with dark chocolates: డార్క్‌ చాకొలేట్స్‌ తినకూడదేమో అని కొందరి అపోహ. కానీ, అది నిజం కాదు కొందరు స్టడీస్‌ ప్రకారం డార్క్‌ చాకొలేట్స్‌లను మన డైట్‌లో భాగంగా చేసుకోవాలని చెబుతున్నాయి. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయట. అవేంటో తెలుసుకుందాం.

  • డార్క్‌ చాకొలేట్స్‌ (dark chocolates)లో ముఖ్యంగా కెఫైన్‌ ఉంటుంది. ఇందులో ఉండే కొకొవా Cocoa సత్వరమే బ్రెయిన్‌ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో ఏ యాడెడ్‌ షుగర్‌ లేని ఎనర్జి డ్రింక్‌ తీసుకోకుండానే మెదడు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ చాకొలేట్స్‌ తినడం వల్ల పనిపై ఫోకస్, అటెన్షన్‌ పెరుగుతుంది. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది.

  • అందుకే గర్భవతులను కూడా ఒకనొక సమయంలో కచ్ఛితంగా ఏవైనా డార్క్‌ చాకొలెట్స్‌ తినమని సూచిస్తారు.

  • చర్మానికి కూడా ఇది ఎంతో మేటు చేస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీంతో చర్మంపై ఉండే ఏవైన డ్యామేజెస్‌ను తొలగించి సాఫ్ట్‌గా ఉంచుతుంది.


ఇది కూడా చదవండి: సాయంత్రం వ్యాయామం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?



  • డార్క్‌ చాకొలేట్స్‌లో ఫ్లవనాయిడ్స్‌ (Flavounoids) ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. స్కిన్‌ కేన్సర్‌ వంటి ఇతర చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా నివారించవచ్చు. ఎండ వల్ల వచ్చే స్కిన్‌ అలర్జీలకు కూడా ఈ చాకొలెట్స్‌తో చెక్‌ పెట్టవచ్చు.

  • అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్‌ (Anti oxidants )కేవలం డార్క్‌ చాకొలేట్స్‌లోనే ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం.. ఏ పండ్లలోని యాంటి ఆక్సిడెంట్స్‌ కేవలం డార్క్‌ చాకొలేట్స్‌లోనే ఉన్నాయని అంటున్నాయి. ఇవి శరీరాన్ని ఆక్సిడైజింగ్‌ ఏజెంట్‌గా రక్షిస్తాయట.

  • ఈ చాకొలెట్స్‌తో మూడ్‌ కూడా బూస్ట్‌ అవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇందులో ఉండే న్యూరోట్రాన్స్‌మిటర్, డొపామైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్‌ మూడ్‌ను పెంచే గుణం ఉంటుందట.


ఇది కూడా చదవండి: డిమెన్షియాతో బాధపడుతున్నారా? బెస్ట్ హోం రెమిడీస్..


డార్క్‌ చాకొలట్స్‌తో తక్షణ శక్తి అందుతుంది. ఒకవేళ మీకు లోబీపీ, మబ్బుగా ఉంటే ఇవి తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్‌ తక్షణమే పెరుగుతుంది.

  • ఈ డార్క్‌ చాకొలేట్స్‌ను తగిన మోతాదులో తరచూ తీసుకుంటే.. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌తో ఫైట్‌ చేస్తాయి. బాడీలో ఇన్సూలిన్‌ స్థాయిని కూడ తగ్గిస్తుంది.

  • ఇందులో ఫ్లవనాయిడ్స్‌ పుష్కలంగా ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. తద్వారా శరీరానికి వేడి చేసినట్లు ఉంటే వెంటనే తగ్గిపోతుంది.

Published by:Renuka Godugu
First published:

Tags: Health benefits

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు