Home /News /life-style /

DO YOU KNOW WHY THE RUSSIANS WANT BIRD DROPPINGS ON THEM PRV

Strange hopes: తమ మీద పిట్ట రెట్ట వేస్తే బాగుంటుందనుకుంటున్న రష్యన్లు.. ఎందుకో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పక్షి(bird) రెట్ట వేయాలని రష్యన్లు ఎక్కువగా కోరుకొంటూ ఉంటారంటా. కుక్క మలాన్ని తొక్కితే కూడా ధనం వస్తుందని అనుకునే మునుషులూ ఉన్నారట. అద్దంలో చూసుకుంటే కీడు కలుగుతుందనే వింత వింత నమ్మకాలు ఉన్నాయట. ఇంతకీ ఇలాంటివి ఎక్కడున్నాయో ఓ సారి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  నమ్మకాలు(hopes).. కొన్ని నమ్మకాలు మంచిని పంచితే, మరికొన్ని వింత(strange) వింతగా అనిపిస్తాయి. చాలా వరకు నమ్మకాలు శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. అందుకే వాటిని మూఢ నమ్మకాలు(Superstitions) అంటారు. మంగళవారం జుట్టు కత్తిరించుకోకూడదు. ఆరు దాటితే కుంకుమ ఇవ్వకూడదు. శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు. లాంటివి ఒకటేమిటి వందల్లోనే ఉన్నాయి. అయితే ఈ మూఢ నమ్మకాలకు మన దేశం పుట్టినిల్లు(birth place) లాంటిదని అంటుంటారు. ఇక్కడ తప్ప మరెక్కడా ఉండవనుకోవడం అపోహే. విదేశాల్లోనూ ఇలాంటి వింత వింత నమ్మకాలు(strange hopes) ఉంటాయి. పక్షి(bird) రెట్ట(poop) వేయాలని రష్యన్లు ఎక్కువగా కోరుకొంటూ ఉంటారంటా. భారతీయులైతే కాకి(crock) మేత కానీ, కట్టెలు కానీ ముక్కున కరుచుకుని ఎడమ నుండి కుడిప్రక్కకు వెళ్తే కార్యజయం కలుగుతుందని, కాకినోట మరో కాకి ఆహారం పెట్టేపుడు చూస్తే సౌఖ్యం కలుగుతుంది అని అనుకుంటారట. అంతేనా కుక్క మలాన్ని తొక్కితే కూడా ధనం వస్తుందని అనుకునే మునుషులూ ఉన్నారట. అద్దంలో చూసుకుంటే కీడు కలుగుతుందనే వింత వింత నమ్మకాలు ఉన్నాయట. ఇంతకీ ఇలాంటివి ఎక్కడున్నాయో ఓ సారి తెలుసుకుందాం..

  రష్యన్ల(Russians) గురించి చెప్పాలంటే అంతా ఇంతా కాదు. మనిషి మీద ఆకాశంలో ఎగిరే పిట్ట రెట్ట(poop) వేస్తే, ఆ వ్యక్తికి బోలెడు ధనం(money) కలిసి వస్తుందని వారి నమ్మకం. అప్పటివరకు తమకున్న కష్టాలు(problems) తొలగిపోతాయని రష్యాలో అనుకుంటారట. అక్కడ రష్యన్లు అంతా పిట్టరెట్ట(bird dropping) వేస్తే ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఉంటారట. అక్కడో ఎక్కడో వెరో ఒకరు ధనవంతులైనట్లు ఏవేవో ఉదాహరణలు చెబుతూ ఉంటారు మన రష్యన్లు. ఇండియాలో శకునాల గురించి ఆదికాలం నుంచే విశ్వాసాలున్నాయి. వాటిలో కాకి శకునం ఒకటి. ప్రయాణమై మనం వెళ్తున్నప్పుడు కాకి(crock) అరుస్తూ ఎదురుగా వచ్చిందంటే ఆ కార్యం విఫలమవుతుందట. కాకి తొలుత ఎడమ వైపున ఆ తర్వాత కుడి వైపున అరుచుకుంటూ వెళితే దొంగల భయం ఉన్నట్లు. వెనుకవైపు చేరి అరిస్తే ధన లాభం కలుగుతుంది. ఎడమ భాగాన అరిచి ఎదురుగా వస్తే మార్గమధ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఐతే ఇది బాటసారులు కానివారికి శుభ శకునముగా తెలుపబడి ఉంది. కాకి ఎదురుగా అరిచి కుడివైపుగా వెనుక నుంచి వెళ్తే ప్రాణ భయం ఉన్నట్లు చెబుతారు. తల మీద కాకి రెట్ట(bird dropping) వేస్తే కార్య జయం కలుగుతుంది. భోజన ప్రాప్తి కలుగుతుందట.

  మన దేశంలో బయటికి వెళ్ళేటప్పుడు నల్లపిల్లి ఎదురైతే అశుభం. కానీ, జర్మన్లు(Germans) నల్లపిల్లి ఎదురైతే శుభంగా భావిస్తారు. నల్లపిల్లి కుడి నుండి ఎడమకు వెళితే శుభంగా, ఎడమ నుండి కుడికి వెళ్తే అశుభంగా పరిగణిస్తారు. కుక్క మలాన్ని ఒకవేళ మనం తొక్కితే ఛీ.. ఛీ.. అంటాం. కానీ ఫ్రాన్స్‌లో ఆలా కాదు. కుక్క మలాన్ని ఎడమ కాలితో తొక్కితే ధనము, ఐశ్వర్యము సిద్ధిస్తుందని ఫ్రాన్స్(France) వాసుల నమ్మకము. కుడికాలితో తొక్కితే కీడు జరుగుతుందని నమ్ముతారు. తుమ్మితే ఎక్కడో దూరప్రాంతాల్లో ఉండే తమ బంధువులు లేదా స్నేహితులు తమ గురించి తలుచుకుంటూ ఉంటారని గ్రీస్ వాసుల నమ్మకం. టెక్నాలజీ(technology)కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న జపాన్‌(Japan)లో కూడా మూఢనమ్మకాలు పాటిస్తారు. జపనీయులు రాత్రుళ్లు అద్దంలో ముఖం చూసుకోరట. ఆ సమయంలో ఆత్మలు అద్దంలో కనిపిస్తాయని.. మనిషిలో ప్రవేశించి నష్టం కలిగిస్తాయని చెబుతారు. డెన్మార్క్ వాసులు కూడా పగిలిన వంట సామాగ్రి ఇంట్లో ఉండకూడదని.. ఉంటే కీడు కలుగుతుందని నమ్ముతారు. బయటికి వెళ్ళేటప్పుడు నిండు గ్లాస్‌ను చూస్తే, ఆ రోజంతా మంచే జరుగుతుందని బంగ్లా(Bangladesh) ప్రజలు నమ్ముతారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Birds, Japan, Life Style, Russia

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు