Beauty tips: పెరుగుతోనే మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు..  ఏం చేయాలంటే.

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా, మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటే అందంగా కనిపిస్తారు. చాలా మందికి అనేక కారణాలతో మొటిమలు (Pimples), మచ్చల సమస్యలు ఎదురవుతాయి. ఎన్ని క్రీమ్స్ (Creams) రాసినా అంతగా ఫలితం ఉండదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ (side effects) ఎదురవుతాయి. అలా కాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే మీరు సమస్యని దూరం చేసుకుని అందంగా మారొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

  • Share this:
    వాతావరణంలో అసలే పొల్యూషన్(pollution)​ ఎక్కువ. ముఖాన్ని(face) పొల్యూషన్​ నుంచి రక్షించుకోవడానికి(save) ముందు మనం చేసే చిన్నచిన్న పనులే మనకు అందాన్ని(beauty) తెచ్చిపెడుతాయి. అయితే చాలా మందికి ఓ అపోహ ఉంటుంది. అదేంటంటే.. తెల్లగా ఉంటే చాలు అందంగా కనిపిస్తారని.. కానీ, అది ఎంత మాత్రం కానే కాదు.. ఏ రంగులో ఉన్నా.. ముఖం తాజాగా, మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటే అందంగా కనిపిస్తారు. చాలా మందికి అనేక కారణాలతో మొటిమలు (Pimples), మచ్చల సమస్యలు ఎదురవుతాయి. ఎన్ని క్రీమ్స్ (Creams) రాసినా అంతగా ఫలితం ఉండదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ (side effects) ఎదురవుతాయి. అలా కాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే మీరు సమస్యని దూరం చేసుకుని అందంగా మారొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

    మొటిమలు మాయం..

    పెరుగు (curd)లో చర్మానికి మేలు చేసే గుణాలు ఉన్నాయి. దీని వాడడం వల్ల చర్మ కాంతి ( skin brightness) మెరుగవ్వడమే కాకుండా.. మొటిమలు, మచ్చలు ఇలా చాలా వరకూ అన్ని సమస్యలు దూరం అవుతాయి.

    ఎలా చేయాలంటే..

    ఎలా ప్యాక్ వేసుకోవాలంటే.. పెరుగు (curd)లో కొద్దిగా నిమ్మరసం (lemon juice) కలిపి ముఖానికి రాయండి.. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటి (water)తో కడుక్కోండి. అనంతరం ముఖానికి ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా రెగ్యులర్‌ (regular)గా చేస్తుంటే ముఖం (face) మెరుస్తుంటుంది.

    టమాట (Tomato)లో కూడా చర్మ కాంతి (skin bright)ని మెరుగుపరిచే ఎన్నో గుణాలు ఉంటాయి. కాబట్టి, దీంతో కూడా ప్యాక్ వేసుకోవచ్చు. ఇందుకోసం టమాట గుజ్జుని తీసుకుని అందులో ముల్తానీ మట్టి వేసుకుని ప్యాక్‌లా తయారు చేసుకోండి. దీన్ని ముఖానికి (face) ప్యాక్‌లా వేసి ఆరిన తర్వాత క్లీన్ (clean) చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గి అందంగా (beauty) కనిపిస్తారు

    అయితే, ఫేస్ ప్యాక్స్ (pace pack) వేసుకోవడం కాదు.. ప్యాక్స్ వేసుకునే ముందు (before pack), తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా… ఏ ప్యాక్ వేసుకునే ముందు అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడిగిన తర్వాతే ప్యాక్స్ (packs) వేసుకోవాలి. అంతేకానీ, దుమ్ము (dust), ధూళి ఉన్న ముఖంపై కాదు.. అప్పుడే అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి.

    ప్యాక్స్ క్లీన్ చేసుకున్న తర్వాత కచ్చితంగా ఏదైనా మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ విషయం మరిచిపోవద్దు (don’t forget). లేకపోతే ముఖం (face) అప్పుడే ముఖానికి తేమ అందుతుంది. కాబట్టి కచ్చితంగా ముఖానికి ప్యాక్ రాసిన ప్రతిసారి మాయిశ్చరైజర్ రాయాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
    Published by:Prabhakar Vaddi
    First published: